కార్యకర్తలు ఎప్పటికప్పుడు రాజకీయాలపై అధ్యయనం చేయగలిగినపుడే నేతలుగా ఎదుగుతారని, పార్టీకి అంకితభావంతో సేవలందించిన వారికే గౌరవం, పదవులుంటాయని టీడీపీ జాతీయ అధ్యక్షు డు చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. శుక్రవారం మంగళగిరి పరిధిలోని హ్యాపీ రిసార్ట్స్‌లో నిర్వహించిన టీడీపీ అభ్యర్థులు, కార్యకర్తలు, బూత్‌ లెవల్‌ కన్వీనర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ 37 ఏళ్లుగా పార్టీ కోసం కష్టపడుతున్న కార్యకర్తల్లో మరింత జవాబుదారీతనం పెరగాలన్నారు. కేడర్‌ మేనేజ్‌మెంట్‌, పబ్లిక్‌ మేనేజ్‌మెంట్‌లో పట్టును సాధించినపుడే రాజకీయ ఎదుగుల ఉంటుంద న్నారు. డబ్బులు సంపాదించే వాళ్లు పార్టీకి ఖర్చు పెట్టడం లేదని, డబ్బు సంపాదనలేని వాళ్లే పార్టీ కోసం ప్రాణాలను సైతం అర్పిస్తున్నారని చెప్పారు. ఆస్తులు అమ్ముకొని, ప్రాణాలకు తెగించి పసుపు జెండా గెలుపునకు కృషి చేస్తున్న కార్యకర్తలే టీడీపీ బలమని, ఈ విషయాన్ని గుర్తెరిగి అంకితభావంతో పనిచేసిన వాళ్లకే గౌరవం, పదవులు దక్కుతాయన్నారు.

cbn jagan 11052019

ప్రతి ఒక్కరికి పార్టీ సభ్యులతో కుటుంబ బాంధవ్యం ఉండాలని, అందరం కలసి వ్యవస్థగా పనిచేస్తే అద్భుత ఫలితాలను సాధించవచ్చని తెలిపారు. గత ఐదేళ్లలో వినూత్నమైన సంక్షేమ పథకాలను అమలు చేయడం ద్వారా నవ్యాంధ్ర ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరచి వారి అభిమానాన్ని చూరగొన్నామని చెప్పారు. రైతులు, మహిళలు, యువత, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలందరికీ సమ న్యాయం చేశామని, దీనితో అన్ని వర్గాలు పార్టీకి అండగా నిలిచాయన్నారు. ముఖ్యంగా మహిళలు, పింఛన్‌దారులు బారులుతీరి టీడీపీకి ఓట్లు వేశారని, బీసీ ఓటు బ్యాంకు నిలబెట్టుకుంటూనే ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ ఓట్లు పెంచుకున్నాము గనుకనే తెదేపా గెలవబోతోందన్నారు. సైకిల్‌ గెలుపుపై ఎటువంటి అనుమాల్లేవని, సీట్ల ఆధిక్యత పైనే విశ్లేషణ చేయడం జరుగుతోందని చెప్పారు. ఇది ఇలా ఉంటే, ఒక నాయకుడు మాట్లాడుతూ, జగన్ మోహన్ రెడ్డి సియం అవుతున్నాడు అంటూ ప్రచారం జరుగుతుంది అని చెప్తే, దానికి చంద్రబాబు అద్భుతమైన విశ్లేషణతో జగన్ రాడు అంటూ సమాధానం చెప్పూర్.

cbn jagan 11052019

రూ.43 వేల కోట్ల అవినీతికి పాల్పడిన వైసీపీ 40 ఏళ్ల రాజకీయ అనుభవం కలిగిన టీడీపీకి ఏవిధంగానూ పోటీదారు కాదని చంద్రబాబు అన్నారు. 26 విచారణలు చేయించినా ధీటుగా ఎదుర్కొని నిప్పులా నిలబడిన పార్టీ టీడీపీకి అరాచక శక్తులు, అవినీతి పరులకు నిలయమైన వైసీపీతో పోలికే లేదన్నారు. తాజాగా జరిగిన ఎన్నికల్లో తొలి నుంచి వైకాపా విధ్వంసక పాత్ర పోషించిం దని, ప్రతికూల వాతావరణం సృష్టించి లబ్ది పొందాలని అనేక కుట్రలకు తెగబడిందన్నారు. పోలింగ్‌నాడు ప్రజలు ఓటు వేయడానికి రానీయకుండా బెదిరింపులు, దాడులకు పాల్ప డ్డారని, జగన్‌ కుట్రలకు తోడు మోడీ, కేసీఆర్‌ కుతంత్రాలు కూడా తోడయ్యాయని తెలిపారు. కానీ ఆ సమయంలో టీడీపీ ప్రతిచర్యలకు దిగకుండా సంయమనం పాటించడం తోపాటు ఎప్పటికప్పుడు ఓటర్లలో ధైర్యం నింపడంతో అధిక శాతం పోలింగ్‌ నమోదైందని గుర్తు చేశారు. 1983 తరువాత పెద్ద ఎత్తున పోలింగ్‌ జరగడం ఇప్పుడు సాధ్యమైందన్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసమే కేంద్రంపై ధర్మపోరాటం చేసామని, దేశవ్యాప్తంగా బీజేపీ వ్యతిరేక శక్తులను కూడగట్టడంలో టీడీపీ విజయం సాధించిందని చెప్పారు. ఓటమి నైరాశ్యంతో ఉన్న మోడీ మానసిక ఒత్తిడితో దిగ జారుడు వ్యాఖ్యలు చేస్తున్నారని, 27 ఏళ్ల క్రితం మరణించిన రాజీవ్‌ గురించి విమర్శలు చేయడం ఆయన చౌకబారు రాజకీయాలకు నిదర్శనమని విమర్శించారు. దేశవ్యాప్తంగా బీజేపీ వ్యతిరేక పవనాలు వీస్తున్న నేపధ్యంలో ఇక మోడీ శకం ముగిసినట్లే అని, త్వరలో దేశానికి కొత్త ప్రధాని రాబోతున్నారని తెలిపారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read