బీసీల రిజర్వేషన్ ను తమ పేలవమైన వాదనలతో, హైకోర్ట్ లో రిజర్వేషన్ కొట్టేసేలా చేసి, ఇప్పుడు సుప్రీం కోర్ట్ కు వెళ్ళకుండా, బీసీ రిజర్వేషన్ తగ్గించి, ఎన్నికలకు వెళ్ళటం పై, చంద్రబాబు మండి పడ్డారు. ఈ రోజు ఆయన మీడియా సమావేశం ఏర్పాటు చేసారు. చంద్రబాబు ఏమన్నారంటే... "బిసిల పట్ల రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును గర్హిస్తున్నాం, ఖండిస్తున్నాం. ఇది పద్దతి కాదని హెచ్చరిస్తున్నాం. ఆర్ధికంగా, సామాజికంగా బీసిలు శాశ్వతంగా వెనకబడి ఉండకుండా తగిన ఆదరణ, గుర్తింపు ఇవ్వాలి. బిసిల జనాభా 48%-50% కాబట్టి 34% రిజర్వేషన్లను 04.09.2013న అప్పటి ప్రభుత్వం కల్పించింది. 1995నుంచి 2020దాకా బిసిలకు రిజర్వేషన్లను 25ఏళ్లు కాపాడాం. వాటివల్ల బిసిలకు ఎనలేని లబ్ది చేకూరింది. 1987నుంచి 33ఏళ్లపాటు బిసిలకు రిజర్వేషన్ల లబ్ది చేకూరింది. అలాంటిది ఇప్పుడీ వైసిపి ప్రభుత్వం నిర్వాకం వల్ల బిసి రిజర్వేషన్లు 24%కు తగ్గుతాయి. 10% రిజర్వేషన్లను బిసిలు కోల్పోతారు. 16వేల మంది బిసిలు పదవులను కోల్పోతారు. ఇది మీ( వైసిపి ప్రభుత్వ) అసమర్ధత కాదా..? బిసిల పట్ల మీ కక్షకాదా..? 33ఏళ్లు కాపాడిన బిసి రిజర్వేషన్లను మీరు కాపాడలేక పోయారంటే ఇప్పుడు మిమ్మల్ని బిసి ద్రోహి అనాల్నా..? బిసి వ్యతిరేకి అనాల్నా..? మీ కేసులలో వాదించడానికి బ్రహ్మాండమైన లాయర్లను పెడతారు.

"ప్రజాధనం వాళ్లకు ఫీజులుగా కట్టబెడతారు. మరి బిసి రిజర్వేషన్ల కేసును ఎందుకు అనాధగా చూశారు..? కౌన్సిల్ రద్దుపై ఢిల్లీ వెళ్లి లాబీయింగ్ చేశారు, ప్రధానిని కలిశారు, అదే బిసి రిజర్వేషన్లపై వారితో ఎందుకని మాట్లాడలేదు..? బిసి రిజర్వేషన్లకు వ్యతిరేకంగా కోర్టుకు వెళ్లిన ఇద్దరూ వైసిపి వాళ్లే..రాఫ్తాడు మండల వైసిపి అధ్యక్షుడు బి రామాంజనేయులు ఒకరు కాగా, రెడ్ల సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి బిర్రు ప్రతాప్ రెడ్డి మరొకరు. నిన్న ఇచ్చిన తీర్పుపై సుప్రీంకోర్టుకు ఎందుకు పోవడం లేదో బిసిలకు సంజాయిషీ ఇవ్వాలి. డివిజన్ బెంచ్ వ్యతిరేకంగా తీర్పు ఇచ్చినా సుప్రీంకోర్టుకు వెళ్లి బిసి రిజర్వేషన్లను గత ప్రభుత్వాలు కాపాడాయి. ఈ 9నెలలు ఎందుకని నిద్రపోయారు..? అమరావతి నాశనం చేయాలి, పోలవరం నిలిపేయాలి, ప్రతిపక్షాలను నిర్వీర్యం చేయాలి,ఆర్ధిక మూలాలను దెబ్బతీయాలి, తప్పుడు కేసులతో మానసికంగా హింసించాలి అనేవాటిపైనేనా మీ దృష్టి అంతా..? బిసి రిజర్వేషన్లపై నిముషం కూడా ఆలోచించే తీరిక లేకుండా పోయిందా..? ఇప్పుడు పరీక్షల సీజన్ వచ్చింది, ఇన్నాళ్లు ఎందుకు నిద్రపోయారు..? ఆర్ధిక సంఘం డబ్బులు రావాలి కాబట్టి బిసిలకు అన్యాయం చేస్తారా..? దీనినింతటితో వదిలిపెట్టం, 131కులాల తరఫున సుప్రీంకోర్టుకు వెళ్లి పోరాడతాం. బిసి రిజర్వేషన్ల పరిస్థితి కేంద్రానికి వివరించి సాయం చేయమని ఎందుకు కోరలేదు..? కౌన్సిల్ రద్దుకు సాయం అడిగిన వాడివి బిసి రిజర్వేషన్లపై ఎందుకని అడగలేదు..? "

"గత ప్రభుత్వాలకు ఉన్న చిత్తశుద్ది మీకెందుకు లేకుండా పోయింది..? బిసిలకు 33% రిజర్వేషన్లు ఇవ్వాలని దేశం అంతా ఒత్తిడి చేస్తుంటే స్థానిక సంస్థల్లో బిసిలకు గతంనుంచి ఉన్న రిజర్వేషన్లలో కోత పెట్టడాన్ని ఏమనాలి..? ఇది బిసిలకు నమ్మక ద్రోహం కాదా..? ఇక్కడే బిసిలపై మీకున్న కక్ష బైటపడింది. మీరు ఇవ్వకపోతే పోయారు, మేము ఇచ్చింది తీసేసే హక్కు ఎవరిచ్చారు..? కావాలని ఎన్నికలు తెచ్చి శాశ్వతంగా బిసిలకు ద్రోహిగా మిగిలిపోవద్దు. నిన్న తీర్పు వస్తే కులసంఘాలతో, రాజకీయ పార్టీలతో మీరెందుకని చర్చించలేదు..? ఆరోజు కిరణ్ కుమార్ రెడ్డికి ఉన్న చిత్తశుద్ది,ఇంగిత జ్ఞానం మీకు లేదా..? 34% రిజర్వేషన్లను 40%కు పెంచాలిగాని, 24%కు తగ్గిస్తారా..? నోరుతెరిస్తే అన్నీ అబద్దాలే.. ఒక్కరోజైనా వాస్తవాలు చెప్పారా..? అబద్దాల కోరు పార్టీ వైసిపి.. మిగలబెడ్తామన్నారు పోలవరాన్ని ఏం మిగిలింది..? ఉద్దరిస్తామన్నారు రాష్ట్రాన్ని ఏం ఉద్దరించారు..? అమరావతిని ఉద్దరిస్తామన్నారు ఏం ఉద్దరించారు..? వీళ్లవల్ల మా పరువు పోయిందని కేంద్రమంత్రే అన్నారు. డిజిపిని హైకోర్టు పిలిచే పరిస్థితి. పర్యటనకు అనుమతి ఇచ్చి నాకు 151నోటీసు ఇస్తారు. రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించారు, అప్రదిష్టపాలు చేశారు. భావితరాల భవిష్యత్తు అంధకారం చేశారు. మీ చేతగానితనానికి బిసిలు మాల్యం చెల్లించాలా..? బిసిల రాజకీయ భవిష్యత్తును శాశ్వతంగా సమాధి చేస్తారా..? వైసిపి ఉన్మాద చర్యలపై ప్రజలంతా ఆలోచించాలి. " అని చంద్రబాబు అన్నారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read