తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఈ రోజు మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు మాట్లాడుతూ, "వైసిపి ప్రభుత్వ పాలనగురించి దేశం ప్రపంచం, రాజకీయ పార్టీలు, ప్రజలు ఏమనుకుంటున్నారో జాతీయ మీడియాలో వచ్చిన ఆర్టికల్సే రుజువులు. ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత సమాజంపై ఉంది. ఇది నాకెందుకు అనుకుంటే నష్టపోయేది ప్రజలే. ప్రజల్లో చైతన్యం రావాల్సివుంది. అందరూ ఒక్క నిముషం ఆలోచించాలి. ఎక్కడికి పోతోందీరాష్ట్రం, ఎటు పోతోందీ రాష్ట్రం అనేది అందరూ ఆలోచించాలి. ఇక్కడ రాస్తే ఎల్లో జర్నలిజం అంటున్నారు, కులముద్ర వేస్తున్నారు. కానీ జాతీయ మీడియాలో వచ్చే వార్తలకు ఏం సమాధానం చెబుతారు. జాతీయ పత్రికలకు ఇదే అంటకడతారా..? మీడియాకు పూర్తి స్వేచ్ఛ ఉండాలి, నియంతృత్వ పోకడలు మానుకోవాలి అని టెలిగ్రాఫ్ రాసింది. 3రాజధానుల నిర్ణయాన్ని ఇండియన్ ఎక్స్ ప్రెస్ తప్పు పట్టింది. అమరావతిని నిర్వీర్యం చేయాలన్నదే జగన్ ఆలోచనైతే అది అసమర్ధ నిర్ణయంగా పేర్కొంది. అమరావతి ప్రాజెక్టు రద్దు, పిపిఏల రద్దు అవివేక నిర్ణయాలు అమలు చేయకుండా కేంద్రం జోక్యం చేసుకోవాలి. ‘‘జగన్ తన చపలచిత్తాల వల్ల ఏపి పెట్టుబడులను అడ్డుకుంటున్నారని’’ బిజినెస్ స్టాండర్డ్ రాసింది. జగన్ ఒక తుగ్లక్ గా ఆర్గనైజర్ పత్రిక పేర్కొంది, కేంద్రం జోక్యానికి ఇదే సరైన సమయంగా చెప్పింది. రాజకీయ కారణాలతో అమరావతిని అడ్డుకుంటున్నారని హిందూస్థాన్ టైమ్స్ రాసింది. "

‘‘లక్షలాది కోట్లతో సాగే విద్యుత్ ప్రాజెక్టులు, అమరావతి ప్రాజెక్టులు అడ్డుకోవడం దేశంలోనే పెట్టుబడుల వాతావరణాన్ని అడ్డుకోవడమని’’ అమెరికా పత్రిక బ్లూం బర్గ్ రాసింది. 3రాజధానుల ఆలోచన అంత తేలిక కాదు, రైతులను ఆదుకోవాలని’’ ద హిందూ బిజినెస్ లైన్ చెప్పింది ‘‘జగన్ ప్రభుత్వానిది తిరోగామ దృక్ఫథం, అమరావతి ఆపేయడం దేశంలో పట్టణాభివృద్దికే విఘాతమని’’ ఎకనామిక్ టైమ్స్ చెప్పింది. ‘‘ఘర్షణాయుత వాతావరణం వల్ల రాష్ట్రం దెబ్బతింటుంది, కక్ష సాధింపే జగన్ ప్రధాన దృష్టిగా కనిపిస్తోందని’’ టైమ్స్ ఆఫ్ ఇండియా రాసింది. పరి పాలన కన్నా తన ఇగోకే జగన్ ప్రాధాన్యం ఇస్తున్నారని ఒక జాతీయ పత్రిక రాసింది. 3రాజధానుల వల్ల జరిగే నష్టాలను సౌతాఫ్రికా ప్రధాని చెప్పారు. 3చోట్ల ఇళ్లు ఉండాలని, 3కార్లు ఉండాలని అన్నారు. 3 రాజధానులు సరైన నిర్ణయం కాదని శేఖర్ గుప్తా అన్నారు. వేర్వేరు సమయాల్లో వేర్వేరు ఆర్టికల్స్ రాశాయి జాతీయ పత్రికలన్నీ. ఇన్ని ఎడిటోరియల్స్ రాశాయి, ఇంతమంది ఈ రకంగా మాట్లాడారు, వీటన్నింటికి జవాబివ్వాల్సిన బాధ్యత మీకు లేదా..? ఒకప్పుడు దావోస్ అంటే ఆంధ్రప్రదేశ్ గుర్తొచ్చేది. ఇప్పుడు ఏపి మార్కెటింగ్ ఏమోకాని ఏవిధంగా మాట్లాడారో వినాలి. విశాఖలో రూ 70వేల కోట్ల అదాని డేటా సెంటర్ ఎందుకు పోగొట్టారో చెప్పాలి. ఫిన్ టెక్ ఎందుకు ఆపేశారు..? ఫార్ట్యూన్ 500కంపెనీల్లో ఒకటైన ప్రాంక్లిన్ టెంపుల్ టన్ ఎందుకు పోగొట్టారు..?"

"లులూ అయితే ఇక ఏపికి రామని చెప్పే పరిస్థితి ఎందుకు తెచ్చారు..? ఒంగోలులో రూ 25వేల కోట్ల పేపర్ ఇండస్ట్రీని పోగొట్టారు. తిరుపతిలో వేలాది మందికి ఉపాధి కల్పించే రిలయన్స్ పోగొట్టారు. అమరావతి నుంచి సింగపూర్ వెళ్లిపోయేలా చేశారు. కియా 17ఆగ్జిలరీ యూనిట్లు వేరే రాష్ట్రాలకు వెళ్లిపోయాయి. వైసిపి ఎంపి కియా అధికారులను కొట్టేట్లు బెదిరించారు. వరల్డ్ బ్యాంకు, ఏసియన్ బ్యాంక్ రూ 5వేల కోట్ల పెట్టుబడులు వెనక్కిపోయేలా చేశారు. 130సంస్థలకు 1250ఎకరాలు ఇస్తే రూ 45వేల కోట్ల పెట్టుబడులు, వేలాది మందికి ఉద్యోగాలు ఇస్తామన్నాయి. వాళ్లందరినీ తరిమికొట్టే పరిస్థితి తెచ్చారు. ‘‘ఎవరు రమ్మన్నారు మిమ్మల్ని, పోతే పొండి ఉంటే ఉండండి’’ అని నీచంగా చూసే పరిస్థితి. ప్రాంతీయ విద్వేషాలు తెచ్చి ఏవిధంగా అభివృద్ది సాధిస్తారు..? ఇక్కడ ల్యాండ్ పూలింగ్ క్యాన్సిల్ చేస్తాం అంటారు, అక్కడ ల్యాండ్ పూలింగ్ చేస్తామంటారు. ఎవరిచ్చారు ఈ అధికారం మీకు..? విశాఖలో కొన్నివేల ఎకరాలు చేతులు మారాయి, రేపోమాపో అవన్నీ బైటకు వస్తాయి. అనునిత్యం అబద్దాలు ప్రచారం చేస్తున్నారు. నీతికి మారుపేరైన దేశాలపై బురద జల్లుతున్నారు. నీటిపారుదల ప్రాజెక్టులన్నీ రద్దు చేశారు. గుండ్రేవుల, భైరవాని తిప్ప, మేము టెండర్లు పిలిచిన ప్రాజెక్టులన్నీ ఏమయ్యాయి.? ఈ 9నెలల్లో ఒక్క రూపాయి ఖర్చు చేశారా ప్రాజెక్టులపై..? 3రాజధానులు పెట్టే హక్కు మీకెక్కడ ఉంది..? "

"ఫిబ్రవరి 26దాకా కార్యాలయాల తరలింపు చేయరాదని హైకోర్టు చెప్పింది. ఒకవేళ చేస్తే అధికారుల జేబుల్లో నుంచి రాబడతామని కోర్టు చెప్పింది. అయినా కార్యాలయాలను ఎలా తరలిస్తారు..? ఇది కోర్టు ఆదేశాల ధిక్కరణ కాదా..? గతంలో సీఎస్ ను బెదిరించి, దౌర్జన్యం చేసి, పంపేస్తారా..? ఒక సీఎస్ తో ప్రవర్తించే తీరు ఇదేనా..? ఇదేనా పరిపాలనా తీరు..? మీకు కావాల్సిన అధికారులను పెట్టుకుని ఇష్టానుసారం చేస్తారా..? పిపిఏలపై తప్పుడు డాక్యుమెంట్లు ఐఏఎస్ లతో విడుదల చేయిస్తారా..? అధికారులు హుందాతనం లేకుండా వ్యవహరిస్తారా..? అడ్వయిజర్లు రాజకీయ ఉపన్యాసాలు చేస్తారా..? ప్రజావేదిక కూల్చి ఎన్నినెలలైంది, కనీసం శిధిలాలను కూడా ఇప్పటిదాకా తొలగించరా..? అసెంబుల్డ్ స్ట్రక్చర్స్ తీసుకెళ్లి మరోచోట వాడుకోకూడదా..? ఏం పాపం చేసింది ప్రజా వేదిక..? ప్రజల సొమ్మును ఇలా ధ్వంసం చేస్తారా..? ఎవరిచ్చారు ఈ అధికారం మీకు..? కేంద్రమంత్రి ఆర్ కె సింగ్ ఏమని లేఖ రాశారు మీకు..? ఊహాగానాలతో పిపిఏలపై చర్యలు తీసుకోవద్దని చెప్పలేదా..? దీనివల్ల పెట్టుబడులు రావు, ప్రపంచవ్యాప్తంగా తప్పుడు సంకేతాలు వెళ్తాయి అనలేదా..? జపాన్ అంబాసిడర్ ఏమని చెప్పారు. ఏపిలో వ్యాపారం తిరోగమించేదిగా ఉందని అనలేదా..? ఒకవ్యక్తి మూర్ఖత్వం వల్ల, చపలచిత్తం వల్ల, ఉన్మాదం వల్ల రాష్ట్రానికి ఇంత చేటు తెస్తారా..? భావితరాల భవిష్యత్తు ఏమవుతుంది..? ఇంకా ఎవరైనా వస్తారా పెట్టుబడులు పెట్టడానికి..? మీవల్ల రాష్ట్రంలో ఉద్యోగాలు రావు, వేరే రాష్ట్రాలలో మనవాళ్లకు ఉద్యోగాలు లేకుండా చేశారు. మీ భేషజాలతో రాష్ట్రాన్ని దెబ్బతీస్తారా..? పబ్జి గేములు ఆడుకున్నంత తేలికకాదు పరిపాలన." అని చంద్రబాబు అన్నారు...

Advertisements

Advertisements

Latest Articles

Most Read