ఎప్పుడైనా అక్రమాలు చేసినావారు దొరక్క మానరు... కొంచెం లేట్ అవుతుంది అంతే... ఎంత మందిని మ్యానేజ్ చేసినా, నిజం ఎదో ఒక రోజు బయటపడుతుంది... వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అక్రమాస్తుల కేసు విషయంలో అదే జరిగింది...

నాలుగేళ్ల కిందట జగన్ కి బెయిల్ ఇచ్చే విషయంలో, చేసిన ఒక తప్పును సీబీఐ ఇప్పుడు సరిదిద్దుకుంది. జగన్ అప్పటికే జైలులో 16 నెలలు ఉన్నారు... అయితే జగన్ బెయిల్ పిటీషన్ పై, ఆ రోజు, అంటే 2013 సెప్టెంబరు 23న సీబీఐ కోర్టులో వేసిన ఒక పిటీషన్ వేసింది. కేసు దర్యాప్తు పూర్తయిందని, సండూర్‌ పవర్‌ లిమిటెడ్‌, కార్మెల్‌ ఏషియా హోల్డింగ్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ తదితర ఎనిమిది కంపెనీలకు క్విడ్‌ప్రోకో ఏమి లేదు అని ఆ మెమోలో పేర్కొంది.

అప్పట్లో ఇది ఒక సంచలనం అయింది... ఎవరి ప్రయోజనాల కోసం ఆ రోజు సిబిఐ ఇలా వ్యవహిరించిందో కాని, అప్పుడు జగన్ బెయిల్ కోసం, కాంగ్రెస్ పార్టీ, సోనియా గాంధీతో లాలూచి పడ్డాడు అనే ఆరోపణలు వచ్చాయి.. కాని, జగన్ ప్రధన కంపనీలలో, సండూర్‌ పవర్‌ లిమిటెడ్‌, కార్మెల్‌ ఏషియా హోల్డింగ్స్‌ ప్రధాన కంపనీలు...ఇలాంటి కంపనీలలో ఆ రోజు, ఏమి అక్రమం లేదు అని సిబిఐ మేమో దాఖలు చేసి, జగన్ కు బెయిల్ ఇప్పించింది..

అయితే ఎవారు ఊహించని విధంగా, సీబీఐ ఈ ఏడాది ఆగస్టులో సీబీఐ కోర్టులో మరో మెమో దాఖలు చేసినట్లు తాజాగా బయటకు వచ్చింది. సండూర్‌ పవర్‌, కార్మెల్‌ ఏషియాతో కలసి ఆదాయపు పన్ను శాఖ, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌, కంపెనీల రిజిస్ట్రార్‌ల పరిధులకు సంబంధించిన వివిధ ఉల్లంఘలకు పాల్పడిందని సిబిఐ కోర్ట్ కి తెలిపింది.

రాష్ట్రపతి ఎన్నికలు ముగిసిన వెంటనే, సిబిఐ ఇలా చెయ్యటం, ఇప్పుడు వెలుగులోకి వచ్చింది... అందుకే గత రెండు నెలలు నుంచి, జగన్ మోహన్ రెడ్డి టెన్షన్ తో ఉన్నారని, సిబిఐ తీసేసిన అభియోగాలు, మళ్ళీ ఆధారాలుతో సహా కోర్ట్ కి ఇవ్వటంతో, జగన్ లో వణుకు మొదలై, కేంద్రాన్ని ప్రసన్నం చేసుకుంటున్నారని వార్తలు వస్తున్నాయి.

ఇవన్నీ చూసుకుంటే, జగన్ కేసు తీవ్రత రోజు రోజుకీ ఎక్కవు అవుతుంది.. పాదయాత్రకు శుక్రువారం మినహియింపు ఇచ్చే అవకాశం కూడా లేదు అని స్పష్టం అవుతుంది... కేసులు కూడా స్పీడ్ అందుకునే అవకాశం ఉండటంతో, జగన్ లో ఆందోళన మొదలైంది అని లోటస్ పాండ్ వర్గాలు అంటున్నాయి..

Advertisements

Advertisements

Latest Articles

Most Read