నోటికి అడ్డు అదుపు లేకుండా మాట్లాడుతున్న సోము వీర్రాజు పై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు స్పందించారు... సోము వీర్రాజు వ్యాఖ్యలు అతని విజ్ఞతకే వదిలెయ్యాలి అని, సోము వీర్రాజు వ్యాఖ్యల పై ప్రతిస్పందించొద్దంటూ, టీడీపీ శ్రేణులకు చంద్రబాబు ఆదేశించారు... వారికి విజ్ఞత లేదు అని, మీరు కూడా అలా విజ్ఞత మరిచి మాట్లాడవద్దు అని అన్నారు... వ్యక్తిగత వ్యాఖ్యల విషయంలో సంయమనం పాటించాలని సీఎం చంద్రబాబు సూచించారు. విమర్శల విషయంలో బీజేపీకి, టీడీపీకి తేడా ఉండాలన్నారు. సోము వీర్రాజు దిష్టిబొమ్మలు దహనం లాంటి కార్యక్రమాలు చేపట్టవద్దని శ్రేణులకు టీడీపీ అధిష్ఠానం ఆదేశించింది....
మరో పక్క, చంద్రబాబు స్పందనకు ముందే, తెలుగుదేశం పార్టీ నేతలు, సోము వీర్రాజు పై ఫైర్ అయ్యారు... సోము వీర్రాజుపై తెలుగుదేశం పార్టీకి చెందిన ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న విరుచుకుపడ్డారు.. సోము వీర్రాజు కనీసం వార్డుమెంబర్‌గా కూడా గెలవలేదని, అయినా.. టీడీపీ అతన్ని ఎమ్మెల్సీని చేసిందని బుద్దా గుర్తు చేశారు. టీడీపీ అవినీతి పార్టీ అని విమర్శిస్తున్న వీర్రాజు... అవినీతి పార్టీ ఇచ్చిన ఎమ్మెల్సీ పదవి ఎందుకు తీసుకున్నారని ప్రశ్నించారు.
వీర్రాజు వైసీపీకి అమ్ముడు పోయాడన్నారు. పార్టీ పేరుతో ఎంత వసూలు చేశారో మీ నేతలే చెబుతున్నారని, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిపై విమర్శలు చేస్తే ఊరుకునేది లేదని బుద్దా వెంకన్న తీవ్రంగా హెచ్చరించారు. అలాగే సోము వీర్రాజు వ్యాఖ్యల పై బీజేపీ పెద్దలు స్పష్టత ఇవ్వాలన్నారు. జగన్‌ను సోము వీర్రాజు ఎందుకు విమర్శించడం లేదని, సోము వీర్రాజుది బీజేపీ అజెండానా? వైసీపీ అజెండానా? అని ఆయన అన్నారు.