జగన్ మోహన్ రెడ్డికి సిబిఐ కోర్టు భారీ షాక్ ఇచ్చింది. గత మూడేళ్ళుగా జగన్ మోహన్ రెడ్డి కోర్టు విచారణకు రాకపోయినా, సిబిఐ ఏనాడు అభ్యంతరం చెప్పలేదు. ప్రతి శుక్రవారం జగన్ మోహన్ రెడ్డి కోర్టుకు వచ్చి విచారణకు హాజరు కావాల్సి ఉంది. అయినా ప్రతి వారం ఏదో ఒక సాకు చెప్పి జగన్ తప్పించుకుంటూ వచ్చారు. అయితే ఎదో ఒకటో రెండు సార్లు అయితే అనుకోవచ్చు కానీ, మూడేళ్ళ నుంచి ప్రతి వారం ఇలాగే చేస్తున్నా, సిబిఐ మాత్రం ఏనాడు అభ్యంతరం చెప్పలేదు. అలాగే జగన్ మోహన్ రెడ్డి విదేశీ పర్యటనలకు కూడా సిబిఐ అభ్యంతరం చెప్పలేదు. మరి ఇప్పుడు ఏమైందో ఏమో కానీ, సిబిఐ జగన్ మోహన్ రెడ్డికి భారీ షాక్ ఇచ్చింది. వ్యతిగత పర్యటన మీద జగన్ మోహన్ రెడ్డి పారిస్ వెళ్ళాలని, పర్మిషన్ ఇవ్వాలని గత వారం సిబిఐ కోర్టులో పిటీషన్ దాఖలు చేసారు. అయితే దీని పై కౌంటర్ దాఖలు చేయామని కోర్ట్ కోరగా, అనూహ్యంగా సిబిఐ ఈ పిటీషన్ పై అభ్యంతరం తెలిపింది. జగన్ విచారణకు రావటం లేదని, విదేశాల్లో చాలా మంది సాక్ష్యులు ఉన్నారని, జగన్ మాట మాటికీ విదేశీ పర్యటనకు వెళ్తే, సాక్ష్యులను ప్రభావితం చేసే అవకాసం ఉందని, సిబిఐ వాదించింది. ఇన్నాళ్ళు ఏ అభ్యంతరాలు తెలపని సిబిఐ, ఇప్పుడు జగన్ మోహన్ రెడ్డి పర్యటన పై అభ్యంతరం చెప్పటంతో, పరిణామాలు ఎటు దారి తీస్తాయో మరి.

Advertisements

Advertisements

Latest Articles

Most Read