ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడి లేని వింతలూ చోటు చేసుకుంటూ ఉంటాయి. ఇక్కడ ఏకంగా తీర్పులు చెప్పే జడ్జిలనే బూతులు తిట్టే వీరులు, ప్రజా ప్రతినిధులు ఉంటారు. మళ్ళీ ఆ ప్రజా ప్రతినిధుల పై డజను డజను కేసులు కూడా ఉంటాయి. ఇలా ఏకంగా జడ్జిల పైనే దూషణలు దిగిన కేసులో, దాదాపుగా వంద మందికి పైగా వైసిపీకి చెందిన పేటీయం బ్యాచ్ తో పాటుగా, కొంత మంది ప్రజా ప్రతినిధులు కూడా ఉన్నారు. పోయిన ఏడాది, డాక్టర్ సుధాకర్ ను రోడ్డున పడేసి, పిచ్చోడిగా చిత్రీకరించిన కేసులో, హైకోర్టు తీర్పు ఇస్తూ, ఈ కేసుని సిబిఐకి అప్ప చెప్పింది. పోలీసుల పైనే ఆరోపణలు ఉంటే, ఎవరైనా చేసే పని సిబిఐకి ఇవ్వటం. హైకోర్టు కూడా అదే పని చేసింది. అయితే హైకోర్టు, ఈ కేసుని సిబిఐకి ఇవ్వటం పై, వైసీపీ శ్రేణులు రెచ్చిపోయాయి. అసలు ఇలాంటి కేసుని సిబిఐకి ఇవ్వాల్సిన అవసరం ఏమిటి అంటూ సోషల్ మీడియాలో రెచ్చిపోయారు. జడ్జిల పైన, వారి తీర్పుల పైన ఇష్టం వచ్చినట్టు దూషణలకు దిగారు. చివరకు అధికార పార్టీ ప్రజా ప్రతినిధులు కూడా ఇదే బాట పట్టారు. దీంతో వీరి వికృత చేష్టల పై, అనేక ఫిర్యాదులు చీఫ్ జస్టిస్ కు వెళ్ళాయి. ఆధారాలు, వీడియోలతో సహా అన్నీ చీఫ్ జస్టిస్ కు వెళ్ళాయి. ఇవి అన్నీ చూసిన అప్పటి చీఫ్ జస్టిస్, ఇదేమి వికృతం అంటూ ఆశ్చర్య పోయారు.

hc 05072021 21

దీని వెనుక ఉన్న కుట్ర ఏమిటి, దీని వెనుక ఎవరు ఎవరు కుట్రలు పన్నారు, ఇలా పూర్తి వివరాలతో తమకు నివేదిక అందించాలి అంటూ, సిఐడికి ఆదేశాలు ఇచ్చారు. అయితే సిఐడి సరిగ్గా విచారణ చేయకపోవటం, ఈ కేసుని సిబిఐకి ఇచ్చారు. దీంతో సిబిఐ ఈ కేసు పై విచారణ చేసింది. దాదాపుగా 100 మందికి పైగా వైసిపీ కార్యకర్తలను విచారణ చేసింది. కొంత మందిని విశాఖ ఆఫీస్ కు పిలిచి విచారణ చేస్తే, కొంత మందిని విజయవాడలో కూడా విచారణ చేసారు. ఇప్పటికే మూడు సార్లు తమ రిపోర్ట్ ఇచ్చిన సిబిఐ, ఈ రోజు కూడా హైకోర్టుకు మరో రిపోర్ట్ ఇచ్చింది. ఇది చాలా పెద్ద కేసు అని, తమకు విచారణ పూర్తి చేయటానికి మరో మూడు నెలల సమయం కావాలని కోరింది. దీంతో హైకోర్టు కూడా అంగీకరించింది. ఈ కేసుని మూడు నెలలకు వాయిదా వేసింది. ఇప్పటికే సిబిఐ నాలుగు రిపోర్ట్ లు ఇచ్చింది. మూడు నెలలు తరువాత తుది రిపోర్ట్ ఇవ్వనుంది. జడ్జిల పై దూషణలు దిగిన వారు ఎవరు, ఎందుకు చేసారు, వీరి వెనుక ఎవరు ఉన్నారు అనేది బయట పడుతుందో లేదో చూడాలి.

Advertisements

Advertisements

Latest Articles

Most Read