తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఈ రోజు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా గత ఏడాది కాలంగా జగన్ మోహన్ రెడ్డి చేసిన అరాచకాల పై మీడియా సమావేశంలో వివరించారు. అదే విధంగా జగన్ ఢిల్లీ టూర్ పైన కీలక వ్యాఖ్యలు చేసారు. ఆయన మాటల్లోనే "రాష్ట్ర భవిష్యత్తు కోసం ప్రతిఒక్కరూ ఆలోచించాలి - జరిగిన పరిణామాలను అవగతం చేసుకోవాలి - జరగబోయే నష్టాన్ని అంతా గమనించాలి - విధ్వంసంతో పరిపాలనను ప్రారంభించారు - జగన్ ఓ విధ్వంసకుడిగా మారారు - నా రాజకీయ చరిత్రలో ఇలాంటి పాలన చూడలేదు - ప్రజావేదికను కూలగొట్టారు.. శిథిలాలను తొలగించలేకపోయారు - ప్రజల ఆస్తి విధ్వంసంతోనే ఉన్మాదం బయటపడింది - కొనసాగింపుగా అమరావతి విధ్వంసం మొదలుపెట్టారు - రాజధాని కోసం 50వేల ఎకరాలు భూమి రైతులు ఇచ్చారు - అమరావతిలో రూ.10 వేల కోట్లు ఖర్చు పెట్టాం.. రైతులు భూమిస్తే రాజధానిని చంపేశారు - ఎన్నికల ముందు అమరావతే అని చెప్పి మాట తప్పారు - భూమి ఇచ్చిన పాపానికి రైతులు రోజూ అవమానాలు భరిస్తున్నారు - గత ప్రభుత్వాలు ఇలాగే విధ్వంసం చేస్తే హైదరాబాద్ ఉండేదా? - కోట్ల ఆస్తిని విధ్వంసం చేస్తున్నప్పుడు ప్రజా చైతన్యం ఎంతో అవసరం - అమరావతి, పోలవరం అభివృద్ధి చెందితేనే రాష్ట్రానికి భవిష్యత్తు - పోలవరం డీపీఆర్‍ను ఎందుకు ఖరారు చేయలేకపోయారు - 2021 డిసెంబర్‍కు పోలవరం పూర్తి అన్నారు.. కాలేదే? - పోలవరం పూర్తిచేయడం మీకు సాధ్యమా - పోలవరంపై శ్వేతపత్రం విడుదల చేయగలరా? - రెండున్నరేళ్లలో రైతులు తీవ్రంగా నష్టపోయారు - ఆర్థికంగా కోలుకోలేక ఆత్మహత్యలకు పాల్పడ్డారు - రైతుల ఆ-త్మ-హ-త్య-ల్లో ఏపీ 3వ స్థానంలో ఉంది - దేశానికి అన్నంపెట్టిన ఏపీలోనే వరి వేయొద్దని చెబుతున్నారు"

cbn 04012022 2

"ప్రజాధనం దుర్వినియోగం చేస్తూ విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టించారు - జ్ఞానాన్ని కూడా బలిపశువును చేసి రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించారు - టీచర్లు కావాలని పిల్లలు ఆందోళన చేసే పరిస్థితులు కల్పించారు - జాబ్ లెస్ క్యాలెండర్‍తో యువతను ఉద్యోగులు లేకుండా చేశారు - ప్రజా సమస్యలపై ఎవరు పోరాడినా దాడులకు దిగే పరిస్థితి - నవరత్నాలు కాదు తెలుగుదేశం ఎన్నో రత్నాలు ఇచ్చింది - పన్నుల పేరుతో ప్రజలపై భారం మోపారు - ఆఖరికి చెత్తపై కూడా పన్ను వేసిన ఏకైక ప్రభుత్వం జగన్‍రెడ్డిది - సంక్షేమ కార్యక్రమాలన్నీ రద్దు చేసే పరిస్థితి - ఓటీఎస్‍ పేరుతో దోపిడీ చేస్తున్నారు - కరెంట్ ఛార్జీలను ఆరు సార్లు పెంచారు - ఇసుకపై పెద్దఎత్తున దోపిడీ జరుగుతోంది - రూ.5కే భోజనం పెట్టిన అన్న క్యాంటీన్లను ఎందుకు మూసివేశారు? - మద్యపాన నిషేధం అన్నారు.. నిన్న ఒక్కరోజే రూ.124 కోట్ల మద్యం అమ్మారు - డ్రగ్స్ పై ఉక్కుపాదం మోపమంటే మా ఆఫీస్‍పై దాడి చేయిస్తారా? - నిత్యవసరాల ధరలు పెరిగి సంక్రాంతి పండుగ చేసుకోలేని పరిస్థితి - రాష్ట్రం అప్పుల కుప్పలా మారింది - రాష్ట్రానికి రూ.7 లక్షల కోట్లు అప్పుంది - ఎవరు చెల్లించాలీ అప్పులు? - ఎంత అప్పు తెచ్చారు.. ఎంత ప్రజలకిచ్చారు? - అప్పులపై లెక్కలు చెప్పండి - రాబోయే రోజుల్లో పిల్లలు కూడా అప్పుతోనే పుడతారు - 4వ తేదీ వస్తున్నా ఉద్యోగులకు జీతాల్లేవు - అప్పులు ఇవ్వడానికి బ్యాంకులు భయపడుతున్నాయి - తనకు నల్లధనం బాగా రావాలి, ప్రజలు అప్పుల ఊబిలో కూరుకుపోవాలనే విపరీత ధోరణి జగన్‍ది - వివేకా హ-త్య, సీబీఐ, ఈడీ కేసుల నుంచి తప్పించుకునేందుకే సీఎం జగన్ ఢిల్లీ పర్యటన - కేంద్రం మెడలు వంచి తెస్తానన్న ప్రత్యేక హోదా, విశాఖ రైల్వేజోన్, స్టీల్ ప్లాంట్ వంటి హామీలు ఏమయ్యాయి? - వివేకా హ-త్య కేసులో వెన్నంటే ఉన్నట్లు చెల్లిని నమ్మించి అధికారంలోకి రాగానే ఎదురుదాడికి దిగారు - జగన్ పాలనలో ఎవ్వరికీ రక్షణ లేదు.. భవిష్యత్ లేదు" అని చంద్రబాబు అన్నారు

Advertisements

Advertisements

Latest Articles

Most Read