చంద్రబాబు మరోసారి బీజేపీ పై విరుచుకుపడ్డారు. రాజకీయ పార్టీలలో బీజేపీ చిచ్చు పెడుతోందని టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ప్రతిపక్ష నేతల కుటుంబాల్లో కూడా చిచ్చు రగిలిస్తోందన్నారు. ఈ వ్యాఖ్యల పట్ల చర్చ మొదలైంది. చంద్రబాబు తొందరిపడి ఏది మాట్లాడరు. అలాంటిది ఇప్పుడు ఇలా ఎందుకు మాట్లాడారు ? ఎవరిని ఉద్దేశించి మాట్లాడారు ? చంద్రబాబు సొంత కుటుంబంలో చిచ్చు పెట్టటానికి బీజేపీ ఏమన్నా ప్రయత్నం చేసిందా అనే చర్చ మొదలైంది. చంద్రబాబు మాట్లాడుతూ, కేసుల పేరుతో భయపెడుతున్నారని, డబ్బులతో ప్రలోభ పెట్టాలని చూస్తున్నారని ఆరోపించారు. బీజేపీ చేస్తున్న అరాచకాల వల్లే ప్రజల్లో ఆ పార్టీపై తీవ్ర వ్యతిరేకత నెలకొందన్నారు.

ccbn 06112018 2

p style="text-align: justify;">వినాశకాలే విపరీత బుద్ధిలా బీజేపీ పోకడలు ఉన్నాయని విమర్శించారు. మంగళవారం టీడీపీ సమన్వయం సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పాల్గొన్న చంద్రబాబు.. కర్ణాటక ఉప ఎన్నికల ఫలితాలను విశ్లేషించారు. రాష్ట్రంలో రాజకీయ వ్యవహారాలపై పార్టీ నేతలు దిశానిర్దేశం చేశారు. కర్ణాటక ఉప ఎన్నికల ఫలితాలు బీజేపీకి శరాఘాతం అని, ప్రజల్లో బీజేపీపై ఉన్న వ్యతిరేకతకు నిదర్శనం చంద్రబాబు పేర్కొన్నారు. ఉప ఎన్నికల్లో బీజేపీ దారుణంగా దెబ్బతిన్నదని, బీజేపీకి చెందిన ఒక అభ్యర్థి పోటీ చేయకుండా తప్పుకుంటే.. పోటీ చేసిన అభ్యర్థులు ఘోరంగా ఓడిపోయారని అన్నారు. నరేంద్ర మోదీ పాలనపై ఉన్న వ్యతిరేకతకు ఈ ఫలితాలే సాక్ష్యం అని పేర్కొన్నారు.

ccbn 06112018 3

ప్రజలకు బీజేపీ ఎంత దూరం అయ్యిందో ఈ ఎన్నికలే స్పష్టమైన సంకేతం ఇస్తున్నాయని అన్నారు. గెలుపొందిన అభ్యర్థులకు లక్షల్లో మెజారిటీలు రావడం అంటే వ్యతిరేకత ఏ స్థాయిలో ఉందో తెలుస్తోందన్నారు. గత అసెంబ్లీ ఎన్నికలకు, ఈ ఉప ఎన్నికలకు ఎంతో మార్పు ఉందన్నారు. రాజకీయం రోజు రోజుకూ మారిపోతోందని, అహంభావంతో ఉంటే ప్రజలే కళ్లు తెరిపిస్తారని మరోసారి రుజువైందన్నారు. అహంభావం, అతి విశ్వాసం పతనానికి దారితీస్తుందని చంద్రబాబు వ్యాఖ్యానించారు. సీబీఐ, ఈడీ, ఇన్ కంట్యాక్స్, ఆర్బీఐ, గవర్నర్ వంటి అన్ని సంస్థలను నాశనం చేశారు, ఢిల్లీని భ్రష్టుపట్టించారని చంద్రబాబు అన్నారు. కృష్ణా-గుంటూరు జిల్లాల్లో ధర్మపోరాట దీక్ష ముగింపు సభ చేస్తున్నామని, ఈ సభకు జాతీయ నేతలను ఆహ్వానించడానికి ప్రయత్నిస్తున్నా అని సీఎం చంద్రబాబు అన్నారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read