రోజు వారీ కేసులు విచారణలో భాగంగా సిబిఐ ప్రత్యేక న్యాయస్థానంలో, ఈ రోజు జగన్ మోహన్ రెడ్డి అక్రమ ఆస్తుల కేసుని సంబంధించి, పలు చార్జ్ షీట్ల పైన విచారణ జరిగింది. ఆరు చార్జ్ షీట్ల పైన విచారణ జరిగింది. జగతి పబ్లికేషన్స్, రాంకీ ఫర్మా, వాన్ పిక్, దాల్మియా సిమెంట్స్, పెన్నా సిమెంట్స్, హౌసింగ్ బోర్డు కు సంబంధించిన పిటీషన్లు వాటితో పాటు, వేసిన వివిధ డిశ్చార్జ్ పిటీషన్లకు సంబంధించిన విచారణ జరిగింది. అయితే, ఈ రోజు కూడా జగన్ మోహన్ రెడ్డి విచారణకు హాజరు కాలేదు. ముఖ్యమంత్రిగా వివిధ అధికారిక కార్యక్రమాలు ఉన్నాయని, అందుకే విచారణకు హాజరు కాలేక పోతున్నా అని, నేటి విచారణకు మినహాయింపు ఇవ్వాలని కోరుతూ, జగన్ మోహన్ రెడ్డి పిటీషన్ దాఖలు చేసారు. ఇది ప్రతి విచారణకు చేస్తున్న పనే. అయితే సిబిఐ ఈ సారి మాత్రం, ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రతి విచారణకు ఇదే సాకు చెప్తున్నారని, రోజు వారీ విచారణ జరుగుతున్నప్పుడు, రోజు విచారణకు మినహయింపు కోరుతున్నారని, సిబిఐ అభ్యంతరం చెప్పింది. ప్రతి రోజు ఇదే మినహాయింపు ఎలా ఇస్తారని, ఎంత కాలం ఇలా మినహాయింపు కోరతారని, సిబిఐ న్యాయస్థానం అసహనం వ్యక్తం చేసింది. అయితే ప్రతి విచారణకు హాజరు కావాలని గతంలో సిబిఐ కోర్టు ఇచ్చిన ఆదేశాలను, హైకోర్టులో తాము అపీల్ చేసామని జగన్ మోహన్ రెడ్డి తరుపు న్యాయవాది కోర్టుకు తెలిపారు.

cbi jagan 21122021 2

అయితే హైకోర్టులో దీనికి సంబంధించిన విచారణ ఇటీవలే పూర్తయ్యిందని, త్వరలో దీనికి సంబంధించిన తీర్పు రాబోతుందని, జగన్ మోహన్ రెడ్డి తరుపు న్యాయవాది, సిబిఐ కోర్టు దృష్టికి తెచ్చారు. అయితే అప్పటి వరకు, అంటే తీర్పు వచ్చే వారకు, ఈ విషయం సిబిఐ కోర్టు దృష్టికి తీసుకుని రావాలని, హైకోర్టు చెప్పిందని సిబిఐ కోర్టు చెప్పారు. అయితే సిబిఐ కోర్టు మాట్లాడుతూ, ఇవన్నీ తమ దృష్టిలో లేవని, ఈ విషయం మొత్తం రాత పూర్వకంగా, మెమో రూపంలో దాఖలు చేయాలని , జగన్ కు సిబిఐ కోర్టు ఆదేశించింది. సిబిఐ కోర్టు ఆదేశాల మేరకు, జగన్ , సిబిఐ కోర్టులో మెమో దాఖలు చేసారు. విచారణకు మినహాయింపు ఇవ్వాలని కోరారు. దీంతో ఇవాల్టి విచారణకు సిబిఐ కోర్టు మినహాయింపు ఇచ్చింది. అయితే ఉన్నట్టు ఉండి ఇప్పుడు సిబిఐ, జగన్ మినహాయింపుల పై అభ్యంతరా చెప్పటం చర్చనీయంసం అయ్యింది. సహజంగా సిబిఐ, ఢిల్లీలో హోం శాఖ ఏమి చెప్తే అదే చేస్తుంది. ఇప్పుడు ఈ పరిణామాలు, రాజకీయంగా కూడా గమనించాలి.

Advertisements

Advertisements

Latest Articles

Most Read