జగన్ మోహన్ రెడ్డికి సిబిఐ షాక్ ఇచ్చింది. జగన్ మోహన్ రెడ్డి అక్రమ ఆస్తుల కేసులో, తనకు వ్యక్తిగత హాజరు నుంచి, కోర్టుల నుంచి తనకు మినహాయింపు ఇవ్వాలని కోరుతూ జగన్ మోహన్ రెడ్డి దఖలు చేసిన పిటీషన్ పైన, ఈ రోజు తెలంగాణా హైకోర్టులో వాదనలు ముగిసాయి. ప్రధానంగా గతంలో ఇదే పిటీషన్ పైన సిబిఐ కోర్టులో విచారణ జరిగింది. సిబిఐ కోర్టు , జగన్ మోహన్ రెడ్డికి, విచారణ నుంచి వ్యక్తిగత మినహాయింపు ఇచ్చేందుకు నిరాకరించింది. దీంతో ఆయన గత ఏడాది తెలంగాణా హైకోర్టుని ఆశ్రయించారు. అయితే మధ్యలో కో-వి-డ్ పరిస్థితులు కారణంగా, ఈ పిటీషన్ పై విచారణ జరగలేదు. ఇటీవల కోర్టులు ప్రారంభం కావటం, ఈ కేసు పైన కూడా హైకోర్టులో విచారణ జరగటం జరిగింది. ఈ రోజు సిబిఐ తరుపున సీనియర్ న్యాయవాది సురేంద్ర వాదనలు వినిపించారు. ప్రధానంగా జగన్ మోహన్ రెడ్డికి, ఇదే అభ్యర్ధనను, సిబిఐ కోర్టు, హైకోర్టు నిరాకరించాయని తెలిపారు. ఒక వేళ జగన్ మోహన్ రెడ్డిని వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇచ్చినట్టు అయితే, సాక్ష్యులను ప్రభావితం చేస్తారని, ఆయన సాక్షాలను తారు మారు చేసే అవకాసం ఉందని సిబిఐ ప్రధానంగా వాదించింది. ఇదే కారణంతో హైకోర్టు కూడా మినహాయింపు ఇవ్వలేదని, గతంలో కన్నా, ఇప్పుడు జగన్ మోహన్ రెడ్డికి హోదా పెరిగిందని కోర్టుకు తెలిపారు.
ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి, సాక్ష్యులను ప్రభావితం చేసే అవకాసం మరింత ఎక్కువగా ఉంటుందని, సిబిఐ వాదించింది. కాబట్టి, జగన్ మోహన్ రెడ్డికి వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వద్దని, కచ్చితంగా హాజరు అయ్యేలా చూడాలని ఆదేశించాలని కోరారు. పదేళ్ళ నుంచి సిబిఐ కోర్టులో విచారణ జరుగుతుందని, అయినా కూడా కేసుల విచారణ ఇంకా డిశ్చార్జ్ పిటీషన్ల స్థాయిలోనే ఉందని, ఒకవేళ ఏ1గా ఉన్న జగన్ కు కేసుల నుంచి మినహియింపు ఇస్తే, ఈ కేసులు విచారణ మరింత ఆలస్యం అయ్యే అవకశం ఉందని సిబిఐ వాదించింది. వ్యక్తిగతంగా ఏమైనా అవసరం ఉన్నప్పుడు, అత్యవసరం అయినప్పుడు, ఆ రోజు మినహాయింపు కోరుతూనే ఉన్నారని, ఇప్పటికే 40 సార్లు ఆ విధంగా అడిగారని, కోర్ట్ కూడా మినహయింపు ఇస్తుందని, దానికి సిబిఐ కూడా ఒప్పుకుందని తెలిపారు. కానీ నిరవధికంగా వ్యక్తిగతంగా హాజరు ఇవ్వటం కుదరదని, సిబిఐ వాదించింది. ఇప్పటికే జగన్ తరుపు వాదనలు కూడా జరగటంతో, ఇక తీర్పుని రిజర్వ్ చేస్తూ కోర్టు ఉత్తర్వులు ఇచ్చింది.