ఈ రాష్ట్రంలో ఏమి జరిగినా, దానికి కారణం చంద్రబాబు అని చెప్పటం వైసిపీ పార్టీకి బాగా అలవాటు. రైతులు ఆందోళన చేసినా, సిపీఎస్ రద్దు ఎప్పుడూ అంటూ ఉద్యోగులు రోడ్డు ఎక్కినా, సినిమా టికెట్ల అంశం అయినా, సిబిఐ అయినా, ఏదైనా సరే, చంద్రబాబు చంద్రబాబు చంద్రబాబు. ఈ చంద్రబాబు పిచ్చ ఎక్కవ అయ్యి, చివరకు వైఎస్ ఇంట్లో జరిగిన దానికి కూడా చంద్రబాబు కారణం అనే స్థాయికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చేసింది. వివేకా కేసులో, అవినాష్ రెడ్డి, జగన్ పై అనుమానం వ్యక్తం చేస్తూ, సునీత సిబిఐకి స్టేట్మెంట్ ఇచ్చిన సంగతి తెలిసిందే. దాన పైన స్పందించిన సజ్జల, సునీతకు ఎలా కౌంటర్ ఇవ్వాలో తెలియక, సింపుల్ గా చంద్రబాబుతో కలిసి సునీత ఇవ్వన్నీ చేస్తున్నారని, సునీత చంద్రబాబు పావు అని చెప్పేసారు. తమ ఇంట్లో జరిగిన దానికి కూడా చంద్రబాబు కారణం అని చెప్పారు అంటే, వైసీపీ పరిస్థితి ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు. అయితే సజ్జల వ్యాఖ్యల పైన చంద్రబాబు స్పందించారు. సునీత నా పావు అంట, రేపు భారతి కూడా నా పావు అంటారేమో, వీళ్ళకు ఈ ప్రపంచంలో ఏమి జరిగినా నేనే లాగా ఉంది, చివరకు వీళ్ళ ఇంట్లో భార్యా భర్తలు కాపురం చేసుకోక పోయినా, నేనే అనేలా ఉన్నారు వీళ్ళు. సునీతను నేనే వదిలాను అంట, ఏమి చెప్పాలి తమ్ముళ్ళు అని చంద్రబాబు ప్రశ్నించారు.
వైఎస్ అవినాష్ రెడ్డి నా వాడే అంటారేమో. అవినాష్ రెడ్డితో నేనే వేసేసా అంటారేమో, రక్తం నేనే తుడిచా, కుట్లు నేనే వేసా, గుండెపోటు అని నేనే చెప్పించా, సాక్షిలో నేనే నా గురించి వేయించుకున్నా అని చెప్తారేమో అని చంద్రబాబు వ్యంగ్యంగా స్పందించారు. అవినాష్ రెడ్డి, దేవిరెడ్డి శంకర్ రెడ్డి నా మనుషులా ? వాళ్ళు రెండు కళ్ళు అని వాళ్ళ నాయకుడే చెప్పాడు. సొంత ఇంట్లో వేసేసుకుని, అది నా పైకి తోసి రాజకీయంగా లాభ పడ్డారని చంద్రబాబు అన్నారు. అబద్ధాలతో ప్రజలను మోసం చేయవచ్చు అని అనుకుంటున్నారని చంద్రబాబు అన్నారు.అవినాష్ బీజేపీలోకి వెళ్తాడు, నాకు ఇంకో సిబిఐ కేసు అవుతుంది అని జగన్ అన్నాడు అంటే, వ్యవస్థలు అంటే అతనికి లెక్క లేదా అని చంద్రబాబు ప్రశ్నించారు. రాష్ట్రంలో ఏ సమస్య వచ్చినా నేనే అయితే, ఎన్నికల్లో నేనే ఎందుకు ఓడిపోతా ? నేనే గెలిచే వాడిని కదా అని చంద్రబాబు అన్నారు. ఇలాంటి వారు రాజకీయాలకు అవసరం లేదని, జగన్ ఒక్క చాన్స్, ఇక చివరి చాన్స్ అని చంద్రబాబు అన్నారు.