తెలంగాణ ఎన్నికల ఫలితాల్లో టీఆర్‌ఎస్ విజయం సాధించిన తర్వాత కేసీఆర్ ప్రెస్ తో మాట్లాడుతూ, ఏపీ సీఎం చంద్రబాబుకు, విజయవాడ వెళ్లి రిటర్న్‌ గిఫ్ట్‌ ఇస్తామని కేసీఆర్‌, బెదిరిస్తూ చెప్పిన విషయం తెలిసిందే. 9 ఏళ్ళు ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా, సైబరాబాద్ సృష్టికర్తగా, చంద్రబాబు తెలంగాణా ఎన్నికల ప్రచారంలో తిరిగారు. అయితే కేసీఆర్ మాత్రం, ఏ మాత్రం సంబంధం లేని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, విజయవాడ వచ్చి, చంద్రబాబుకి గిఫ్ట్ ఇస్తాను, వేలు పెడతాను, ముక్కు పెడతాను అంటూ బెదిరిస్తున్నారు. "వంద శాతం ఏపీ రాజకీయాల్లోనూ కలుగజేసుకుంటాం. ఇప్పుడు ఇక్కడ చంద్రబాబు వచ్చి ఇక్కడ పని చేశారు. మేం పోయి అక్కడ పనిచేయొద్దా? ఇప్పుడు మనం బర్త్‌డే పార్టీ చేస్తం.. మనం తిరిగి గిఫ్ట్‌ ఇస్తమా లేదా? ఇయ్యకపోతె మనది తప్పయితది మరి. చంద్రబాబు నాకు గిఫ్టు ఇచ్చారు. నేను రిటర్న్‌ గిఫ్ట్‌ ఇవ్వాలి కదా’’ అని కేసీఆర్ వెటకారంగా స్పందించారు.

cbn gift 12122018 2

అయితే కేసీఆర్ మాటల పై చంద్రబాబు స్పందించారు. ప్రకాశం జిల్లా ఒంగోలులో జరిగిన జ్ఞానభేరిలో ఆయన మాట్లాడారు. విద్వేషాలకు టీడీపీ దూరంగా ఉంటుందని, ఆయన రిటర్న్ గిఫ్ట్ ఏంటో చూడాలని వ్యాఖ్యానించారు. ప్రజాస్వామ్యంలో ఎవరు ఎక్కడైనా రాజకీయాలు చేసుకునే హక్కు ఉందన్నారు. తెలుగువారి ఆత్మగౌరవాన్ని కాపాడేందుకు టీడీపీని స్థాపించారని చంద్రబాబు గుర్తుచేశారు. తెలంగాణలో ఎన్నికల ప్రచారానికి తాను వెళ్లానని.. అక్కడి సీఎం కేసీఆర్‌ ఆంధ్రప్రదేశ్‌కు వచ్చి తనకేదో గిఫ్ట్‌ ఇస్తానంటున్నారని అన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రజల్ని మెప్పించేందుకు ఎక్కడికైనా వెళ్లి.. రావొచ్చన్నారు. ఎన్టీఆర్‌ తెదేపాను తెలుగుజాతి కోసం పెట్టారని ఈ సందర్భంగా గుర్తు చేశారు. కొందరు అటూ ఇటూ లాలూచీ పడొచ్చేమోగానీ.. తాము మాత్రం తెలుగువారు ఎక్కడ ఉన్నా పనిచేశామన్నారు.

cbn gift 12122018 3

భవిష్యత్ అంతా ఆవిష్కరణలదే, విజన్ లేకపోతే జీవితంలో ఏమీ సాధించలేరన్నారు. నూతన ఆవిష్కరణలపై విద్యార్థులు దృష్టి పెట్టాలని.. జవాబుదారీతనంతోనే అద్భుతమైన ఫలితాలు వస్తాయన్నారు. మనదేశంలోనే కాకుండా అమెరికాలోనూ మన తెలుగువాళ్లు ప్రగతిపథంలో దూసుకెళ్తున్నారని.. రాష్ట్ర విభజన సమయంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నామని.. రాష్ట్ర వృద్ధి రేటు 4.05 శాతం నుంచి 11.72 శాతానికి చేరిందన్నారు. ప్రధాని మోదీ ఏపీ రాష్ట్రానికి తీరని అన్యాయం చేశారు.. ఏపీకి రావాల్సిన ఫలాల కోసం ఎంత సమయం వేచి చూసినా ఇవ్వలేదన్నారు. కేంద్ర ప్రభుత్వ ఒత్తిడి వల్ల ఆర్బీఐ గవర్నర్ రాజీనామా చేశారని.. చరిత్రలో చెడ్డపేరు రాకుంటే చాలనుకున్నారని.. సీబీఐ వ్యవస్థ కుప్పకూలిపోయో పరిస్థితి వచ్చిందన్నారు. దేశం, రాష్ట్రం కోసమే పోలవరానికి 3500 కోట్లు ఖర్చు పెడితే…ఇంతవరకూ కేంద్రం ఒక్క పైసా కూడా ఇవ్వలేదు. ఇన్సిట్యూట్ ఆఫ్ ఎక్సలెన్స్ కింద ఉన్న విద్యాసంస్థలకు కేవలం 600 కోట్లు మాత్రమే ఇచ్చారు. పోలవరం ప్రాజెక్టు సంబంధించి 62 శాతం పనులు పూర్తయ్యాయి. పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని మేలో పూర్తి ప్రకాశం జిల్లాలో కరవు లేకుండా చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుందన్నారు. ప్రైవేటు యూనివర్సిటీలు వస్తున్నాయి.. ప్రకాశం పంతులు పేరుతో ఈ రోజే ప్రకాశం జిల్లాలో యూనివర్సిటీ ఇచ్చాం, పనులు కూడా త్వరగా పూర్తిచేయాలన్నారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read