గత వారం రోజులుగా అమరావతిలో జరిగిన, బోస్ రేసింగ్, ఎయిర్ షో కార్యక్రమాలతో నవ్యాంధ్ర రాజధాని అమరావతి ఖ్యాతిని అంతర్జాతీయ స్థాయికి పెంచామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. మనం చేస్తున్న పనులతో పంచవ్యాప్తంగా అందరి దృష్టి అమరావతిపైనే ఉందని అభిప్రాయపడ్డారు. ప్రపంచంలోనే టాప్-5 సుందరమైన నగరాల్లో ఒకటిగా అమరావతిని తీర్చిదిద్దుతామని సీఎం పునరుద్ఘాటించారు. అమరావతిలో ఈ రోజు ‘నీరు-ప్రగతి’ కార్యక్రమంపై ముఖ్యమంత్రి టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. గుంటూరు జిల్లా తుళ్లూరు వద్ద గోదావరి-పెన్నా నదుల అనుసంధానం ద్వారా మరోసారి చరిత్ర సృష్టించబోతున్నామని తెలిపారు. ఇప్పటికే గోదావరి-కృష్ణా నదులను తమ ప్రభుత్వం అనుసంధానం చేసిందని గుర్తుచేశారు.

cbn 26112018

పంచ నదుల మహా సంగమమే లక్ష్యమని స్పష్టం చేశారు. అనంతపురంలో సూక్ష్మ సేద్యం ద్వారా అద్భుత ఫలితాలు వచ్చాయన్నారు. మైక్రో ఇరిగేషన్‌తో ఉత్పాదకత 29% పెరిగిందని సీఎం పేర్కొన్నారు. ప్రపంచం వినూత్న ఆవిష్కరణల వైపు చూస్తోందన్నారు. బయో మెట్రిక్ ద్వారా పారదర్శకంగా పథకాల అమలు చేయాలని అధికారులకు సూచించారు. బోట్ రేసింగ్, ఎయిర్ షోతో అమరావతి ఖ్యాతి పెంచామన్నారు. అంతర్జాతీయంగా అందరి దృష్టి అమరావతిపైనే ఉందని పేర్కొన్నారు. ఈనెల చివరలో, డిసెంబర్ మొదట్లో వర్షాలు పడే అవకాశం ఉందని అన్నారు.

cbn 26112018

రబీలో సీమ జిల్లాలు, ప్రకాశంలో పంటల విస్తీర్ణం పెరిగిందని, నాణ్యమైన పైర్లు, ఆరోగ్య జీవనానికి ఏపీ చిరునామా కావాలని తెలిపారు. కత్తెర తెగులు సోకకుండా జొన్న, మొక్కజొన్నను కాపాడాలన్నారు. ఎప్పటికప్పుడు రైతులను చైతన్యపరచాలని సీఎం ఆదేశించారు. గోకులం, మినీ గోకులాలను సద్వినియోగం చేసుకోవాలని, పశు గణాభివృద్ధిపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని అన్నారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో ముందున్నామని, టెక్నాలజీలో ఏపీనే ముందుందని చెప్పారు. ఈజ్ ఆఫ్ లివింగ్ లో కూడా తామే ముందుండాలని ఆకాంక్షించారు. నరేగాలో గత ఏడాది లక్ష్యం పూర్తిచేశామని, రూ.10వేల కోట్ల నరేగా లక్ష్యాన్ని చేరుకోవాలని తెలిపారు. ఆదరణ-2 పనిముట్లు వెంటనే పంపిణీ చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు.

 

Advertisements

Advertisements

Latest Articles

Most Read