అక్రమాస్తుల కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వైసీపీ అధినేత జగన్‌ శుక్రవారం సీబీఐ కోర్టుకు హాజరయ్యారు. ప్రతి శుక్రవారం కోర్టుకు హాజరుకావాలని జగన్‌ను సీబీఐ కోర్టు ఆదేశించింది. కోర్టు ఆదేశాల ప్రకారం జగన్ ప్రతి శుక్రవారం కోర్టుకు హాజరవుతున్నారు. ఈ కేసులో జగన్‌తో పాటుగా వైసీపీ నేత విజయ్‌సాయిరెడ్డి విచారణ ఎదుర్కొంటున్నారు. జగన్‌ సంస్థల్లో రాంకీ పెట్టుబడులకు సంబంధించిన చార్జిషీట్‌లో తన పేరును తొలగించాలని విజయసాయిరెడ్డి దాఖలు చేసుకున్న డిశ్చార్జ్‌ పిటిషన్‌పై ఆయన తరఫు న్యాయవాది శ్రీరామ్‌ జనవరి 20న కోర్టులో వాదనలు వినిపించారు. జనవరి 26 వతేది రిపబ్లిక్ డే సందర్భంగా కోర్టుకు సెలవుకు కావడంతో జగన్ కోర్టుకు రాలేదు.

cbi court 03022018 2

ఇదే కేసు పై సిబిఐ వాదనలు వినిపించింది... వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి హోదాలో వ్యాపారులకు 'మేళ్లు' చేకూరిస్తే... వారి నుంచి జగన్ పెట్టుబడులు రాబట్టి లబ్ది పొందారని ప్రత్యేక కోర్టుకు సీబీఐ నివేదించింది. 'మేళ్లు' చేకూర్చే జీవోలు ఇచ్చిన తర్వాతే జగన్ కంపెనీల్లో పారిశ్రామికవేత్తలు పెట్టుబడులు పెట్టారని వివరించింది. రాంకీ సంస్థ విషయంలోనూ ఇలాగే జరగడాన్ని గుర్తించాలని కోరింది... ఒక పథకం ప్రకారం పారిశ్రామికవేత్త లతో జగన్ తన సంస్థల్లోకి పెట్టుబడులు పెట్టించారని, ఈ కుట్రలో విజయసాయిరెడ్డికి పాత్ర ఉందని సీబీఐ నివేదించింది.

cbi court 03022018 3

జగన్ సంస్థల్లో రాంకీ పెట్టుబడులకు సంబంధించిన కేసులో తమ పేర్లు తొలగించాలంటూ జగన్, సాయిరెడ్డి, జగతి పబ్లికేషన్స్ వేర్వేరుగా దాఖలు చేసిన డిశ్చార్జ్ పిటిషన్లను న్యాయమూర్తి విచారించారు. ఈ సందర్భంగా సీబీఐ స్పెషల్ పీపీ కె.సురేందర్ వాదనలు వినిపించారు. జగన్, సాయిరెడ్డి, జగతి పబ్లికేషన్స్ నేరం చేశారనేందుకు ఆధారాలు ఉన్నాయనీ, వీరు దాఖలు చేసుకున్న డిశ్చార్జ్ పిటిషన్లను కొట్టివేయాలని కోరారు. తదుపరి విచారణను న్యాయమూర్తి ఈనెల 9కి వాయిదా వేశారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read