దేశంలో అసలు ఏమి జరుగుతుంది ? పరిపాలన ఉందా , లేదా ? ఒక్కో వ్యవస్థని సర్వనాసనం చేస్తున్నారు. పది నెలలు క్రితం, ఏకంగా సుప్రీం కోర్ట్ జడ్జిలు అందరూ, చీఫ్ జుస్తిస్ పై తిరగబడ్డారు. ఇప్పుడు సిబిఐ టాప్ బాస్ ని తప్పించటానికి, రెండో స్థానంలో ఉన్న గుజరాత్ కు చెందిన వ్యక్తి, తప్పుడు వాంగ్మూలం సృష్టించాడు. అది కాస్త బయట పడింది. నిన్న జరిగిన అనూహ్య పరిణామాల మధ్య, గత అర్ధరాత్రి 2 గంటల తరువాత సీబీఐ తాత్కాలిక డైరెక్టర్ గా మన్నె నాగేశ్వరరావుని మోడీ నియమించారు. సీబీఐ డైరెక్టర్ అలోక్ వర్మ, స్పెషల్ డైరెక్టర్ రాకేష్ ఆస్థానా ను తొలగించారు. రాకేష్ ఆస్థానా అడ్డంగా దొరికిపోయాడు కాబట్టి అతని పై ఆక్షన్ తీసుకోవటంలో అర్ధం ఉంది. మరి, అలోక్ వర్మని ఎందుకు తప్పించారు ? ఆయన స్థానంలో వచ్చిన మన్నె నాగేశ్వరరావు పై అనేక ఆరోపణలు అన్నయనే వార్తలు చెక్కర్లు కొడుతున్నాయి.
ఇది ఇలా ఉంటే చార్జ్ తీసుకున్న మన్నె నాగేశ్వరరావు, వెంటనే సిబిఐ హెడ్ ఆఫీస్ సీజ్ చేసారు. చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా, సిబిఐ ఆఫీస్ అవినీతి ఆరోపణలతో సీజ్ అయ్యింది. సీబీఐ డైరెక్టర్ అలోక్ వర్మ, స్పెషల్ డైరెక్టర్ రాకేష్ ఆస్థానా, సస్పెన్షన్ కు గురైన దేవేందర్ కార్యాలయాలు ఉన్న 10, 11 అంతస్తుల్లో తనిఖీలు చేపట్టిన నాగేశ్వరరావు బృందం వారి చాంబర్లను సీజ్ చేసింది. అధీకృత ధ్రువీకరణ పత్రాలు, గుర్తింపు కార్డులు ఉన్నావారు తప్ప, మిగతా వారు ఎవరూ సీబీఐ ఆఫీసులోనికి రాకుండా బందోబస్తును ఏర్పాటు చేయించిన నాగేశ్వరరావు, దగ్గరుండి తనిఖీలను జరిపించారు. అధికారులు వాడిన ఎలక్ట్రానిక్ పరికరాలు, కంప్యూటర్లను నాగేశ్వరరావు టీమ్ తమ అధీనంలోకి తీసుకుని, వాటిల్లో ఉన్న సమాచారాన్ని క్రోఢీకరించే పనిలో నిమగ్నమైంది.
అయితే రోలు వెళ్లి మద్దెలుకు మోర పెట్టుకున్నట్టు, అన్ని అవినీతి ఆరోపణలు విచారణ చేసే, సిబిఐ మీద అవినీతి ఆరోపణలు వస్తుంటే, ఎవరికి చెప్పుకోవాలి ? ఎప్పుడన్నా విన్నమా ఇలాంటి వార్త. దేశపు అత్యున్నత నేర పరిశోధక సంస్థ అధిపతినీ అర్ధాంతరంగా సెలవు పంపించటం సి.బి.ఐ హెడ్ క్వార్టర్స్ ని సీల్ చేయడం. 50 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో కూడా ఎప్పుడు ఇటువంటి మనం వినలేదు చూడలేదు. కాంగ్రెస్ కంటే భిన్నంగా పరి పాలన అందిస్తాడని మోడీని ఎన్నుకుంటే అంత కంటే ఘనుడు ఆచంట మల్లన్న అన్నట్టు ఈయన హయాంలో అత్యున్నత వ్యవస్థలన్నీ నిర్వీర్యం అయిపోయాయి. వాటి యొక్క విలువ నమ్మకం రెండు కోల్పోయాయి. మోడీ షా హయాంలో అత్యున్నత రాజ్యాంగ సంస్థలన్నీ వారి జేబు సంస్థ లాగా మార్చేశారు.