పోతిరెడ్డిపాడులో లేని సమస్యను సృష్టించి, అటు కేసీఆర్, ఇటు జగన్ చేస్తున్న రచ్చ పై, చంద్రబాబు స్పందిచటం లేదు అన్న విమర్శలకు చంద్రబాబు స్పందించారు. ఆయన మాట్లాడుతూ, "పోతిరెడ్డిపాడు తెచ్చింది ఎన్టీఆర్. మచ్చుమర్రి మేమే చేశాం. హంద్రీ నీవా, గాలేరు నగరి, తెలుగు గంగ అన్నీ ఎన్టీఆర్ ప్రారంభిస్తే మేమే పూర్తి చేశాం. పోలవరం జీవనాడి అయితే ముచ్చుమర్రి ప్రాణనాడి అని ఆ రోజే చెప్పాం. గుడ్డొచ్చి పిల్లను వెక్కరించినట్లు మాట్లాడుతున్నారు. కర్నూలు దీక్షలో ఏం మాట్లాడారు..? ఇండియా పాకిస్తాన్ గా రెండు రాష్ట్రాలు మారతాయని అనలేదా..? మళ్లీ అదే కాళేశ్వరానికి ఎందుకు పోయారు..? మీరిద్దరూ కలిసి పని చేయడం లేదా..? కెసిఆర్ చాలా దయార్ద్ర హృదయుడు, వాళ్ల భూభాగం గుండా నీళ్లు తీసుకెళ్లడానికి ఒప్పుకున్నాడని మీరు చెప్పలేదా..? ఇవన్నీ మీరు చేస్తూ, ఇప్పుడు టిడిపిపై నెపం వేయడం ఏమిటి..? తెలుగుగంగ ఎన్టీఆర్ ప్రారంభించారు. భూగర్భంలో నీళ్లు పంపాలని అనుకుంటే ఓపెన్ కెనాల్స్ ద్వారా పంపాలని పట్టుబట్టి సాధించారు. ఇందిరాగాంధీ, ముగ్గురు ముఖ్యమంత్రులు హాజరు అయ్యారు. "

"రాయలసీమకు నీళ్లిచ్చిందెవరు..? పట్టిసీమ పూర్తి చేసిందెవరు..? నదుల అనుసందానం చేపట్టింది ఎవరు..? పట్టిసీమ ద్వారా నదులు అనుసందానం చేసి గోదావరి నీటిని కృష్ణా ఆయకట్టుకు నీళ్లు ఇచ్చి, శ్రీశైలం నుంచి రాయలసీమకు టిడిపి ప్రభుత్వం నీళ్లిచ్చింది. గండికోటలో పరిహారం చెల్లించి 12టిఎంసిలు నిలబెట్టాం, అందులో 25టిఎంసిలు నిలబెట్టవచ్చు ఎందుకు నిలబెట్టలేక పోయారు..? ఇప్పుడు చిత్తూరు, అనంతపురానికి ఎందుకు నీళ్లివ్వలేక పోయారు..? మీ తండ్రి హయాంలో కట్టిన ప్రాజెక్టుల్లో సీపేజి వస్తే వాటికి అడ్డుకట్ట వేశాం. గోదావరి నీళ్లు నాగార్జున సాగర్ కు తెచ్చి బొల్లాపల్లి పూర్తి చేసి, నేరుగా బనకచర్లకు తీసుకెళ్లి నల్లమల అడవిలో టన్నెల్ ద్వారా రాయలసీమకు తీసుకెళ్లి రాష్ట్రం సస్యశ్యామలం చేసేందుకు సిద్దం చేస్తే, 66ప్రాజెక్టులు చేపడితే అవన్నీ ఎందుకని రద్దు చేశారు..?"

"ఈ ఏడాదిలో ఒక్క రూపాయి ప్రాజెక్టులపై ఖర్చు చేయలేక పోయారే..? మీ నాయన ఇచ్చిన టెండర్లు నేను రద్దు చేయలేదే. కోర్టులకు వెళ్తే ప్రాజెక్టులు ఆగిపోతాయని ముందుచూపుతో ఆలోచించి వాళ్లతోనే పనులు చేయించి ప్రాజెక్టులు పూర్తి చేయించాను. హక్కులు కాపాడుకోడానికి మనం సిద్దంగా ఉండాలి. అంతే తప్పమిగులు జలాలపై హక్కు వదులుకుంటూ వీళ్ల తండ్రి రాసిన లేఖ వల్లే ఏపికి కష్టాలు. ఈ రోజు జడ్జిమెంట్ కూడా మనకు వ్యతిరేకం వచ్చింది. ఆరోజు ఎన్టీఆర్ ప్రాజెక్టులు చేపడితే అస్యూర్డ్ వాటర్ ఏదని వీళ్ల తండ్రి అడ్డంపడి అడిగారు, వాటర్ ఈజ్ అస్యూర్డ్ అని ఎన్టీఆర్ జవాబిచ్చారు. ఈయనకు(జగన్మోహన్ రెడ్డి) ఏం తెలుసు ఇవన్నీ, ఈయనకు ఏం అవగాహన ఉంది వీటన్నింటిపై. ఇప్పుడేదో రాయలసీమ ఉద్దరిస్తానని ఫోజులు కొడుతున్నారు. వీళ్ల ఊరికి(పులివెందుల) నీళ్లు నేనే ఇచ్చాను. చీనీ చెట్లు ఎండిపోతుంటే నేను ఇచ్చిన నీళ్లే కాపాడాయి. రాయలసీమకు నీళ్లు ఇవ్వకుండా నేనుండే ఇంటిని ముంచాలనే దురుద్దేశంతో నీళ్లన్నీ సముద్రం పాలు చేశారు. ఇప్పుడు రాయలసీమ నీళ్ల కోసం అల్లాడుతున్నాయి. పద్దతి ప్రకారం చేస్తే సహకరించడానికి సిద్దంగా ఉన్నాం. హక్కుల కోసం పోరాడిన పార్టీ టిడిపి. మీలా దుర్మార్గ రాజకీయం చేసే పార్టీ కాదు."

Advertisements

Advertisements

Latest Articles

Most Read