జగన్ అక్రమ ఆస్తుల కేసుకి సంబంధించి, ఈ రోజు సిబిఐ కోర్టులో విచారణ జరగనుంది. అయితే గత ఆరు నెలలుగా కో-వి-డ్ నిబంధనలు కారణంగా, కోర్టులు పని చేయకపోవటంతో , ఈ కేసుల విచారణ నెమ్మదించింది. ప్రధానంగా దీంట్లో చూసినట్టు అయితే, సిబిఐ దాఖలు చేసిన 11 చార్జ్ షీట్లు, ఈడీకి సంబంధించి 5 చార్జ్ షీట్ల పై విచారణ కొనసాగుతుంది. ప్రధానంగా అరాబిందో కంపెనీకి, జగతి కంపెనీ, హెటోరీ, భారతీ సిమెంట్స్, ఇలా ఈ కంపెనీల అన్నిటి పై విచారణ కొనసాగుతుంది. అయితే తనకు కోర్టు విచారణ నుంచి మినహాయింపు ఇవ్వాలని, తమది పెద్ద రాష్ట్రం అని , వచ్చి వెళ్ళటానికి 60 లక్షలు ఖర్చు అవుతుందని కోర్టుకు తెలిపారు. అయినా కోర్టు మాత్రం, జగన్ విచారణకు రావాల్సిందే అని చెప్పింది. అయినా ఒకటి రెండు సార్లు మినిహా, జగన్ మోహన్ రెడ్డి ప్రతి శుక్రవారం కోర్టుకు హాజరు కాలేదు. కోర్టు పర్మిషన్ తీసుకున్నారు. అయితే ఈ రోజు విచారణలో కూడా కేసుకి సంబంధించి, ఎవరూ కోర్టుకు విచారణకు వచ్చే అవకాసం కనిపించటం లేదు. న్యాయవాదులు మాత్రమే కోర్టుకు వచ్చే అవకాసం ఉంది. కో-వి-డ్ కారణంగా, నిందితులు కోర్టుకు హాజరుకావటం లేదని, కోర్టు నుంచి పర్మిషన్ కోరే అవకాసం ఉంది. దీంతో ఈ కేసు విచారణ వచ్చే వారానికి వాయిదా పడే అవకాశం ఉంది.
ఇక మరో పక్క, ప్రజాప్రతినిధుల పై ఉన్న కేసులు ఏడాది లోగా ముగించాలని, సుప్రీం కోర్టు ఇచ్చిన ఆదేశాల ప్రకారం, తెలంగాణా హైకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు, నిన్న ఈడీ ప్రత్యెక న్యాయస్థానంలో విచారణ జరిగింది. అయితే ఈ నెల 13న ఈ కేసు విచారణకు రావాల్సి ఉన్నా, కేసులు తొందరగా ముగించాలని సుప్రీం కోర్టు చెప్పటంతో, విచారణ ముందుకు జరిపారు. ఈ కేసు నిన్న ఈడీ న్యాయస్థానం ముందుకు వచ్చింది. అయితే తాము హెటోరీ కేసుని బదిలీ చెయ్యాలి అంటూ, హైకోర్టులో పిటీషన్ దాఖలు చేసామని, ఈ కేసు విచారణ ఈ నెల 20న హైకోర్టు ముందుకు వస్తుందని, ఈడీ కోర్టుకు చెప్పారు. దీంతో ఈ కేసుని 20వ తేదీకి వాయిదా వేసింది ఈడీ ప్రత్యెక కోర్టు. మొత్తానికి ఇన్నాళ్ళు క-రో-నా కారణంగా వాయిదా పడుతూ వస్తున్న విచారణ మళ్ళీ ఊపుఅందుకోనుంది. అంతే కాకుండా, సుప్రీం కోర్టు ఇచ్చిన ఆదేశాల ప్రకారం, ఈ కేసుల విచారణ ఏడాది లోపు అవ్వాలి అంటే, ఈ కేసుల పై రోజు వారీ విచారణ కూడా ప్రారంభం అవుతుంది.