జగన్ మోహన్ రెడ్ది ప్రభుత్వం పై, చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసారు. రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం పై జరుగుతున్న దాడులు పై చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసారు. జగన్ ప్రభుత్వానికి 48 గంటలు డెడ్లైన్ ఇస్తున్నామని, లేకపోతే నేరుగా రంగంలోకి దిగుతాం అని అన్నారు. పోలీసులు కూడా ఇష్టం వచ్చినట్టు ప్రభుత్వానికి వత్తాసు పలికి, మమ్మల్ని జగన్ కాపాడుతాడులే అనుకంటే, కుదరదని అన్నారు.గుంటూరు జిల్లా, ఫిరంగిపురం, పునుగుపాడు గ్రామాల్లో, దారికి అడ్డంగా గోడ కట్టి, వారికి అసౌకర్యం కలిగిస్తున్నారని అన్నారు. ఇప్పటికే దీని పై అనేక ఫిర్యాదులు చేసినా, పోలీసులు పట్టించుకోవటం లేదని అన్నారు. తెలుగుదేశం సానుభూతిపరులు, ఇళ్ళ ముందు ఇలా చేస్తున్నారని అన్నారు.

cbnwarning 26072019 2

ఇది సాక్షాత్తు హోం మంత్రి మేకతోటి సుచరిత సొంత మండలం అని, అక్కడే ఇలా జరుగుతుంటే పట్టించుకునే నాధుడే లేరని అన్నారు. ఇదే విషయం పై శాసనమండలిలో మేము ప్రశ్నిస్తే, సమాధానం చెప్పకుండా పారిపోయారని అన్నారు. ఫిరంగిపురం గ్రామానికి సంబంధించి 48 గంటల్లో ప్రభుత్వం దీని పై ఎదో ఒక చర్య తీసుకోవాలని డిమాండ్ చేసారు. ఒకవేళ ప్రభుత్వం స్పందించక పొతే, సోమవారం అసెంబ్లీలో ఈ విషయం పై నిలదీసి, మేమే రంగంలోకి దిగుతాం అని చంద్రబాబు అన్నారు. పోలీసులు కూడా వైసిపీని వెనకేసుకుని రాకుండా, చట్ట ప్రకారం వెళ్ళాలని చంద్రబాబు అన్నారు. ముఖ్యమంత్రి రౌడీయిజం చేస్తాడు మమ్మల్ని కాపాడతాడని పోలీసులు అనుకుంటున్నారు. చట్టం ముందు నేరస్తులంతా దోషులే అనేది గుర్తుంచుకోవాలి అని చంద్రబాబు అన్నారు.

cbnwarning 26072019 3

"గత 2నెలల్లో 7గురు టిడిపి కార్యకర్తలను హత్య చేశారు. 285భౌతిక దాడులకు పాల్పడ్డారు. 65 చోట్ల ఆస్తుల విధ్వంసాలు చేశారు. 11 ప్రాంతాలలో భూకబ్జాలకు పాల్పడ్డారు. 24చోట్ల తప్పుడు కేసులు బనాయించారు.చివరికి ఎమ్మెల్యేలపై దాడులకు పాల్పడితే వాటిని సభ దృష్టికి తెచ్చే అవకాశం కూడా స్పీకర్ కల్పించక పోవడం అతి దారుణం. రైతు దినోత్సవ సభకు టిడిపి ఎమ్మెల్యే బాల వీరాంజనేయ స్వామిని ఆహ్వానించి తీరా హాజరైతే అక్కడనుంచి వెళ్లిపోవాలని దౌర్జన్యం చేశారు. రాష్ట్రంలో అధికారుల నిస్స హాయతకు ఈ సంఘటన పరాకాష్ట. మరో టిడిపి ఎమ్మెల్యే బెందాలం అశోక్ శ్రీకాకుళం జిల్లాలో అంగన్ వాడి భవన ప్రారంభోత్సవానికి వెళ్తే దాడికి పాల్పడ్డారు. " అని చంద్రబాబు అన్నారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read