క్రైసిస్ మ్యానేజ్మెంట్ అంటే, ఏపి ప్రజలకు గుర్తుకు వచ్చేది చంద్రబాబు. 1996 తుఫాను సమయంలో కాని, 2009లో వచ్చిన కృష్ణా వరదలు కాని, ఉత్తరఖాండ్ వరదలు కాని, హూద్ హూద్ కాని, తిత్లీ కాని, అధికార పక్షంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా, ప్రజలకు ఏ ఇబ్బంది వచ్చినా, చంద్రబాబు ముందుండి నడిపించే వారు. అయితే, ఇప్పుడు కరోనా వచ్చిన సమయంలో చంద్రబాబు, ఆంధ్రప్రదేశ్ లో ఉండకుండా, హైదరాబాద్ లో పడుకున్నారు అంటూ, వైసీపీ విమర్శలు చేస్తూ వస్తుంది. నిజానికి చంద్రబాబు, గత 5 ఏళ్ళుగా ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో, ఉదయం 9 నుంచి, రాత్రి 11 వరకు సచివాలయంలో ఉంటూ, ఎంత కష్టపడే వారు ప్రజలకు తెలుసు. ప్రతిపక్షంలోకి వచ్చిన తరువాత, ఆయన ప్రతి శనివారం, ఆదివారం హైదరాబాద్ వెళ్తున్నారు. తెలంగాణాలో పార్టీని బలోపేతం చేయటం, కుటుంబంతో గడపటం కోసం వెళ్తున్నారు. అలాగే, మొన్న కూడా హైదరాబాద్ వెళ్ళగా, వెంటనే ప్రధాని మోడీ లాక్ డౌన్ ప్రకటించటం, తరువాత దాన్ని పొడిగించటంతో, చంద్రబాబు అక్కడే ఉండి పోవాల్సి వచ్చింది.
అయితే ఇదే విషయం పై, నిన్న జూమ్ యాప్ లో, చంద్రబాబు చేసిన వీడియో కాన్ఫరెన్స్ , మీడియా సమావేశంలో, ఒక విలేకరి, చంద్రబాబుని ఇదే ప్రశ్న అడిగారు. వైసీపీ నేతలు, మీకు బాధ్యత లేదు అని, మీరు హైదరాబాద్ లో ఉంటున్నారు అని విమర్శిస్తున్నారు, మీరు ఏమి చెప్తారు అని అడిగితే, చంద్రబాబు దానికి స్పందిస్తూ, విమర్శించే వారు, విమర్శిస్తూనే ఉంటారు, నేను లాక్ డౌన్ కు ముందు హైదరాబాద్ వచ్చాను, తరువాత లాక్ డౌన్ ప్రకటించటం, దాన్ని పొడిగించటం చేసారు, బయటకు రాలేని పరిస్థితి వచ్చింది, ఇక్కడ ఉన్నా, నా మనసు అంతా అక్కడ జరుగుతున్న విషయాల పైనే ఉంది. ఉదయం 10 గంటల నుంచి, సాయంత్రం 7 గంటల వరకు, ఆఫీస్ లో కూర్చుని, సమాచారం మొత్తం తెప్పించుకుంటున్నాను అని అన్నారు.
ఎవరికి ఇబ్బంది ఉన్నా, పక్క రాష్ట్రాల్లో చిక్కుకున్న మన రాష్ట్రం ప్రజల ఇబ్బందులు ఉన్నా, అక్కడ అధికారులతో మాట్లాడుతున్నాం, అలాగే పార్టీ నాయకులకు, ఎప్పటికప్పుడు డైరెక్షన్స్ ఇస్తున్నాం, ప్రజలకు ఏ సమాచారం ఇవ్వాలి, అవగాహనా కార్యక్రమాలు చేస్తున్నాం, ప్రధాని మంత్రికి, చీఫ్ సెక్రెటరీకి, ముఖ్యమంత్రికి, ఎప్పటికప్పుడు ఉత్తరాలు రాస్తూ, అలెర్ట్ చేస్తున్నాను, ఇలా అనేక కార్యక్రమాలు చేస్తూనే ఉన్నాను. నాకు ఏపికి రావాలనే ఉంది, కాని కేంద్రం ఇచ్చిన ఆదేశాలు పాటించాలి, అక్కడ ఉన్నా, ఇంట్లోనే ఉండాలి కదా, ఎక్కడైనా, నేను తెలుగు ప్రజల గురించే ఆలోచిస్తున్నాను, విమర్శలు చేసే వాళ్ళు చేస్తూనే ఉంటారు, అని చంద్రబాబు అన్నారు. అలగే దాదపుగా, గంట పాటు ప్రజలకు వీడియో ప్రేజంటేషన్ ఇచ్చారు. ఏ ఆహరం తినాలి, ఇమ్మ్యూనిటి ఎలా పెంచుకోవాలి, వ్యాయామం చెయ్యటం, అలాగే, పరిశుభ్రత గురించి చెప్తూ, రైతుల సమస్యలు, ఆక్వా, పౌల్ట్రీ, హార్టికల్చర్ సమస్యలు, పేదలకు నిత్యావసరాలు, ఇలా అనేక విషయాలు ప్రస్తావిస్తూ, ప్రజలకు సలహాలు ఇస్తూ, ప్రభుత్వానికి విజ్ఞప్తులు చేస్తూ, చంద్రబాబు మాట్లాడారు.