ఢిల్లీ అహంకారులు విర్రవీగితే, కొమ్ములు విరిచేసిన చరిత్ర మన ఆంధ్రుడిది. ఆ చరిత్ర మళ్ళీ తిరగరాసే టైం వచ్చింది. ఇష్టం వచ్చినట్టు రాష్ట్రం పై తన ప్రతాపం చూపిస్తున్న ఢిల్లీ అహంకారులకు, మరోసారి ఆంధ్రోడి దెబ్బ చూపిస్తున్నారు చంద్రబాబు. రోజుకో దెబ్బతో, ఢిల్లీ కొమ్ములు విరిచేస్తున్నారు. సిబిఐ, ఈడీ, ఐటి, కోర్ట్ లు, ఆర్బీఐ, ఇలా అన్ని వ్యవస్థలని నాశనం చేస్తున్న మోడీ-షా లకి తగిన గుణపాఠం చెప్తున్నారు. సిబిఐ మా చేతిలో ఉంది, అందులో మా గుజరాత్ ముఠా ఉంది, మీ అంతు చూస్తాం అంటూ విర్రవీగితున్న మోడీ-షా లకు, నువ్వు అంతు చూస్తే మేము చూస్తూ ఊరుకుంటామా, తాట తీస్తాం అనే సందేశం ఇచ్చారు చంద్రబాబు. ఇప్పటికే సిబిఐ పై నమ్మకాలు పోయాయి. వాళ్ళలో వాళ్ళే కొట్టుకునే పరిస్థితి వచ్చింది. కోర్ట్ లలో ఆ విషయం ఉంది.
ఈ తరుణంలో ఏపి ప్రభుత్వం సిబిఐ పై సంచలన ఉత్తర్వులు ఇచ్చింది. ఢిల్లీ ప్రత్యేక పోలీసు చట్టం ప్రకారం సీబీఐ ఏర్పాటైంది. అంటే... దీని పరిధి ఢిల్లీ మాత్రమే. దీంతో ఇతర రాష్ట్రాల వ్యవహారాల్లో సీబీఐ ఎలా వేలు పెడుతుందంటూ వివాదాలు తలెత్తాయి. ఈ సమస్యకు ఢిల్లీ స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లి్‌షమెంట్ చట్టంలోనే పరిష్కారం చూపించారు. ఇందులోని సెక్షన్ 6 ప్రకారం... రాష్ట్ర ప్రభుత్వాల అనుమతితో మాత్రమే సీబీఐ సంబంధిత రాష్ట్రంలో దర్యాప్తు చేపట్టగలదు. కర్ణాటక వంటి ఒకటి రెండు రాష్ట్రాలు మినహా మిగిలిన రాష్ట్రాలన్నీ ఇందుకు అనుమతి ఇచ్చాయి. ఏపీ సర్కారు ఏకంగా గుండుగుత్తగా అనుమతి (జనరల్ కన్సెంట్) ఇచ్చేసింది. ఇందుకు ప్రత్యేకంగా రాష్ట్ర ప్రభుత్వ అనుమతి అక్కర్లేదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోనే ఎప్పుడో సీబీఐకి ‘జనరల్ కన్సెంట్’ ఇచ్చేశారు. దీనిని ఎప్పటికప్పుడు పొడిగిస్తూ వస్తున్నారు.
గతంలో రాష్ట్రం ఇచ్చిన సమ్మతి నోటిఫికేషన్‌ను ఉపసంహరించుకుంటూ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. ఫలితంగా మన రాష్ట్రంలోని కేంద్ర ప్రభుత్వ శాఖలు, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేసే ఉద్యోగులపై దాడి చేయడానికి సీబీఐకి అవకాశం ఉండదు. తాజా ఉత్తర్వుతో రాష్ట్రంలో దాడులు చేయడానికి సీబీఐకి పరిధి రద్దయింది. కేంద్ర ప్రభుత్వం అధీనంలోని సీబీఐ, రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని ఏసీబీ రెండూ అవినీతి నిరోధక చట్టం (పీసీ యాక్టు) ప్రకారం కేసులు నమోదు చేసి, దర్యాప్తు చేపడుతుంటాయి. అయితే సీబీఐ రాష్ట్ర భూభాగంలో తన అధికారాలను అమలు చేసేందుకు వీలు లేకుండా పోయిన నేపథ్యంలో ఏపీలో సీబీఐ పాత్రను మన రాష్ట్ర ఏసీబీయే పోషించే అవకాశముంది. రాష్ట్రంలో పనిచేస్తూ అవినీతికి పాల్పడే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేసే ఉద్యోగులపై ఏసీబీ దాడులు చేయొచ్చు.
ఆదాయపు పన్ను శాఖ, పోర్టులు, తపాలా కార్యాలయాలు, సెంట్రల్ ఎక్సైజ్, టెలిఫోన్ కార్యాలయాలు, వాటిలోని ఉద్యోగులపై దాడులు చేయడానికి, సోదాలు నిర్వహించేందుకు, కేసులు నమోదు చేసి దర్యాప్తు చేసేందుకు వీలవుతుంది. ఈ అధికారాలన్నింటినీ సమీప భవిష్యత్తులో ఏసీబీ వినియోగించుకునేందుకు కసరత్తు చేస్తోంది. తద్వారా రాజకీయ కక్ష సాధింపు ధోరణితో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రంలో చేయిస్తున్న దాడులకు సహకరించే, కొమ్ముకాసే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గట్టిగా గుణపాఠం చెప్పాలని భావిస్తోంది. తమ జోలికి వస్తే... చేతులు ముడుచుకుని కూర్చోబోమని, అంతకు అంత బదులు చెబుతామని కేంద్రానికి ఓ గట్టి హెచ్చరిక పంపించాలనుకుంది. ఆ క్రమంలోనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సీబీఐకి ఎర్రజెండా చూపించిందని భావిస్తున్నారు. ఇలాంటిది ఒకటి ఉంది అని చాలా రాష్ట్రాలకు తెలుసో లేదో కాని, ఇప్పుడు చంద్రబాబు నిర్ణయంతో, బీజేపీ లేని రాష్ట్రాల్లో, అన్ని ప్రభుత్వాలు ఇది అమలు చేస్తే, ఇక మోడీ-షా లకు మరో రాజకీయ అస్త్రం వాళ్ళ చేతిలో నుంచి పోయినట్టీ. ఫెడరల్ స్పూర్తికి విరుద్ధంగా వ్యవహరిస్తున్న ఢిల్లీ అహంకారులకు, ఇలాంటి నిర్ణయాలు చెంప పెట్టు.