ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి, సిబిఐ కోర్టు నోటీసులు జారీ చేసింది. జగన్ మోహన్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలి అంటూ, అదే పార్టీకి చెందిన రఘురామకృష్ణ రాజు, సిబిఐ కోర్టులో పిటీషన్ వేసిన సంగతి తెలిసిందే. దీనికి స్పందించిన సిబిఐ కోర్టు , జగన్ మోహన్ రెడ్డికి నోటీసులు జారీ చేసింది. బెయిల్ నిబంధనలు ఉల్లంఘించారు అంటూ, రఘురామకృష్ణం రాజు పిటీషన్ వేసారని, మీ బెయిల్ రద్దు పిటీషన్ పై సమాధానం చెప్పండి,ఈ పిటీషన్ పై వివరణ ఇవ్వండి అంటూ, సిబిఐ కోర్టు, జగన్ మోహన్ రెడ్డికి నోటీసులు జారీ చేసింది. ఈ పిటీషన్ పై తదుపరి విచారణ, మే 7వ తేదీకి సిబిఐ కోర్టు వాయిదా వేసింది. అయితే, ఇదే పిటీషన్ పై, సిబిఐ వాదన కూడా, కోర్టు వినే అవకాసం ఉన్నట్టు తెలుస్తుంది. సిబిఐకి కూడా, కోర్టు నోటీసులు ఇచ్చే అవకాసం ఉంది. జగన్ మోహన్ రెడ్డి పై అక్రమ అస్తుల ఆరోపణలు ఉన్న సంగతి తెలిసిందే. ఆయన పై అభియోగాలు మోపిన సిబిఐ, ఈడీ కేసులు కూడా పెట్టాయి. ఆయన ఆస్తులు కూడా జప్తు చేసిన విషయం తెలిసిందే. జగన్ మోహన్ రెడ్డి పై అక్రమ ఆస్తులు కేసులుగా, సిబిఐ 11 కేసులు పెట్టగా, ఈడీ 5 కేసులు పెట్టింది. ఈ కేసుల్లో చార్జ్ షీట్ కూడా వేసారు. ఇదే కేసుల్లో జగన్ మోహన్ రెడ్డి, 16 నెలలు జైల్లో కూడా ఉన్నారు.

jagann 28042021 2

అయితే తరువాత కండీషనల్ బెయిల్ పై బయటకు వచ్చారు. ఈ కేసు గత 9 ఏళ్ళుగా సాగుతూనే ఉంది. ఇంకా కేసు ట్రైల్స్ లోకి కూడా రాలేదు. శుక్రవారం విచారణ అని కోర్టు చెప్పినా, జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తరువాత కేవలం ఒకసారే కోర్టుకు వెళ్ళారు. అలాగే మూడు నెలల నుంచి రోజు వారీ విచారణ అంటున్నా, అది కూడా ఇంకా ట్రైల్స్ దాకా వెళ్ళలేదు. ఈ లోపు కొంత మంది బీజేపీ నేతలు, జగన్ ని మళ్ళీ జైలుకు పంపిస్తాం అని చెప్తూ ఉండటంతో, వీటికి నొచ్చుకున్న రఘురామకృష్ణం రాజు, మా ముఖ్యమంత్రి రాముడో, రాక్షసుడో తెల్చేస్తాను అంటూ కేసు వేసారు. ఈ పిటీషన్ లో, జగన్ మోహన్ రెడ్డి అధికారాన్ని ఉపయోగించి, సాక్షులను ప్రభావితం చేస్తున్నారు అంటూ, పిటీషన్ లో తెలిపారు. ఇన్నేళ్ళు అయినా ఇంకా కేసు విచారణ జరగటం లేదని, వాపోయారు. అందుకే కేసు ప్రభావితం అవ్వకుండా, సాక్ష్యులు ప్రభావితం అవ్వకుండా, జగన్ మోహన్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలని, రఘురామరాజు పిటీషన్ వేసారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read