అమరావతి బంగారు గుడ్డు పెట్టే బాతులాంటిదని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. అన్ని రాష్ట్రాలకు బ్రహ్మాం డమైన నగరాలున్నాయని చెప్పారు. ఏపీకి మంచి నగరం అవసరం అని గతం లో జగనే అన్నారని గుర్తుచేశారు. కానీ ఇప్పుడు జగన్ యూటర్న్ తీసుకున్నా రని విమర్శించారు. టీడీపీ ఎప్పుడూ ఒకే మాట మీద ఉన్నాదని తెలిపారు. అమరావతిని విధ్వంసం చేయాలని రైతులను అపహాస్యం చూస్తున్నారని ఆరో పించారు. రైతులు నమ్మి 33 వేల ఎకరాలు ఇచ్చారని తెలిపారు. 151 సీట్లతో వైసీపీకి ఒళ్ళంతా గర్వంగా ఉందని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. రాష్ట్ర నికి ప్రత్యేక హోదా ఎప్పుడు సాధిస్తారో వైసీపీ చెప్పాలని డిమాండ్ చేశారు. వైసీపీ తప్పుడు విధానాలతో రాష్ట్రం అధోగతి పాలవుతోందని ధ్వజమెత్తారు. అమరావతి భూముల విలువ పెరగడంతో వైసీపీ జీర్ణించుకోలేకపోతోందని ఆరోపించారు. ఆరోజు రైతులు నమ్మి రాజదాని కోసం 33వేల ఎకరాల భూమి ఇచ్చారు. మీరు భూమి ఇవ్వండి, ఇక్కడ తొమ్మిది నగరాలు వస్తాయని చెప్పాం.

ganta 2112019 2

మీ పిల్లల భవిష్యత్తు బాగుంటుంది, ప్రజారాజధానిగా ఉంటుందని చెప్పిన ప్పడు సహకరించారు. రాష్ట్రానికి ఉపాధి కల్పన కేంద్రంగా అమరావతి ఉంటుందనే రైతులు ముందుకు వచ్చారు. అలాంటి రైతు ల్ని వెక్కిరించే విధంగా ప్రవర్తిస్తున్నారు. రాజకీయాల్లో వ్యక్తి గత ప్రయోజనాలు కాదు ప్రజా ప్రయోజనాలు ముఖ్యం. అభివృద్ధి అనేది అధికార వికేంద్రీకరణతో కాదు, అభివృద్ధి వికేంద్రీకరణతో సాధ్యం. ఆంధ్రప్రదేశ్ కు మంచి నగరం నిర్మాణం అవసరం. టీడీపీ హయాంలోనే హైదరాబాదు అభివృద్ధి చేశాం. తెలంగాణకు ఆదాయం హైదరాబాద్ నుంచే వస్తోంది అని చంద్రబాబు వివరించారు. 30 రాజదానులు పెడతామంటూ ఓ మంత్రి మాట్లాడుతున్నాడు. రాజధాని విషయంలో ప్రజలతో ఆడుకుంటారా అని ఆగ్ర హం వ్యక్తం చేశారు. అయినా ప్రతి శుక్రవారం కోర్టుకు వెళ్ళేవారికి ఆంధ్ర అభివృద్ధి గురించి తెలుస్తుందా, మీడియా స్వేచ్ఛను హరిస్తుంటే మీడియా ఏం చేస్తోంది అని నిలదీశారు.

ganta 2112019 3

మీడియా ప్రభుత్వాన్ని ప్రశ్నించాలని కోరారు. 2430 జీవో తెచ్చి మీడియాపై ఆంక్షలు పెట్టారు. ఏబీఎన్ చానల్ గొంతు నొక్కి ఇబ్బంది పెడుతున్నారన్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం అప్పట్లో బీజేపీతో పొత్తు పెట్టుకున్నామని స్పష్టం చేశారు. విశాఖను నాలెడ్జ్ హబా తయారు చేయాలని చూశామని చెప్పారు. ఎక్కడ అభివృద్ధి జరిగితే దానికి అవినీతి అనే ముద్దు పేరు పెడుతున్నారని వాపోయారు. అభివృద్దిని చంపేసి పైశాచిక ఆనందం పొందుతున్నారన్నారు. మాటలు కట్టిపెట్టండి.. చేతనైనే చట్టపరంగా చర్యలు తీసుకోవాలని సవాల్ విసిరారు. పెట్టుబడులన్నీ వెనక్కి పోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. రిలయన్స్, ఆదానీ, పేపర్శిల్స్.. కియా మోటార్స్ యాక్సరీస్ కంపెనీలు పోయాయని విచారం వ్యక్తం చేశారు. మేం కంపెనీలు తీసుకొస్తే మీరు తరిమేసే పరిస్థితి తీసుకొచ్చారు అని మండిపడ్డారు. అయితే ఈ సందర్భంలో మీడియా వాళ్ళు, మీ పార్టీ నాయకులు అయిన గంటా లాంటి వాళ్ళు, మూడు రాజధానులు ఆహ్వానిస్తున్నారుగా అని ఆడగా, దానికి చంద్రబాబు స్పందిస్తూ, మీ ప్రాంతంలో రాజధాని వస్తుంది అంటే, మీకు సంతోషం ఉండదా ? వాళ్ళు ఏమి చేస్తారు, ఎవరైనా ఆహ్వానిస్తారు. కాని వీళ్ళు చేసే పనులతో, ఏ ప్రాంతం కూడా ప్రశాంతంగా ఉండదు, వీళ్ళ ఉచ్చులో పడితే, అన్ని ప్రాంతాలని, ఎందుకు పనికి రాకుండా చేస్తారని అన్నారు. ఇవన్నీ ప్రజలు అర్ధం చేసుకోవాలని అన్నారు. వీళ్ళ సమర్ధత ఏమిటో ఈ ఆరు నెలల్లోనే తెలిసిందని, వీళ్ళా రాజధునులు కట్టేది అని అన్నారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read