హాలిడే రోజు కూడా, జగన్ కు చీవాట్లు తప్పటం లేదు... ఏంటి ఇవాళ హాలిడే అని ఆలోచిస్తున్నారా ? ఇవాళ శుక్రవారం జగన్ డైరీలో హాలిడే... ప్రతి శుక్రవారం, అక్రమాస్తుల కేసులో బెయిల్ పై బయట తిరుగుతున్న జగన్, నాంపల్లి సిబిఐ కోర్ట్ కి హాజరు కావాల్సిన సంగతి తెలిసిందే... అయితే, ఇవాళ నాంపల్లి సిబిఐ కోర్ట్ జగన్ లాయర్ల పై తీవ్ర వ్యాఖ్యలు చేసింది... ఇలాంటి వాదనలు 30 ఏళ్ళ సర్వీసులో ఎప్పుడూ వినలేదు అంటూ న్యాయమూర్తి తీవ్రంగా స్పందించారు... దీంతో 11 కేసుల్లో A1గా ఉన్న జగన్ తో పాటు, A2గా ఉన్న విజయసాయి రెడ్డి, జగన్ తరుపు లాయర్లు షాక్ తిన్నారు... సిబిఐ కోర్ట్ తీవ్ర వ్యాఖ్యలు చెయ్యటంతో, జగన్ ముభావంగా కనిపించారు...
పదే పదే విచారణ వాయిదా కోరడం సరికాదని, రెండేళ్లుగా విచారణను జాప్యం చేస్తున్నారని, ఇంకెంతకాలం కోర్టు సమయాన్ని వృథా చేస్తారని న్యాయస్థానం ప్రశ్నించింది. 4 చార్జ్షీట్లను కలిపి వాదనలు వినాలన్న అభ్యర్థనను కోర్టు తిరస్కరించింది. చార్జ్‌షీట్ 9లో వాదనలు కొనసాగించాలని సీబీఐకి కోర్టు ఆదేశించింది. జగన్ న్యాయవాదుల తీరుకు సంబంధించి కోర్టులో సీబీఐ అభ్యంతరం వ్యక్తం చేసింది.
జగన్ అక్రమాస్తుల కేసులో 10వ చార్జీషీట్‌పై వాదనలు జరిగాయి. రాంకీ సిమెంట్‌లో తమకు ప్రత్యక్షంగా పెట్టుబడులు లేవని జగన్, విజయసాయిరెడ్డి డిశ్చార్జ్ పిటీషన్లో పేర్కొన్నారు. వాదనలు విన్న సీబీఐ కోర్టు తదుపరి విచారణను వచ్చే శుక్రవారానికి వాయిదా వేసింది. మళ్ళీ ఈ నెల 24న కోర్టుకు జగన్ హాజరుకావాలని న్యాయస్థానం ఆదేశించింది. దీంతో జగన్ కోర్ట్ నుంచి, పాదయాత్ర కంటిన్యూ చెయ్యటం కోసం, కర్నూల్ బయలుదేరారు... రేపటి నుంచి, యధావిధిగా సాక్షి క్రియేటివ్ టీం, పీకే స్క్రిప్ట్ బ్యాచ్ రెడీ, లోటస్ పాండ్ సోషల్ మీడియా బ్యాచ్ రెడీ అవ్వనున్నాయి...