వివేక కేసులో నేడు కీలక పరిణామం చోటు చేసుకుంది. అందరూ ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న, మెయిన్ వ్యక్తిని ఈ రోజు సిబిఐ విచారణకు పిలిపించి, విచారణ చేసింది. ఆయనే ఎంపీ అవినాష్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డి. వివేక కుమార్తె సునీత, హైకోర్టుకు ఇచ్చిన 15 మంది లిస్టు లో, ప్రధానంగా భాస్కర రెడ్డి పేరు ఉన్న విషయం తెలిసిందే. భాస్కర్ రెడ్డిని విచారణకు పిలుస్తారా లేదా, అసలు భాస్కర్ రెడ్డి విచారణకు వస్తారా, ఇలా అనేక విషయాల పై గత కొంత రోజులుగా చర్చ జరుగుతుంది. ఈ నేపధ్యంలో కేసు విచారణ రోజు రోజుకీ వేగం పెరగటంతో, భాస్కర్ రెడ్డి ఈ రోజు సిబిఐ విచారణకు హాజరు అయ్యారు. ఈ కేసు చివరి దశకు వస్తున్న నేపధ్యంలో, గత వారం రోజులు నుంచి కూడా వైఎస్ కుటుంబ సభ్యులను, వైఎస్ సమీప బంధువులను, అలాగే సన్నిహితులను, అనుచరులను కూడా విచారణ చేస్తూ సిబిఐ ముందుకు వెళ్తుంది. అయితే ఒకానొక సమయంలో, ఈ కేసు విచారణ స్థితి చుసిన వారు, ఈ కేసు విచారణ భాస్కర రెడ్డి వరకు వెళ్తుందా లేదా అని అందరూ అనుకునే వారు. ఎందుకంటే, ఆయన ఈ కేసులో కీలక అనుమానితుడుగా ఉన్నారు. ముఖ్యంగా వైఎస్ వివేక కుమార్తె సునీత, ఇచ్చిన అనుమానితుల లిస్టు లో, ఆయన పేరు ప్రధానంగా ఉండటంతో, ఈయన పై మొదటి నుంచి ఫోకస్ ఉంది.

bhaskar 17082021 2

అయితే భాస్కర్ రెడ్డిని ఏ విషయంలో విచారించారు, కీలక సమాచారం ఏమైనా ఇచ్చారా, ఇతర విషయాలు ఏమిచేప్పారు అనేది తెలియాల్సి ఉంది. వీరి మధ్య ఏమైనా ఆర్ధిక పరమైన గొడవలు ఉన్నాయా, ఇతర సమస్యలు ఏమైనా ఉన్నాయా అనే విషయం పై విచారణ చేసి ఉంటారని తెలుస్తుంది. ఇక వైఎస్ వివేకా కేసు దర్యాప్తులో స్పీడ్ పెంచిన సీబీఐ, సునీల్ కు నార్కో అనాలసిస్ పరీక్షలు చేయాలని నిర్ణయం తీసుకుంది. అనుమతివ్వాలంటూ పులివెందుల కోర్టులో సీబీఐ పిటిషన్ వేసింది. అయితే పులివెందుల కోర్టు జడ్జి సెలవులో ఉండడంతో పిటిషన్ జమ్మలమడుగు కోర్టుకు బదిలీ అయ్యింది. సీబీఐ పిటిషన్ పై రేపు జమ్మలమడుగు కోర్టులో విచారణ జరగనుంది. ఇరు వర్గాల న్యాయవాదులు, వాదనలు వినిపించనున్నారు. విచారణకు సునీల్ సహకరించడం లేదన్న సీబీఐ అధికారులు, నార్కో అనాలసిస్ పరీక్షలతో నిజాలు బయటికొస్తాయనే భావనలో ఉన్నారు. మరి ఈ కేసు విచారణ ఎప్పటి లోపు కొలిక్కి వస్తుంది అనేది చూడాల్సి ఉంది.

Advertisements

Advertisements

Latest Articles

Most Read