అక్రమాస్తుల కేసులో నిందితుడు, ముఖ్యమంత్రి అయినంత మాత్రాన కేసు పరిస్థితులు మారిపోవు అంటూ, జగన్మోహన్​రెడ్డి విషయంలో సీబీఐ ఘాటు వ్యాఖ్యలు చేసింది. అక్రమాస్తుల కేసులో తనకు వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలంటూ జగన్ తెలంగాణ హైకోర్టులో వేసిన పిటిషన్​పై సీబీఐ కౌంటర్ దాఖలు చేసింది. ఈ కౌంటర్ లో, సిబిఐ, జగన్ పై ఘాటు వ్యాఖ్యలు చేసింది. ముఖ్యమంత్రి అనే హోదాను అడ్డుపెట్టుకుని జగన్​ కోర్టు హాజరు నుంచి తప్పించుకుంటున్నారని పిటిషన్​లో పేర్కొంది. వ్యక్తిగత హాజరు మినహాయింపు కోసం జగన్ వేసిన పిటిషన్ విచారణార్హం కాదని సిబిఐ తెలిపింది. బెయిల్ షరతులను జగన్‌ అతిక్రమిస్తున్నారని, సిబిఐ తన కౌంటర్ లో స్పష్టం చేసింది. జగన్ ప్రతి వారం కోర్టుకు హాజరు కావాల్సి ఉండగా, ఏదో ఒక కారణంతో బయటపడాలని జగన్ ప్రయత్నిస్తున్నారని సిబిఐ తెలిపింది. సీఆర్‌పీసీ సెక్షన్ 205ను ఉపయోగించి కోర్టుకు హాజరు కాకుండా చూస్తున్నారని అభియోగించింది. సీఎం అయ్యాక జగన్ ఒక్కసారే సీబీఐ కోర్టుకు వచ్చారని కోర్ట్ కు తెలిపింది.

సరైన కారణం చెప్పకుండా, వ్యక్తిగత మినహాయింపు కోసం జగన్ మళ్లీ పిటిషన్ వేశారని, సిబిఐ అభ్యంతరం చెప్పింది. ఇప్పుడు తన హోదా మారింది కాబట్టి, అది కారణంగా చెప్పి, మినహాయింపు ఇవ్వాల్సిన అవసరం లేదని కోర్టును కోరింది. చట్టం ముందు, ఎవరైనా ఒక్కటే అని, సీఎం, సామాన్యుడు అనే తేడా ఉండదని, సీబీఐ పేర్కొంది. నిందితుడి హోదా మారినంత మాత్రాన కేసు పరిస్థితి మారినట్లు కాదని తెలిపింది. వారానికోసారి విజయవాడ నుంచి రావడం కష్టం అంటూ జగన్ చెప్పటం, సరైన కారణం కాదని చెప్పింది. జగన్ పై, సిబిఐ కేసులు 11, ఈడీ కేసులు 5 ఉన్నాయని, జగన్ కేసుల్లో సహా నిందితులుగా ఉన్న వారు, ఇప్పుడు ఆయాన ప్రభుత్వంలో, ఉన్నారని, సిబిఐ కోర్ట్ కు తెలిపింది.

బెయిల్ ఇచ్చిన సమయంలో, జగన్ షరతులకు ఒప్పుకున్నారని, వాటికి ఇప్పుడు కూడా కట్టుబడి ఉండాలని సీబీఐ తన కౌంటర్ లో చెప్పింది. జగన్ మోహన్ రెడ్డి కేసుల్లో, ఇంకా కొన్ని అభియోగాలు నమోది చెయ్యాల్సి ఉందని, జగన్ కు వెసులుబాటు ఇస్తే, వాటిని ప్రభావితం చేసే అవకాసం ఉందని చెప్పింది. దేశ ఆర్ధిక వ్యవస్థ పై, ప్రభావం చుపించినే భారీ ఆర్ధిక కుంభకోణంలో, జగన్ మోహన్ రెడ్డి ఉన్నారని, కోర్ట్ వారు ఇది ద్రుష్టిలో పెట్టుకుని, జగన్ మోహన్ రెడ్డికి మినహాయింపు ఇవ్వనవసరం లేదని తెలిపింది. రాష్ట్ర విభజనకు, జగన్ రాజకీయానికి, ఈ కేసుకు సంబంధం లేదని, సిబిఐ చెప్పింది. జగన్ ఏమి చట్టానికి అతీతుడు కాదని, అతని తీవ్ర ఆర్ధిక నేరాలు ఉన్నాయని, షరతుల పై బెయిల్ తీసుకుని, ఇప్పుడు విచారణకు హాజరు కాకపోవటం ఏమిటని, సిబిఐ ప్రశ్నించింది.

Advertisements

Advertisements

Latest Articles

Most Read