A2 విజయసాయి రెడ్డి బాటలోనే, A1 జగన్ పయనిస్తున్నారు... మొన్న A2 విజయసాయి రెడ్డి, నాకు జగన్ కేసులతో సంబంధం లేదు అని డిశ్చార్జ్ పిటిషన్ వేస్తే, నిన్న A1 జగన్ కూడా నాకు నా అక్రమాస్తులతో సంబంధం లేదు అని కేసులు నుంచి తప్పించమని A1 జగన్ కూడా డిశ్చార్జ్ పిటిషన్ వేశారు...
అయితే, దీనికి గెట్టి కౌంటర్ ఇచ్చింది సిబిఐ... జగన్ ముమ్మాటకి పెద్ద మోసగాడే అనే కోర్ట్ కి తేల్చి చెప్పింది... జగతిలో పెట్టుబడులు కోసం, తన పెట్టుబడిదారులను మోసం చేశారని సీబీఐ పేర్కొంది. పత్రిక ప్రారంభించిన ఐదారేళ్లు నష్టాలు తప్పవన్న సంగతి తెలిసి కూడా.. జగన్ ఆ విషయాన్ని పెట్టుబడిదారులకు చెప్పకుండ మోసం చేశాడు అని కోర్ట్ కి చెప్పింది.
జగన్ ప్రోద్బలంతో ఆడిటర్ విజయసాయిరెడ్డి పాత తేదీలతో జగతి పబ్లికేషన్ విలువను పెంచి డెలాయిట్ సంస్థ నుంచి నివేదిక తెప్పించారని తెలిపింది. జగన్ చైర్మన్ గా ఉన్న సమయంలో.. కంపెనీతో సంబంధం లేని వ్యక్తుల నుంచి పెట్టుబడులు స్వీకరించారన్న ఆరోపణలున్నాయి. నిబంధనలకు విరుద్దంగా జగతి పబ్లికేషన్స్ షేర్ ధరను ఆయన పెంచారని సీబీఐ చెప్పింది.
జగన్ దాఖలు చేసిన డిశ్చార్జ్ పిటిషన్ కొట్టివేయాలని సీబీఐ తన పిటిషన్ లో పేర్కొంది. ఈ పిటిషన్ శుక్రవారం ప్రత్యేక కోర్టు ద్వారా విచారణ జరగనుంది.