పోయిన శుక్రవారం జగన్ మోహన్ రెడ్డికి, సిబిఐ కోర్ట్ లో షాక్ తగిలిన విషయం తెలిసిందే. అక్రమాస్తుల కేసులో, ప్రతి శుక్రవారం కోర్ట్ కు హాజరు కావటం కుదరదని, తాను ఇప్పుడు ముఖ్యమంత్రిని అని, ప్రతి శుక్రవారం కోర్ట్ కు రావాలి అంటే, నాతొ పాటు చాలా మంది రావాలని, ప్రతి వారం 60 లక్షలు దాకా ఖర్చు అవుతుందని, కొత్తగా ఏర్పడిన రాష్ట్రానికి, ఇది చాలా నష్టం అంటూ, జగన్ మోహన్ రెడ్డి, కోర్ట్ మినహాయింపు పిటీషన్ దాఖలు చేసారు. అయితే దీని పై సిబిఐ వాదనలు వినిపిస్తూ, జగన్ మోహన్ రెడ్డి, ఎంపీగా ఉన్నప్పుడే, సాక్షులను ప్రభావితం చేసారని, ఇప్పుడు సియం అయ్యారని, ఆయనకు ఉన్న పవర్స్ తో ఇంకా చెయ్యొచ్చని, అదీ కాక, చట్టం ముందు, సియం అయినా, సామాన్య ప్రజలు అయినా ఒక్కటే అంటూ, వాదనలు వినిపించారు. ఈ వాదనలు విన్న సిబిఐ కోర్ట్, జగన్ మోహన్ రెడ్డి వేసిన, మినహాయింపు పిటీషన్ ను తిరస్కరిస్తూ, నిర్ణయం తీసుకుంది. అయితే, ఇప్పుడు సిబిఐ కోర్ట్ చెప్పిన తీర్పు కాపీ బయటకు వచ్చింది.

cbi 05112019 2

జగన్ పిటీషన్ కొట్టివేస్తూ, హైదరాబాద్‌లోని నాంపల్లి కోర్టు జారీచేసిన ఆదేశాల తీర్పు కాపీ, సోమవారం ఇంటర్నెట్ లో వచ్చింది. ఈ సందర్భంగా కోర్ట్ చేసిన వ్యాఖ్యలు ఆసక్తిగా మారాయి. సిబిఐ కోర్ట్ జడ్జిమెంట్ ఇచ్చిన వెంటనే, జగన్ తరుపు లాయర్లు, హైకోర్ట్ లో కేసు వేసరనే వార్తలు వినిపించాయి. అయితే, సిబిఐ కోర్ట్ మాత్రం, తన తీర్పులో, ఈ విషయం ప్రస్తావిస్తూ, సీఆర్‌పీసీ సెక్షన్‌ 205 కింద, జగన్ తరుపు న్యాయవాది, ప్రతి వారం కోర్ట్ వచ్చేలా ఆదేశాలు ఇస్తూ, నిందితునికి (జగన్‌) మినహాయింపు ఇస్తూ, వేసిన పిటీషన్ పై, గతంలోనే మేము కొట్టేసామని, తరువాత, హైకోర్ట్ కూడా, మా తీర్పుని సమర్థించిందని సిబిఐ కోర్ట్ తెలిపింది. అంతే కాకుండా, మీరు మళ్ళీ సుప్రీం కోర్ట్ వద్దకే వెళ్ళాలి కాని, ఇక్కడకు రాకూడదు అని సిబిఐ కోర్ట్ పేర్కొంది.

cbi 05112019 3

గతంలోనే మేము తిరస్కరించాం, హైకోర్ట్ తిరస్కరించింది, ఇప్పుడు మీకు మళ్ళీ మినహాయింపు కావాలి అంటే, మీరు సుప్రీం కోర్ట్ కు వెళ్ళాలి కాని, మళ్ళీ ఇదే కోర్ట్ కు ఆశ్రయించడం సరికాదని, సిబిఐ కోర్ట్ తెలిపింది. అంతే కాకుండా, 2013లో జగన్మోహన్‌ రెడ్డి వేసిన బెయిలు పిటిషన్‌పై విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలను సీబీఐ కోర్టు తన ఆదేశాలలో ఉటంకించింది. ‘‘ఆర్థిక నేరాల వెనుక పెద్ద కుట్ర ఉంటుంది. వీటివల్ల పెద్ద ఎత్తున ప్రజాధనం నష్టపోవాల్సి వస్తుంది. ఇలాంటి నేరాలవల్ల దేశ ఆర్థిక స్థితిపై తీవ్ర ప్రభావం పడుతుంది’’ అని సుప్రీం కోర్టు పేర్కొందని గుర్తు చేసింది. మరి జగన్ తరుపు న్యాయవాదులు, సిబిఐ కోర్ట్ చెప్పినట్టు, సుప్రీం కోర్ట్ కు వెళ్తారో, లేక హైకోర్ట్ కే మళ్ళీ వెళ్తారో, వెళ్తే హైకోర్ట్ ఎలా స్పందిస్తుందో చూడాలి.

Advertisements

Advertisements

Latest Articles

Most Read