జగన్ మోహన్ రెడ్డి అక్రమ ఆస్తుల కేసులో, సిబిఐ గత కొన్ని రోజుల నుంచి స్పీడ్ మీద ఉంది. నిన్న 22న ఏదో జరిగిపోతుంది అంటూ, ఒక పుకార్ సోషల్ మీడియాలో పుట్టించారు. అయితే, అదేమీ లేదని నిన్న స్పష్టం అయ్యింది. అయితే నిన్న విచారణ సందర్భంగా సిబిఐ చేసిన వాదనలు మాత్రం, కొంత ఆసక్తిగా మారాయి. జగన్ పై నమోదు అయిన 11 చార్జిషీట్లలు, వేరు వేరుగానే విచారణ జరపాలని, సిబిఐ, కోర్ట్ ముందు తమ వాదనగా చెప్పింది. ఈ 11 చార్జ్ షీట్లు ఒకే తరహా ఆర్ధికం నేరం అయినా, వేరు వేరుగా విచారణ జరపాలని, ఈ నేరాలు జరిగిన సమయం కాని, పెట్టుబులు కానీ, నిందితులు కాని వేరు వేరు అని, కేవలం జగన్, విజయసాయి రెడ్డి మాత్రమే, అన్ని కేసుల్లో ఉన్నారని, మిగతా వారు అంతా వేరు వేరు అని సిబిఐ కోర్ట్ కు చెప్పింది. ఇప్పటికే ఈ కేసు పై కోర్ట్ ఇదే విధమైన డైరక్షన్ ఇచ్చిందని గుర్తు చేసింది. దీనికి ఉదాహరణగా, గతంలో లాలు ప్రసాద్ దాణా కుంబకోణం కేసు గురించి ప్రస్తావిస్తూ, ఆ విషయాన్ని కోర్ట్ కు గుర్తు చేసింది.
ఈ కేసులో చార్జ్ షీట్లు వేసి ఏడేళ్ళు అవుతున్నా, ఇంకా విచారణ ప్రారంభం కాలేదని, రకరకాలు పితీషన్లు వేసి, కేసు విచారణ జరగకుండా జాప్యం చేస్తున్నారని సిబిఐ పేర్కొంది. ఇప్పటికే డిశ్చార్జి పిటిషన్ల పై క్లారిటీ వచ్చిన కేసుల పై, ఇక విచారణ ప్రారంభించాలని సిబిఐ తాజాగా చేసిన వాదనతో ఇప్పుడు కొత్త చర్చ ప్రారంభం అయ్యింది. అంతకు ముందు జగన్ తరుపు న్యాయవాదులు, తమ పై, దాఖలు అయిన 6 చార్జిషీట్లను సీఆర్‌పీసీ సెక్షన్ 223 కింద కలిపి విచారణ జరపాలి అంటూ, జగతి పబ్లికేషన్స్ పిటీషన్ దాఖలు చేసింది. అయితే సిబిఐ వాదిస్తూ, నేరం ఒకటే తర్హాది అయినా, జరిగిన నేరం మాత్రం, వేరు వేరు చోట్ల, వేరు వేరు మనుషులతో జరిగిందని చెప్పింది.
హెటిరో, అరబిందో, రాంకీ, వాన్‌పిక్ కేసుల్లో భూములు కేటాయించడం ద్వారా వారు పెట్టుబడులు పెట్టారనేది అభియోగమని, క్విడ్‌ప్రోకో కుట్ర ఒక్కటే అయినా పెన్నా సిమెంట్స్, వాన్‌పిక్‌లో ఉండే వ్యక్తులకు సంబంధం లేదని, నేరాలు వేర్వేరుగానే జరిగాయిని, వీటిపై సెక్షన్ 212 కింద వేర్వేరుగా ప్రత్యేక విచారణ జరగాల్సిందే అని సిబిఐ స్పష్టం చేసింది. అయితే ఇదే విషయంలో కల్పించుకున్న ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ కూడా, సిబిఐ వాదనతోనే ఏకీభవించింది. ఇప్పటికే అనేక సార్లు పిటీషన్లు వేసి, విచారణ జాప్యం అయ్యేలా చేస్తున్నారని, అన్ని చార్జ్ షీట్ల పై విచారణ విడివిడిగా జరగాలని కోరింది. అయితే జగతి పబ్లికేషన్స్ తరుపు వాదనల కోసం, న్యాయమూర్తి ఈ కేసు విచారణను, 29కి వాయిదా వేశారు.