రికార్డుల్లో నా పేరుండడం కాదు, నా పేరుతోనే రికార్డులుంటాయంటారు బాలయ్య. కేంద్ర దర్యాప్తు సంస్థల కేసులలో నా పేరుండడం కాదు, నా కేసులతోనే కేంద్ర దర్యాప్తు సంస్థల రికార్డులు ఉంటాయనేది జగన్ రెడ్డి డైలాగ్. తండ్రి అధికారం చేపట్టినప్పుడు చేసిన హత్యలపై సీబీఐ విచారణతో తన కెరీర్ స్టార్ట్ చేసిన జగన్ రెడ్డి, తన స్థాయికి తగ్గట్టు ఏనాడూ రాష్ట్ర దర్యాప్తు సంస్థల కేసుల్లో లేడు. అన్నీ కేంద్ర దర్యాప్తు సంస్థల కేసులే. క్విడ్ ప్రోకోతో 42 వేల కోట్ల ప్రజాధనం దోపిడీ కేసులో జగన్ రెడ్డి ఏ1గా సీబీఐ, ఈడీ, ఫెమా కేసులు నమోదయ్యాయి. ఇవన్నీ కేంద్ర దర్యాప్తు సంస్థలే. అధికారంలోకి వచ్చాక కూడా తన స్థాయిని ఎక్కడా తగ్గించడంలేదు. పీపీఏల రద్దుతో అంతర్జాతీయ సంస్థలతో వివాదాలతో ప్రపంచస్థాయికి చేరింది ఘనత. బాంద్రా పోర్టులో డ్రగ్స్ పట్టుబడడంతో డీఆర్ఐ(డైరెక్టరేట్ రెవెన్యూ ఇంటిలిజెన్స్) నమోదు చేసిన కేసులో ఏపీకి చెందిన వ్యక్తే కింగ్ పిన్. ట్రమడాల్ టాబ్లెట్స్ కేసూ వైసీపీ నేతదే. హవాలా మనీ తరలింపు కేసు వైసీపీ నేతలదే. అటు రుషికొండ, ఇటు మడ అడవులు, చిత్తూరు జిల్లాలో ప్రాజెక్టులలో పర్యావరణ నిబందనల ఉల్లంఘనలపై నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ చీవాట్లు, జరిమానాలు ఎదుర్కొంటోంది ఏపీ సర్కారు. మరికొన్ని కేంద్రసంస్థలు కాగ్ వంటివి ఏపీ ఆర్థిక, అప్పుల పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేస్తూ నివేదికలు ఇచ్చాయి. అంతా నా ఇష్టం, చట్టం నా చుట్టం అంటూ నియంతలా జగన్ రెడ్డి తీసుకుంటున్న నిర్ణయాలు ఏపీని కేంద్రసంస్థల ముందు దోషిగా నిలబెడుతోంది.
కేంద్ర దర్యాప్తు సంస్థలన్నీ జగన్ రెడ్డి చుట్టూనే తిరుగుతున్నాయి
Advertisements