వైఎస్ వివేకానందరెడ్డి హ-త్యకేసులో అడ్డంగా బుక్కయిపోయిన వైసీపీ దిక్కుతోచని స్థితిలో రోజుకొక దివాలాకోరు వాదనతో మీడియా ముందుకు వస్తూ అభాసు పాలవుతోంది. సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి జగన్ రెడ్డి రక్షించాలనుకుని అడ్డంగా ఇరికిస్తున్నారని వైసీపీ కుల మీడియా , బ్లూ మీడియా లబోదిబోమంటూ వ్యాసాలు రాసుకుంటోంది. వైఎస్ వివేకానంద రెడ్డి హ-త్య కేసు సీఎం జగన్ మెడకు చుట్టుకునేలా సీబీఐ కుట్ర పన్నుతోందని, చంద్రబాబు చేస్తున్న ప్రయత్నాలకు అనుగుణంగా సీబీఐ డ్రామా ఆడుతోందని ప్రభుత్వ ప్రధాన సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి ఆరోపించారు. వివేకా హ-త్యతో అవినాశ్ రెడ్డికి ఎలాంటి సంబంధమూ లేదని, ఇదంతా చంద్రబాబు కుట్ర అని తేల్చేశారు. ఎంపీ అవినాశ్‌రెడ్డి పాత్రపై సీబీఐ వద్ద ఆధారాల్లేవు. కానీ... ఈ కేసునంతటినీ జగన్‌వైపు తిప్పడం ద్వారా రాజకీయ లబ్ధిని పొందేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని సజ్జల ఆరోపించారు. వివేకానందరెడ్డి హ-త్య కేసుని సీబీఐకి ఇవ్వాలని తొలిగా డిమాండ్ చేసింది జగన్ రెడ్డి. అటువంటి జగన్ రెడ్డిని కాపాడేందుకు అనుకుని అదే సీబీఐపై ఆరోపణలు చేస్తున్నారు సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి. కేంద్ర ప్రభుత్వంతో వైఎస్ జగన్ రెడ్డికి సత్సంబంధాలు ఉన్నాయని దేశమంతటికీ తెలుసు. ఏపీ ప్రయోజనాలు కూడా కాదనుకుని, కేంద్రం చెప్పినట్టల్లా తలూపే జగన్ రెడ్డిని కాదని కేంద్రంలో బీజేపీ చేతిలో ఉన్న సీబీఐ చంద్రబాబు మాట వింటోందని చెప్పడంపై వైసీపీలోనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉన్న సీబీఐని మేనేజ్ చేస్తున్న చంద్రబాబు చివరికి గూగుల్ ని మేనేజ్ చేస్తున్నారనడం వైసీపీ నేతలే కాదు, మద్దతు మీడియా సంస్థలే లబోదిబోమంటున్నాయి.
సీబీఐ, గూగుల్ ని కూడా చంద్రబాబు మేనేజ్ చేస్తున్నారనే సజ్జల వ్యాఖ్యలపై వైసీపీ మీడియా ఫైర్
Advertisements