ప్రతి శుక్రవారం కోర్ట్ కు హాజరయ్యే జగన్, ఇవాళ కూడా అనంతపురంలో పాదయాత్ర ఆపి మరీ హైదరాబాద్ సిబిఐ కోర్ట్ కి జగన్ హాజరయ్యారు... కాని, ఇక్కడ జగన్ కు అనూహ్య పరిణామం ఎదురైంది... విచారణ ఉంటుంది అనుకుని, జగన్ తో పాటు అతని లాయర్లు కూడా కోర్ట్ కి వచ్చారు... అనూహ్యంగా ఇవాళ సీబీఐ న్యాయస్థానం జడ్జి సెలవులో ఉండటంతో, ఇవాళ జగన్ కేసు విచారణ లేదు అని చెప్పటంతో జగన్ మొఖం వెలిగిపోయింది... అటు సెలవు దొరికింది, ఇటు కోర్ట్ లో జడ్జి లేకపోవటంతో, జగన్ ఆనందానికి అవధులు లేవు... స్కూల్ లో టీచర్ లేకుండా గ్రౌండ్ కి తీసుకువెళ్ళి ఆడిస్తే పిల్లలు ఎంత సంతోష పడతారో, జగన్ అంత సంతోషంగా ఉన్నారు...
ఇవాళ సీబీఐ న్యాయస్థానం జడ్జి సెలవులో ఉండటంతో, కేసు విచారణ ఇవాళ లేదు, కేసును వచ్చే శుక్రవారం 22వతేదీకి వాయిదా వేశారు. ప్రజాసంకల్ప యాత్ర పేరుతో ఏపీలో పాదయాత్ర నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ పాదయాత్ర అనంతపురం జిల్లాలో కొనసాగుతోంది. శుక్రవారం కోర్టు వాయిదా ఉండడంతో పాదయాత్రకు స్వల్ప విరామం ప్రకటించి హైదరాబాద్ వచ్చారు. అక్రమాస్తుల కేసులో ఆయన 11 సిబిఐ కేసుల్లో A1...వీటికి ఈడీ కేసులు అదనం... బెయిల్ మీద షరతులతో బయట తిరుగుతున్నాడు... ఇప్పటికే సిబిఐ 43 వేల కోట్లు అవినీతి సొమ్ము నోక్కేసాడు అని కోర్ట్ కి చెప్పింది... 16 నెలలు జైలు జీవితం కూడా గడిపివచ్చారు...
ఈయన నాన్న ముఖ్యమంత్రి అవ్వక ముందు, ఆస్తలు అమ్ముకుని బ్రతికిన చరిత్ర నుంచి, ఇప్పుడు బంగాళాలు, ప్యాలస్ లు, ఎస్టేట్ లు, కంపెనీలు వరకు వచ్చారు... అయితే ఇప్పుడు సుప్రేం కోర్ట్ కూడా ప్రజా ప్రతినిధుల మీద ఉన్న కేసులు ఏడాది లోపు విచారణ పూర్తి అవ్వాలి అని ఆదేశాలు ఇచ్చిన నేపద్యంలో, అది కూడా జగన్ ను కుంగదీస్తుంది. ఇప్పటికే జగన్ మీద సిబిఐ కోర్ట్ లో విచారణలో ఉన్న కేసుల్లో మూడు కేసులు తుది దశకు వస్తున్నాయి... మరో పక్క సుప్రీం చర్యలు చూస్తుంటే, జగన్ ఏంతో కాలం, బయట తిరగలేరు అనే వాతావరణం ఉంది...