హైకోర్టు న్యాయమూర్తులపై సోషల్ మీడియాలో వచ్చిన పోస్టింగ్ పై సీబీఐ ప్రాథమిక విచారణ పూర్తిచేసి హైకోర్టుకు నివేదిక సమర్పించింది. ఈ వ్యవహారం మొత్తంగా అంతర్జాతీయ సోషల్ మీడియా సంస్థలు ఉన్నందున పూర్తి స్థాయిలో దర్యాప్తు జరిపేందుకు కొంత వ్యవధి పడుతుందని కోర్టుకు వివరించింది. ప్రభుత్వ నిర్ణయాలకు వ్యతిరేకంగా హైకోర్టు పలు తీర్పువెలువరించిన తరువాత న్యాయవ్యవస, న్యాయమూర్తులకు వ్యతిరేకంగా సామాజిక మాధ్యమాల్లో పెద్ద ఎత్తున వ్యాఖ్యానాలు చేస్తూ పోస్టింగ్లు వచ్చాయి. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం బోధనకు వ్యతిరేకంగా, నర్సీపట్నం వైద్యుడు డాక్టర్ సుధాకరను పోలీస్ కస్టడీకి తీసుకున్న అంశంపై హైకోర్టు సీబీఐ దర్యాప్తునకు ఆదేశించిన నేపథ్యంలో కూడా న్యాయమూర్తులు, న్యాయ వ్యవస్థపై ఫేస్ బుక్, వాట్సాప్, ఉతర సామాజిక మాధ్యమాల్లో న్యాయమూర్తులను, కోర్టులను టార్గెట్ చేస్తూ పోస్టింగ్లు వచ్చాయి.. వీటిపై విచారణ జరపాల్సిందిగా హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ గతంలో సీఐడీ అధికారులకు ఫిర్యాదు చేశారు. దీని ఆధారంగా అప్పట్లో సీఐడీ అధికారులు పలువురిపై కేసులు నమోదు చేశారు. అయితే దర్యాప్తలో పురోగతి లేనందున సామాజిక మాధ్యమాలైన ట్విట్టర్, ఫేస్ బుక్, వాట్సాప్ వంటి వాటి నుంచి వివరాలు తీసుకోవటంలో సీఐడీ అధికారులు విఫలమయ్యారంటూ హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ రాష్ట్ర ప్రభుత్వంపై పిటిషన్ దాఖలు చేసారు.
దీనిపై విచారణ జరిపిన కోర్టు గత ఏడాది అక్టోబర్ 12న సీబీఐ దర్యాప్తునకు ఆదేశాలిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ వ్యాజ్యంపై బుధవారం హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బార్బీ, జస్టిస్ గంగారావులతో కూడిన ధర్మాసనం మరోసారి విచారణ జరిపింది. సీబీఐ తరుపు న్యాయవాది చెన్నకేశవులు ప్రాథమిక విచారణ నివేదిక సీల్డ్ కవర్‌లో కోర్టు ముందుంచి వాదనలు వినిపించారు. సీబీఐ పూర్తి స్తాయిలో దర్యాప్త జరపాలంటే మరికొంత వ్యవధి ఇవ్వాలని కోర్టును అభ్యర్థించారు. సీబీఐ నివేదికను కేసు రికార్డుల్లో చేర్చాల్సిందిగా రిజిస్ట్రీని ఆదేశించిన ధర్మాసనం కేసు తదుపరి విచారణను జూన్ 28వ తేదీకి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. మరి ఈ కేసు పై సిబిఐ విచారణలో ఏమి ఉంది ? అసలు దీని వెనుక నిజంగానే ఒక పార్టీ కుట్ర ఉందా ? ఎవరు దీని వెనుక ఉన్నారు ? ప్రజాప్రతినిధులు కూడా చేసిన కామెంట్స్, ఏ కోణంలో విచారణ చేసారు. మరి ఇవన్నీ తెలియాలి అంటే, కోర్టు ముందు ఏ నివేదిక ఉందో చూడాల్సి ఉంది.