రాజశేఖర్ రెడ్డి సియంగా ఉండగా, తండ్రి అధికారాన్ని అడ్డు పెట్టుకుని జగన్ మోహన్ రెడ్డి అక్రమంగా ఆస్తులు సంపాదించారు అంటూ, సిబిఐ జగన్ మోహన్ రెడ్డి పైన 11 కేసులు పెట్టింది. అలాగే ఈడీ కూడా 5 కేసులు పెట్టింది. ఈ కేసులు 2012లో పెట్టారు. అయితే అప్పటి నుంచి కూడా ఈ కేసులు ఒక కొలిక్కి కూడా రాలేదు. ఈ కేసులు ఇంకా ట్రయల్స్ వరకు రాలేదు. ప్రతి వారం జగన్ మోహన్ రెడ్డి కోర్టుకు రావాలని అన్నారు. తరువాత రోజు వారీ విచారణ అని అన్నారు. అయినా కూడా కేసులు ముందుకు వెళ్ళటం లేదు. ఇందుకు నిందితులు రకరకాల ట్రిక్స్ ఉపయోగిస్తున్నారు. ఎలాగైనా కేసులు మరింత లేట్ చేయాలని, డిశ్చార్జ్ పిటీషన్ లు, క్వాష్ పిటీషన్ లు వేస్తూ, ఎప్పటికప్పుడు కేసు సాగతీసేలా చేస్తున్నారు. అయితే ఈ పిటీషన్ లు కూడా ఒక్కోటి వీగిపోతూ వస్తున్నాయి. దీంతో మరో ఎత్తుగడకు తెర లేపారు. ఈ క్వాష్ పిటీషన్ లు విచారణ దశలో ఉన్నవి ఉపసంహరించుకోవటం మొదలు పెట్టారు. ఈ ఎత్తుగడలు గమనించిన సిబిఐ తీవ్ర అభ్యంతరం చెప్తుంది. ఎప్పుడో అయిదేళ్ల క్రితం, తమ పేర్లను జగన్ కేసుల నుంచి తప్పించాలి అంటూ వేసిన పిటీషన్లు, ఇప్పుడు మరో ఇద్దరు నిందితులు ఉపసంహరిమ్చుకున్నారు. ఈ మధ్య కాలంలోనే, దాల్మియా సిమెంట్స్ ఎండీ పునీత్ దాల్మియా ఇలాగే ఉపసంహరించుకున్నారు.

cbi 21122021 2

ఇది వరకు వేసిన క్వాష్ పిటీషన్ ను ఉపసంహరించుకున్నారు. ఇప్పుడు తాజాగా మరో ఇద్దరు నిందితులు, ఇలాగే ఉపసంరించుకున్నారు. వారిలో, ఇందూ శ్యాంప్రసాద్ రెడ్డి, మాజీ అధికారి బీపీ ఆచార్య ఉన్నారు. ఇద్దరూ కూడా, గతంలో వేసిన క్వాష్ పిటీషన్ ను వెనక్కు తీసుకున్నారు. ఈ పిటీషన్ లు అయిదేళ్ల క్రితం వేయగా , నిన్న విచారణకు రాగానే, వీరి ఇద్దరి తరుపున న్యాయవాదులు వచ్చి, ఈ కేసులు వెనక్కు తీసుకుంటున్నట్టు చెప్పారు. దీనికి కోర్టు అనుమతి కావాలని, కోర్టుని కోరారు. అయితే ఈ ఎత్తుగడను పసిగట్టిన సిబిఐ అభ్యంతరం తెలిపింది. ఎప్పుడో అయిదేళ్ల పాటు ఈ కేసు పై స్టే తీసుకుని, ఇప్పుడు విచారణ రాగానే, వెనక్కు తీసుకోవటం పట్ల సిబిఐ న్యాయవాది అభ్యంతరం తెలిపారు. ఇక్కడ వెనక్కు తీసుకుని, మళ్ళీ కింద కోర్టుకు వెళ్లి, అక్కడ ఏదో ఒక వివాదం మళ్ళీ రేపి, మళ్ళీ కేసులు లేట్ చేసే వ్యూహం ఇందులో ఉందని కోర్టుకు తెలిపారు. వీటికి అనుమతి ఇవ్వకూడదని అన్నారు. అయితే దీనికి కోర్టు ఒప్పుకోలేదు. వెనక్కు తీసుకునే హక్కు వారికి ఉందని, మళ్ళీ పిటీషన్ వేస్తే మాత్రం, వెంటనే విచారణ జరపాలని ఆదేశించింది.

Advertisements

Advertisements

Latest Articles

Most Read