కోర్టు విచారణకు రాకుండా, మినహాయింపులు కోరటం పై, మొన్న జగన్ మోహన్ రెడ్డికి కోర్టు జర్క్ ఇస్తే, నేడు విజయసాయి రెడ్డికి కోర్టు షాక్ ఇచ్చింది. సిబిఐ కోర్టులోజగన్ అక్రమాస్తుల కేసులో విచారణ నిన్న కూడా కొనసాగింది . రెండు రోజుల క్రితమే సిబిఐ కేసులో ఉన్నటువంటి A1 జగన్ మోహన్ రెడ్డి, A2 విజయ సాయి రెడ్డి విచారణకు హాజరు కాకపోవడంతో చాల సీరియస్ గానే వార్నింగ్ ఇచ్చిన సంగతి తెలిసిందే. నిన్న మరోసారి జగతి పుబ్లికేషన్ ఈడి కేసుల్లో విచారణ పెటీషన్ పైన వాదనలు కొనసాగాయి . విజయసాయి రెడ్డి విచారణకు ఎందుకు హాజరు కాలేదు అంటూ CBI కోర్టు ప్రశ్నించింది. అయితే విజయ సాయి రెడ్డి న్యాయవాదులు తమ వాదనలు వినిపిస్తూ పార్లమెంట్ సమవేసాలు కోసం డిల్లికి వెళ్ళినందున విచారణకు హాజరు కాలేదు అని సమర్ధించారు. అయితే విచారణకు విజయ సాయి రెడ్డి తప్పకుండా హాజరు కావాలని సిబిఐ కోర్టు స్పష్టం చేసింది. విజయసాయి రెడ్డి న్యాయవాదులు తమ క్లైంట్ పార్లమెంట్ సమవేసాలు వళ్ళ రాలేదని మెమో దాఖలు చేసారు. దీనికి సంబదించి ఈ కేసును, సిబిఐ కోర్టు ఈ నెల 30 కి వాయిదా వేయడం జరిగింది. మరోవైపు హిందు టెక్ డిశ్చార్జ్ పిటీషన్ పై ఉన్నటువంటి జగన్ వాదనలు కూడా నిన్న ముగిసాయి. దీనిని కూడ ఈ నెల 30 కి వాయిదా వేయడం జరిగింది.
దీనిపై సిబిఐ కోర్టు 30 న ఒక కీలకమైన నిర్ణయం తీసుకోనే అవకాసం ఉంది. ఇక ఈ ఎపిసోడ్లో ప్రదానంగా నమోదైనటువంటి కేసులు కావచ్చు, రోజు వారి విచారణ కావచ్చు, వీటి పై త్వరలోనే ఒక నిర్ణయం వెలువడే అవకాసం ఉంది. A1 గా ఉన్నటువంటి జగన్ మోహన్ రెడ్డి, A2 విజయ సాయి రెడ్డి విచారణకు వ్యక్తిగతంగా హాజరుకాక పోవడంతో ఇప్పటికే పలుమార్లు CBI కోర్టు వార్నింగ్ ఇచ్చిన విషయం తెలిసిందే. తదుపరి విచారణకు హాజరు అవుతారా లేదా అనే విషయం పై క్లారిటీ రావలిసిన అవసరం ఉంది. ఇప్పటికే హైకోర్ట్లో కూడా జగన్ మోహన్ రెడ్డి వ్యక్తిగత మినహాయింపు ఇవ్వాలని కూడా హైకోర్ట్ లో పిటీషన్ దాఖలు చేసారు. దానిపై కూడా వాదనలు ముగిసాయి. ఆ తీర్పు కోసం కూడా వెయిట్ చేస్తున్నామంటూ కూడా గత రెండు రోజుల క్రితమే CBI కోర్టుకు కూడా చెప్పడం జరిగింది. తీర్పు వచ్చిన తరువాత విచారణకు హాజరు కావలా, వద్దా అనేది హైకోర్ట్ ఇచ్చే ఉత్తర్వులు మీద ఆదారపడి ఉంటుందని వారు చెప్పారు. ఇంకా తీర్పు రాకముందే మీరు ఎందుకు నెగ్లెక్ట్ చేస్తున్నారని, తీర్పు వచ్చేవరకు మీరు తప్పకుండ విచారణకు మీరు హాజరు కావాలని CBI కోర్టు చురకలు అంటించింది.