ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన మునిసిపల్ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి ఎదురు దెబ్బ తగిలిన సంగతి తెలిసిందే. తెలుగుదేశం పార్టీ పరాజయం పాలు అవటం పై, చంద్రబాబు స్పందించారు. తెలుగుదేశం పార్టీ నేతలు, కార్యకర్తలను ఉద్దేశించి ఒక సందేశం పోస్ట్ చేసారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ విజయం కోసం కష్టపడి పని చేసారని, కొన్ని చోట్ల ప్రాణాలకు తెగించి పోరాడి, పార్టీకి అండగా నిలిచారని కొనియాడుతూ, వారి పోరాట స్పూర్తికి వందనాలు తెలిపారు. ఇక ఫలితాల పై స్పందిస్తూ, ఈ ఫలితాల పై నిరుత్సాహ పడనవసరం లేదని, అధికారాన్ని అడ్డు పెట్టుకుని, బెదిరింపులకు, ప్రలోభాలకు పాల్పడినా, గట్టిగా పోరాడం అని అన్నారు. రాబోయే కాలంలో, ప్రజా సమస్యల పై పోరాడుతూ, రాష్ట్ర భవిష్యత్తును ముందుకు తీసుకువెళ్లటంతో కృషి చేద్దామని, ఇదే స్పూర్తితో పోరాడితే, విజయం వరుస్తుంది అంటూ, కార్యకర్తలను ఉద్దేశించి చంద్రబాబు సందేశం పోస్ట్ చేసారు. ఇక ఎన్నికల ఫలితాల పై టిడిపి అధికారికంగా కూడా ప్రెస్ మీట్ పెట్టి స్పందించింది. వర్ల రామయ్య మాట్లాడుతూ, "సీఎంగా తనఉనికిని కాపాడుకోవడం కోసం ముఖ్యమంత్రి అనేక అంశాలను మేనిప్లేట్ చేశాడు. రాష్ట్రంలో ఏం జరుగు తుందో, ప్రజలుఏ పరిస్థితుల్లో ఓట్లువేశారో వారికైవారే ఒకసా రి సింహావలోకనంచేసుకోవాలి. 90శాతం స్థానాలు గెలవకుం టే మంత్రిపదవికట్, వచ్చేఎన్నికల్లో ఎమ్మెల్యే టిక్కెట్ ఇవ్వ ను..నా వద్దనుంచి ఎటువంటి ఫేవర్ నీకురాదని ఒక ముఖ్య మంత్రి తనపార్టీ నాయకులతో అంటే, ఎన్నికలు సజావుగా జరుగుతాయా? ఆ విధంగా ముఖ్యమంత్రి చెప్పడం మేనిప్లేష న్ కాదా? నూటికినూరుశాతం పురపాలక ఎన్నికల్లో గెలవా లని చెప్పడం మేనిప్లేషన్ కిందకురాదా? ప్రజలతీర్పుని తాను తప్పపట్టడంలేదు. ముఖ్యమంత్రి వ్యవహారశైలి అర్థం చేసుకోవాలని సూచిస్తున్నాను. గతంలో పోలింగ్ శాతం 73 గా ఉంటే, ఇప్పుడు 62శాతానికి పడిపోయింది. ఆ 11శాతం పోలింగ్ ఏమైందనేదానిపై ముఖ్యమంత్రి ఆలోచనచేయరా? ముఖ్యమంత్రి మేనిప్లేషన్ విజయవంతంగా పూర్తైంది. "

"ఎన్ని కల ఫలితాలపై, మంత్రులు, కలెక్టర్లు, జిల్లాఎస్పీల పనితీరుపై ఆయన ఆలోచించరనే విషయం నాకుతెలుసు. ఏవిధమైన సరుకులేకుండా బ్రహ్మండంగా చలామణీ అవుతున్నసజ్జల రామకృష్ణారెడ్డి చంద్రబాబు, లోకేశ్ లు హైదరాబాద్ కి పారిపో యారంటున్నారు. చంద్రబాబునాయుడు చూసినన్నీ ఎన్నికలు ఆయన చూశాడా? ఆ విషయం ఆయన తనత లపై చేయిపెట్టుకొని చెప్పాలి. ఈ ఎన్నికలు, ఈ గెలుపు శాశ్వ తమా? గతంలో నంద్యాల ఉపఎన్నికల్లో టీడీపీ భారీగా విజ యంసాధించింది. కాకినాడ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిని నిలపడానికే భయపడింది. 2014లో టీడీపీఅధికారంలోకి రాకముందు అన్నిఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి పార్టీనే గెలిచింది కదా? ఈ విషయాలన్నీ జగన్మోహన్ రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి అర్థంచేసుకోవాలి. వ్యవస్థలు, పోలీస్ శాఖ, ఎన్నికలఅధికారులు, ప్రభుత్వంఎంతలా ఇబ్బందిపెట్టినా మొ క్కవోని ధైర్యంతో పోరాడి, టీడీపీ గెలుపేలక్ష్యంగా పనిచేసిన తెలుగుదేశంశ్రేణులకు పార్టీతరుపున నమోవాకాలు (సెల్యూట్) చేస్తోంది. పురఫలితాలపై ప్రజలకు కృతజ్ఞతలు తెలియచేస్తూ, పట్టుదల తో పోరాడిన టీడీపీ కేడర్ కు అభివాదం చేస్తున్నాను. ముఖ్యంగా మైదుకూరు, తాడపత్రి టీడీపీశ్రేణులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియచేస్తున్నాను." అని అన్నారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read