చంద్రబాబు నవ్యాంధ్ర ముఖ్యామంత్రి అయిన తరువాత, పేదలకు పక్కా గృహాలు కట్టివ్వటమే ఆశయంగా, చాలా కసరత్తు చేసారు. చంద్రబాబుకు తోడు, అప్పట్లో వెంకయ్య నాయుడు కేంద్ర మంత్రిగా, రాష్ట్రానికి కొంత సహాయం చేసారు. దీంతో చంద్రబాబు మరింత దూకుడుగా, అధికారులకు టార్గెట్ ఫిక్స్ చేసారు. ప్రతి పేదవాడికి ఇల్లు కట్టించి ఇవ్వాలనే లక్ష్యంతో, ఒక పెద్ద యజ్ఞం మొదలు పెట్టారు. ఇల్లు కట్టి చూడు, పెళ్లి చేసి చూడు అని అంటారు. ఒక్క ఇల్లు కట్టటమే కష్టం అయిన ఈ రోజుల్లో, లక్షల లక్షల ఇల్లు కడుతున్నారు. అదీ పక్కాగా. మనకు తెలిసిన ఇందిరమ్మ గృహాలులా కాదు. అంతా పధ్ధతి ప్రకారం, ఒక్క పైసా అవినీతి లేకుండా కడుతున్నారు. ఈ క్రమంలో, రేపు, జూలై 5వ తారీఖు దాదాపు 3 లక్షల ఇళ్ళల్లో ఒకేసారి గృహప్రవేశాలు జరగనున్నాయి. దీంతో చంద్రబాబు ఈ విషయం పై రివ్యూ చేసారు. నా ఆశయం నెరవేరే రోజు అని, కేంద్రం కూడా ఇన్ని ఇళ్ళు ఎలా పూర్తి చేసారు అనే అంశం పై, మన వైపు చూస్తున్నారని అని అన్నారు.
ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా 5,80,849 ఇళ్ళ నిర్మాణం పూర్తియిందని, మిగిలిన 8-లక్షల ఇళ్ళను రానున్న జనవరి నాటికి పూర్తి చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. నెలకు లక్ష ఇళ్ళ నిర్మాణం పూర్తి చేయడమే లక్ష్యమని నిర్దేశించారు. 2022 నాటికి రాష్ట్రం లోని పేదలందరికి పక్కా ఇళ్ళు నిర్మిం చడమే ప్రభుత్వ లక్ష్య మని స్పష్టం చేశారు. ఈనెల 5వ తేదీన 3-లక్షల ఇళ్ళ సామూహిక గృహప్రవేశాల కార్యక్రమాన్ని నిర్వ హిస్తున్నామని ఇది ఒక చరిత్ర అని అన్నారు. గతంలో లక్ష సామూహిక గృహప్రవేశాలు నిర్వహించామని, అదే తరహాలో ఈ కార్యక్రమాన్ని కూడా విజయవంతం చేయాలని కోరారు. గత ప్రభుత్వం 10 ఏళ్ళ పాలనలో రాష్ట్ర వ్యాప్తంగా 14 లక్షల ఇళ్లు మాయమయ్యాయని , వీటిని నియోజకవర్గాల వారీగా ఎక్కడ ఎన్ని ఇళ్లు గల్లంతయ్యాయో వాటి వివరాలను విశ్లేషించాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అధికారులను ఆదేశిం చారు.
అక్రమాలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకో వాలని చెప్పారు. ప్రభుత్వ పథకాలలో అవినీతి, అక్రమాలకు పాల్పడితే చర్యలు ఎంత కఠినంగా ఉంటాయో తెలిసేలా చేయాలని సూచించారు. పేదల ఇళ్లను గల్లంతుచేసిన వారిపై కేసులు నమోదు చేయాలని ఆదేశించారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఎంతమందికి పేదలకు ఇళ్లు, ఇళ్లస్థలాలు లేవనే సమాచారాన్ని సేకరించాలని, దీనిలో సాధికార మిత్రలను వినియోగించుకోవాలని ముఖ్యమంత్రి సూచించారు. ప్రభుత్వ భూములు లేనిచోట ప్రైవేట్ భూములు కొనుగోలు చేసి ఇళ్ల స్థలాలు ఇస్తామని తెలిపారు. ఇప్పటికే భూముల కొనుగోలుకు రూ.750 కోట్లు కేటాయించినట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడించారు. దీనిలో ఎస్సీలకు రూ.250 కోట్లను ప్రత్యేకంగా కేటాయించినట్లు తెలిపారు. హౌసింగ్, రెవెన్యూ, పంచాయతీరాజ్ శాఖల అధికారులు సమన్వ యంతో పనిచేసి అర్హులైన ప్రతి పేద కుటుంబానికి పక్కా ఇళ్ళు అందించేలా కృషి చేయాలని సూచించారు.