ఏపి అంటే ఆంధ్రప్రదేశ్ మాత్రమే కాదు, ఏ అంటే అమరావతి, పి అంటే పోలవరం కూడా.. అలాంటి ఈ రెండు ప్రాజెక్ట్ లు పూర్తి చెయ్యటానికి ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్రంగా శ్రమిస్తుంటే, మిగిలిన వారు ఇబ్బంది పెడుతున్నారు..... పోలవరం విషయంలో, కేంద్రం ఇబ్బంది పెట్టిన సంగతి చూశాం... అమరావతి విషయంలో, కొంత మంది అదృశ్య శక్తులు ఆపటానికి చూస్తున్నారు... అమరావతిని అడ్డుకోవటమే ధ్యేయంగా రాష్ట్రంలో ఉన్న కొంత మంది, రాజధాని నిర్మాణం కోసం లోన్ ఇస్తున్న ప్రపంచ బ్యాంకుకి, లోన్ ఇవ్వద్దు అంటూ, లేఖలు రాసిన సంగతి తెలిసిందే. ప్రపంచ బ్యాంకు అధికారులకు, వరుస పెట్టి ఫిర్యాదులు వెళ్తున్నాయి. ఎవరు చెప్తున్నారో, ఏమి చేస్తున్నారో తెలియదు. మొత్తానికి ప్రపంచ బ్యాంకు నిబంధనలు వీరికి ఇలా ఉపయోగపడుతుంటే, రాష్ట్రానికి శాపంగా మారాయి. ఈ ఫిర్యాదుల ఫై, ఆరుసార్లు ప్రపంచ బ్యాంకు బృందానికి చెందిన పదిహేను మంది అధికారులు అమరావతి వచ్చి రిపోర్ట్ రెడీ సెహ్సారు.
రెండు నెలల క్రితం కూడా ఈ ఫిర్యాదుల పై, ప్రపంచ బ్యాంకు బృందం అమరావతి వచ్చింది. ఫిర్యాదు చేసిన వారిని పిలిపించి మాట్లాడి వారికున్న అభ్యంతరాలను రాతపూర్వకంగా సేకరించింది. అయితే ఊరు, పేరు లేనివారు కొంతమంది ఫిర్యాదు చేయడం, మరికొంతమంది తప్పుడు పేర్లతో ఫిర్యాదులు చేయడంతో వారి కోసం ప్రపంచ బ్యాంకు అధికారులు ప్రయత్నించినప్పటికీ అందుబాటులోకి రాలేదు. ఇదే విషయం, మొన్న చంద్రబాబు సింగపూర్ వెళ్లినప్పుడు ప్రపంచబ్యాంక్ ఉపాధ్యక్షుడి, సియంతో చెప్పారు. రుణం మంజూరు సమయంలో ప్రపంచ బ్యాంకుకు కొన్ని నిర్దేశిత ప్రమాణాలు ఉంటాయని, వచ్చిన ప్రతి ఫిర్యాదును పరిశీలిస్తామని చెప్పారు. ఆ విధంగా రాజధాని భూములపై వచ్చిన పిర్యాదులను పరిశీలిస్తే.. అవన్నీ పూర్తిగా అవాస్తవం అని తేలిందని వివరించారు. రుణం మంజూరు సమయంలో ప్రపంచ బ్యాంకు ఇన్స్ ఫెక్షన్ ప్యానల్ ఫిర్యాదులన్నింటినీ కూడా ఇప్పటికే క్లియర్ చేసిందని, అప్రైజల్ రిపోర్టు కూడా సిద్దంగా ఉందని, ఆయన చంద్రబాబుకు వివరించారు.
అప్రైజల్ రిపోర్టును ఒక్కసారి ప్రపంచ బ్యాంకు పరిగణలోకి తీసుకుని సెప్టెంబర్ కల్లా 4వేల 576కోట్లు (715మిలియన్ల యూ.యస్. డాలర్లు) మంజూరు చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. ప్రపంచ బ్యాంకు ఉపాధ్యక్షుడు చెప్పిన ఈ విషయాలను చంద్రబాబు ఉన్నతాధికారులకు వివరించడంతో వారంతా ఆశ్చర్యపోయారు. ప్రపంచ బ్యాంకు రుణం మంజూరు చేస్తుందని తెలుసుకున్న కొంతమంది ఈ ఫిర్యాదులను ఉద్దేశపూర్వకంగా ఎక్కువుగా పంపుతున్నారని, గత నెల రోజుల్లోనే ఎక్కువ ఫిర్యాదులు వెళ్లాయని కూడా సీఎం వివరించారు. అయితే ప్రపంచ బ్యాంకు వాస్తవంగా ఉన్న ఫిర్యాదులను మాత్రమే పరిగణలోకి తీసుకుని ఎటువంటి ఆధారాలు, ప్రామాణికత లేకుండా చేస్తున్న ఫిర్యాదులను పక్కన పెట్టేయడం ప్రారంభించిందని, సెప్టెంబర్ నాటికి రుణం మంజూరు అవుతుందని సీఎం ఆశాభావం వ్యక్తం చేశారు.