ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడి హోదాలో, తెలంగాణా రాజకీయాల పై హైదరాబాద్ లో మాట్లాడారు. ఈ సందర్భంగా, ఆయన ఆపరేషన్ గరుడ పై స్పందించారు. "తప్పుడు సంకేతాలు ఇవ్వద్దు... తప్పుడు పనులు చెయ్యద్దు... పిచ్చ పిచ్చ వేషాలు వెయ్యద్దు.. అధికారం శాశ్వతం కాదు... అనవసరంగా లేని పోనివి చేసి, తప్పుడు సంప్రదాయాలు తెచ్చి లేనిపోని సమస్యలు తెచ్చుకొవద్దు " అంటూ ఈ రోజు శివాజీ చెప్పిన విషయం ప్రస్తావిస్తూ, ఢిల్లీ ఆహంకారులని చంద్రబాబు హెచ్చరించారు. "ఈడీ, సీబీఐ, ఇన్ కంటాక్స్ లాంటి సంస్థలను వాడుకొని రాజకీయ ప్రత్యర్థులను ఇబ్బంది పెడుతున్నారు. కర్ణాటకలో చేసారు తమిళనాడు లో చేసారు, రేపు తెలంగాణలో చేస్తారు, ఆంధ్ర లోను చేస్తారు. అధికారం శాశ్వతంకాదు ఎన్డీయే ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నా" అంటూ చంద్రబాబు అన్నారు.
అంటే చంద్రబాబు మాటలు వింటుంటే, ఎదో జరగబోతుంది అనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది. చంద్రబాబుని ఇబ్బంది పెట్టటానికి, కేంద్రం ఎదో ప్లాన్ చేసింది, త్వరలోనే అది జరగబోతుంది అనే సమాచారం చంద్రబాబు దగ్గర కూడా ఉన్నట్టు, ఆయాన మాటలు వింటుంటే అర్ధమవుతుంది. "తప్పుడు సంకేతాలు ఇవ్వద్దు... తప్పుడు పనులు చెయ్యద్దు... పిచ్చ పిచ్చ వేషాలు వెయ్యద్దు.. అధికారం శాశ్వతం కాదు... అనవసరంగా లేని పోనివి చేసి, తప్పుడు సంప్రదాయాలు తెచ్చి లేనిపోని సమస్యలు తెచ్చుకొవద్దు " అంటూ ఆయన తీవ్రంగా హెచ్చరించటం చూస్తుంటే, సోమవారం నోటీసులు వస్తాయి అని శివాజీ చెప్పిన మాట నిజమేనేమో అనిపిస్తుంది.
ఆపరేషన్ గరుడ మరో రూపం దాల్చుకుని ఆంధ్రప్రదేశ్‌పై దాడికి సిద్ధమైందని హీరో శివాజీ అన్నారు. శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ‘ఒక ముఖ్యమంత్రిని టార్గెట్ చేసుకుని రాష్ట్రాన్ని ఇబ్బందులు పెట్టడం భావితరాలను ఇబ్బంది పెట్టడమే. నిన్న అర్ధరాత్రి నాకు ఒక ఫోన్ కాల్ వచ్చింది. జాతీయస్థాయిలోని రాజ్యాంగబద్ధ సంస్థ నుంచి సోమవారం చంద్రబాబుకు నోటీసులు వస్తాయి. ఇది అత్యంత విశ్వసనీయ వర్గాల నుంచి వచ్చిన సమాచారం. ఈ స్థానంలో జగన్ ఉన్నా, నా ఆందోళన ఇలాగే వ్యక్తం చేస్తా. చంద్రబాబును తొలగించడానికి సమయం చూసి జాతీయ పార్టీ పంజా విప్పింది. ప్రజలను పక్కన పెట్టి, మీరు స్వార్థ రాజకీయ క్రీడను ఆడుతున్నారు. రాజకీయంగా అడ్డు తొలగించుకునే కుట్ర ఇది. హోదా లేకుండా ఏ ప్రభుత్వమూ ఏమీ చేయలేదు. ఇచ్చిన మాట తప్పి భారతీయ జనతా పార్టీని రాష్ట్రంలో చంపేశారు. త్వరలో రాష్ట్రంలో పర్యటించి ఏం సాధిస్తారు?’’ అని శివాజీ ప్రశ్నించారు.