ప్రతిపక్ష వైసీపీ ఎన్ని కుయుక్తులు, కుట్రలు పన్నినా ప్రజలు మాత్రం తెలుగుదేశం పార్టీవైపే ఉన్నారని అనంతపురం అర్బన్ నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి వై కుంఠం ప్రభాకర్ చౌదరి, అనంతపురం ఎంపీ అభ్య ర్థి జేసీ పవన్‌కుమార్‌రెడ్డి పేర్కొన్నారు. ఇద్దరూ కలిసి ప్రచారం నిర్వహించిన సందర్భంగా గురువారం వారు విలేకరులతో కూడా కలిసి మాట్లాడా రు. జేసీ పవన్‌కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. రా ష్ట్రంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా సీఎం చంద్రబాబు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేసి చూ పించారన్నారు. అందుకే ఏ ప్రాంతానికి వెళ్లినా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారన్నారు. వైఎస్ జగన్ అధికారంలోకి వస్తే అభివృద్ధి కుంటుపడుతుందని ప్రజలకు తెలిసిపోయిందన్నారు.
నగరంలో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులు ప్రభాకర్ చౌదరి, జేసీ పవన్‌కుమార్ రెడ్డి కలిసి గురువారం ప్రచారం నిర్వహించారు. దీంతో తెలుగు తమ్ముళ్లలో ఆనందోత్సాహాలు వ్యక్తమయ్యాయి. ఎంపీ దివాకర్‌రెడ్డికి, ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరికి మధ్య కొంతకాలంగా ప్రచ్ఛన్న యుద్ధం జరుగుతున్న విషయం తెలిసిందే. ఎన్నికల షెడ్యూల్ వచ్చినా ఇరువర్గాల మధ్య సఖ్యత కనిపించలేదు. జేసీ వ్యతిరేకించినా అనంతపురం అర్బన్ టీడీపీ అభ్యర్థిగా మరోసారి ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరికే ముఖ్యమంత్రి చంద్రబాబు టికెట్ ఇచ్చారు. ఈ క్రమంలో టీడీపీ ఎంపీ అభ్యర్థి, జేసీ దివాకర్‌రెడ్డి తనయుడు జేసీ పవన్‌కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే అభ్యర్థి వైకుంఠం ప్రభాకర్ చౌదరి నగరంలో ఎవరికి వారు ప్రచారం కొనసాగిస్తూ వచ్చారు. తెలుగు తమ్ముళ్లలో ఇది ఒకింత ఆందోళన, ఆవేదన కలిగిస్తూ వచ్చింది.
అయితే ఊహించని విధంగా జేసీ పవన్‌కుమార్ రెడ్డి, ప్రభాకర్ చౌదరి కలిసి గురువారం ప్రచారం నిర్వహించడం కార్యకర్తల్లో ఉత్సాహం నింపింది. నగరంలోని పాతూరులో గురువారం వీరిద్దరూ కలిసి ఒకేచోట ప్రచారం నిర్వహించారు. ఇటీవల జిల్లా కేంద్రానికి వచ్చిన సీఎం చంద్రబాబునాయుడు ఇద్దరూ కలిసి ముందుకు సాగి మంచి మెజార్టీతో గెలుపొందాలని సూచించారు. ఈ క్రమంలో ఇద్దరు అభ్యర్థులు కలిసి ప్రచారం చేయడం తెలుగు తమ్ముళ్లలో ఆనందోత్సాహాలు నింపాయి. పాతూరులోని మాల్దారి వీధి, అంబారువీధి, ఆసార్ వీధి ప్రాంతాల్లో వారు కలిసి ఇంటింటా ప్రచారం చేపట్టి సైకిల్ గుర్తుకు ఓట్లేసి తమను గెలిపించాలని ఓటర్లకు వారిరువురూ విజ్ఞప్తి చేశారు.