జగన్ మోహన్ రెడ్డి అక్రమ ఆస్తుల పై సిబిఐ వైఖరి మారుతుంది. ఇన్నాళ్ళు సిబిఐ, జగన్ కేసుల్లో సాగుతూ వెళ్తుందనే విమర్శలు వచ్చాయి. ఎప్పుడో 2012లో చార్జ్ షీట్ వేసిన కేసులు కూడా, ఇప్పటికీ ట్రయిల్స్ వరకు రాలేదు. ఇంకా ఏదో ఒక కారణంతో, డిశ్చార్జ్ పిటీషన్లు అని, అదని, ఇదని, ఇంకా అక్కడే ఉన్నాయి. దీనికి ప్రధాన కారణంగా సిబిఐ వైపే వేళ్ళు చూపిస్తున్నాయి. దీనికి బలం చేకూరుస్తూ, రఘురామకృష్ణం రాజు వేసిన బెయిల్ రద్దు పిటీషన్ లో, సిబిఐ ఏ వైఖరి చెప్పకుండా, రెండు నెలలు పాటు కేవలం సిబిఐ ఈ కేసుని సాగదీసిన విధానం చూసి, అనేక విమర్శలు వచ్చాయి. అయితే ఎందుకో ఏమో కానీ, ఈ మధ్య సిబిఐ వైఖరి మారుతుంది. సాగదీసే ధోరణి, తటస్థానంగా ఉండే వైఖరిని సిబిఐ పక్కన పెట్టింది. తాజాగా నిమ్మగడ్డ ప్రసాద్, వాన్పిక్, వేసిన డిశ్చార్జ్ పిటీషన్ల సందర్భంగా, సిబిఐ చేసిన వాదనలతో అందరూ షాక్ తిన్నారు. జగన్ మొహన్ రెడ్డి పై ఘాటుగా వ్యాఖ్యలు చేసింది సిబిఐ. కేవలం క్విడ్ ప్రోకో కోసమే వాన్పిక్ తో డీల్ జరిగినట్టు సిబిఐ వాదించింది. జగన్ కంపనీల్లో రూ.854కోట్ల పెట్టుబడి పెట్టారని, దానికి ప్రతిఫలంగానే, రాజశేఖర్ రెడ్డి, రూ.17వేల కోట్ల విలువ చేసే వాన్పిక్ ప్రాజెక్ట్ ఇచ్చారని వాదించింది. దీని వెనుక క్విడ్ ప్రోకో ఉందని, సిబిఐ కోర్టు ముందు గట్టిగా వాదనలు వినిపించింది.
ఈ మొత్తం కేసుని కలిపి చూడాల్సి ఉందని, మాకేమి సంబంధం లేదు అంటే కుదరదు అని చెప్తూ, ఒక ఉదాహరణ కోర్టు ముందు సిబిఐ వినిపించింది. అందరూ కలిసి కుట్ర పన్నితే, నిందితుల పాత్రను వేరుగా చూడకూడదని చెప్పింది. ఒక బాంబు తాయారు చేయటానికి ఒకడు డబ్బులు ఇస్తాడు, ఇకొకడు కోరిటర్ చేస్తాడు, ఇంకొకడు సామగ్రి తెస్తాడు, మరొకడు తయారు చేస్తాడు, ఇంకొకడు బాంబు పెడతాడు, అయితే వీరందరికీ ఇందులో భాగస్వామ్యం ఉంది, విడిగా చూస్తే ఎవరిదీ తప్పు కాదంటారు అంటూ వాదనలు వినిపించారు. ఇందులో జగన్, విజయసాయి రెడ్డి, ఇలా అందరి పాత్ర ఉందని సిబిఐ కోర్టు ముందు వాదించింది. అయితే వాన్పిక్ తరుపు న్యాయవాది మాత్రం, ఇందులో ఒక్క ఆధారం కూడా వారు చూపించటం లేదని, క్యాబినెట్ ని, ఒక వ్యక్తి ప్రభావితం చేస్తారా అని వాదించారు. జగన్ మోహన్ రెడ్డి ఒత్తిడి తెచ్చి వాన్పిక్ కు భూములు ఇచ్చారని చెప్పటానికి ఆధారాలు లేవని అన్నారు. ఇరు వర్గాల వాదనలు విన్న కోర్టు, తీర్పుని రిజర్వ్ చేసింది.