YS వివేక కేసు పై కొన్ని రోజుల తరువాత సిబిఐ విచారణ మళ్ళీ మొదలయింది. కడప జిల్లాలోని పులివెందుల R&B గెస్ట్ హౌస్ లో విచారణ కొనసాగుతుంది. ఈ కేసులో నిందితులుగా ఉన్న ముగ్గురు ఈ విచారణకు హాజరు అయినట్టు సమాచారం. సాక్షి విలేఖరిగా పనిచేస్తున్న బాలకృష్ణారెడ్డి ఈ రోజు సిబిఐ విచారించినట్టు తెలుస్తుంది. ప్రస్తుతం నెల్లూరు జిల్లా విలేఖరిగా పనిచేస్తున్న ఈ బాలకృష్ణారెడ్డి అప్పట్లో వివేక హ-త్య జరిగినప్పుడు కడప జిల్లా రిపోర్టర్ గా పని చేసారు. వివేక హ-త్య జరిగిన రోజు శివశంకర్ రెడ్డి, బాలకృష్ణారెడ్డికి ఫోన్ చేసి వివేకా గుండె పోటుతో చనిపోయారని సమాచారం ఇచ్చారట. అయితే ఇతన్నే కాకుండా పులివెందుల, జమ్మలమడుగు కు సంబందించిన సాక్షి విలేఖరులను, మీడియా ప్రతినిదినులను ఇప్పటికే విచారించారు. అయితే ఈ కేసుకు సంబంధించి ఉదయ్ కుమార్ రెడ్డి ని కూడా సిబిఐ విచారించింది. యురేనియం కంపెనీ లో పనిచేస్తున్న ఈ ఉదయ కుమార్ రెడ్డి కోసం సిబిఐ ఆ కర్మాగారానికే వెళ్లి విచారించింది . వివేక చనిపోయినప్పుడు ఈ ఉదయ తండ్రి ప్రకాష్ రెడ్డి వివేక తలకు కుట్లు వేసినట్టు సమాచారం. మరోవైపు పులివెందులలో గంగి రెడ్డి హాస్పిటల్ పనిచేస్తున్న డా.మధుసూదనరెడ్డి ని కూడా ఈ కేసులో విచారిచాల్సి ఉంది.
వివేక కేసులో కీలక పరిణామం... సాక్షి విలేఖరులను విచారణకు పిలిచిన సిబిఐ...
Advertisements