అంతర్గత కుమ్ములాటలు, పరస్పర అవినీతి ఆరోపణలతో సీబీఐలో చెలరేగిన సంక్షోభం పెను మలుపు తిరిగింది. మొయిన్‌ ఖురేషీ కేసును దర్యాప్తు చేస్తూ అక్రమ వసూళ్లకు పాల్పడుతున్న కొందరు అధికారుల నుంచి గుజరాత్‌కు చెందిన కేంద్ర బొగ్గు శాఖ సహాయమంత్రి హరిభాయ్‌ పార్థిభాయ్‌ చౌధురికి కోట్ల రూపాయల ముడుపులు ముట్టినట్లు సీబీఐ డీఐజీ మనీశ్‌ కుమార్‌ సిన్హా ఆరోపించారు. ప్రత్యేక డైరెక్టర్‌ రాకేశ్‌ అస్థానా అవినీతి కేసులో నిందితులను రక్షించడానికి పీఎంవోను మేనేజ్‌ చేసినట్లుగా ఇద్దరు వ్యక్తుల మధ్య సంభాషణ జరిగినట్లు పేర్కొన్నారు. సంభాషణ జరిగిన రోజు రాత్రే ఆ కేసును దర్యాప్తు చేస్తున్న బృందాన్ని మార్చేసినట్లు ఆరోపించారు.

modi 20112018 2

ఇదే కేసులో జాతీయ భద్రతా సలహాదారు (ఎన్‌ఎస్‌ఏ) అజిత్‌ డోభాల్‌, కేంద్ర న్యాయశాఖ కార్యదర్శి సురేశ్‌ చంద్ర, గూఢచర్య సంస్థ రీసెర్చ్‌ అండ్‌ అనాలిసిస్‌ వింగ్‌ (రా) అధికారి సామంత్‌ గోయెల్‌, ఆ సంస్థ మాజీ సంయుక్త కార్యదర్శి దినేశ్వర్‌ ప్రసాద్‌ వివిధ సందర్భాల్లో జోక్యం చేసుకున్నట్లు విచారణ సందర్భంగా తెలిసిందన్నారు. ఆయన తాజాగా సుప్రీం కోర్టును ఆశ్రయించారు. సతీశ్‌ సానా సంబంధాలు సీబీఐలో చాలా లోతుగా వెళ్లినట్లు కనిపిస్తోందని మనీశ్‌ చెప్పారు. పరిస్థితులను ఇలాగే వదిలిపెడితే సీబీఐ కాస్తా ‘సెంట్రల్‌ బోగస్‌ ఇన్వెస్టిగేషన్‌’, ఈడీ కాస్త ‘ఎక్స్‌టార్షన్‌ డైరెక్టరేట్‌’గా మారిపోయే ప్రమాదం ఉందని వ్యాఖ్యానించారు. అస్థానాపై దాఖలైన ఎఫ్‌ఐఆర్‌పై కోర్టు పర్యవేక్షణలో దర్యాప్తు జరిపించాలని కోరారు. పిటిషన్‌లో దిగ్భ్రాంతికర అంశాలు ఉన్నాయని సిన్హా తరఫు న్యాయవాది చెప్పారు.

modi 20112018 3

2018 అక్టోబర్‌ 20న సీబీఐ ప్రధాన కార్యాలయంలో ఫిర్యాదుదారు సతీశ్‌ సానాను ప్రశ్నించాం. సీబీఐ అధికారులపై తాను చేసిన ఫిర్యాదుకు కట్టుబడి ఉన్నట్లు సతీశ్‌ చెప్పారు. ఈ సందర్భంగా ఆయన కొన్ని విషయాలు వెల్లడించారు. అహ్మదాబాద్‌కు చెందిన విపుల్‌ అనే వ్యక్తి ద్వారా దర్యాప్తు అధికారుల నుంచి కేంద్ర మంత్రి హరిభాయ్‌ పార్థిభాయ్‌ చౌధురికి ఈ ఏడాది జూన్‌ తొలి పక్షం రోజుల్లో కొన్ని కోట్లరూపాయలు ఇచ్చినట్లు చెప్పారు. కేంద్ర సిబ్బంది వ్యవహారాల మంత్రిత్వశాఖ ద్వారా హరిభాయ్‌ సీబీఐలోని సీనియర్‌ అధికారులతో మాట్లాడారని వెల్లడించారు. దీనిపై పూర్తిస్థాయిలో విచారణ చేపట్టాం. జూన్‌ తొలి పక్షం రోజుల్లో మరో కేంద్ర సంస్థ ఫోన్‌కాల్స్‌ని ట్యాప్‌చేసినట్లు మాకు సమాచారం అందింది. దాని ప్రకారం మేడ్చల్‌ మాజీ ఎమ్మెల్యే కె.లక్ష్మారెడ్డి, సతీశ్‌ సానా మధ్య ఒకటి, రెండుకోట్ల రూపాయలు పంపడం గురించి సంభాషణ నడిచింది.

Advertisements

Advertisements

Latest Articles

Most Read