వైఎస్ వివేక కేసులో, గత రెండు రోజులుగా సిబిఐ వేగం పెంచింది. గత కొన్ని రోజులుగా సిబిఐ విచారణ మందగించింది. అయితే, గత రెండు రోజులుగా మళ్ళీ సిబిఐ విచారణ మొదలు అయ్యింది. ఈ సారి సిబిఐ వేగంగా పావులు కదుపుతుంది. ఈ రోజు సిబిఐ బృందాలు కడప నుంచి పులివెందుల వెళ్ళాయి. అయితే ఇది రొటీన్ విచారణ అని అందరూ అనుకున్నారు. అనూహ్యంగా ఈ రోజు సిబిఐ, జగన మోహన్ రెడ్డి ఇంటికి, వైఎస్ అవినాష్ రెడ్డి ఇంటికి పరిశీలన చేయటంతో, అందరూ షాక్ తిన్నారు. ముందుగా పులివెందులలో వైఏ వివేకా ఇంటిని సిబిఐ పరిశీలించింది. ఒక సర్వేయర్ ని కూడా సిబిఐ వెంట తీసుకుని వెళ్ళింది. అక్కడ ఫోటోలు, వీడియోలు తీసిన సిబిఐ, అక్కడ నుంచి అనూహ్యంగా జగన్ మోహన్ రెడ్డి ఇంటికి వెళ్ళింది. అది జగన్ మోహన్ రెడ్డి అధికారిక క్యాంప్ కార్యాలయం కూడా. తరువాత ఎంపీ అవినాష్ రెడ్డి ఇంటికి కూడా వెళ్లారు. మొత్తంగా జగన్ మోహన్ రెడ్డి ఇంటికి, అవినాష్ రెడ్డి ఇంటిని కూడా సిబిఐ కొలతలు వేసి, అలాగే వీడియో రికార్డింగ్ కూడా చేసింది. ఏకంగా జగన్ మోహన్ రెడ్డి ఇంటిని కూడా ఇప్పుడు సిబిఐ విచారణలోకి తీసుకోవటం, ఎవరికీ అంతు పట్టటం లేదు. ఈ కేసులో ఇంకెన్ని సంచలనాలు వస్తాయో, అవి బయట పడతాయో లేదో చూడాలి మరి.

Advertisements

Advertisements

Latest Articles

Most Read