రాష్ట్రానికి అన్యాయం చేస్తున్నారని, ప్రధాని మోడీ మీదే యుద్ధం ప్రకటించారు చంద్రబాబు... దీని వల్ల తనను వ్యక్తిగతంగా ఇబ్బంది పెడతారని తెలిసినా, రాష్ట్రం కోసం తప్పలేదు... ఇలాంటి చంద్రబాబు ముందు, తోక జాడిస్తూ, పార్టీకి, చంద్రబాబుకి చెడ్డ పేరు తీసుకువస్తున్న కొంత మంది సొంత పార్టీ నేతల పై, ఇంకే రేంజ్ లో విరుచుకుపడతారు ? అదే జరిగింది, మాటి మాటికి చిరాకు పెడుతూ, రచ్చకి ఎక్కి, పరువు పొగుడుతున్న వారిని, గత రెండు రోజులు నుంచి, అమరావతి పిలుపించుకుని, లెఫ్ట్ అండ్ రైట్ వాయించి పంపించారు... నేను గతంలో మాదిరిగా, నచ్చజెప్పే ధోరణిలో ఉండను, ప్రజల్లో పలుచన అయ్యే చర్యలు సహించను, మీకు ఇష్టమైతే క్రమశిక్షణగా ఉండండి, లేకపోతే వెళ్ళిపోండి అంటూ, సీనియర్ నాయకులని కూడా చూడకుండా, వాయించారు...

ముందుగా గురువారం రాత్రి దెందులూరు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్‌ చింతమనేని ప్రభాకర్‌ను వాయించారు... బస్సు మీద బొమ్మ చిరిగితే, ఇంత రచ్చ చెయ్యటం ఏంటి, ప్రతి సారి మీరు ఇలా చేస్తే ఎలా ? బాధ్యతాయుతమైన పదవిలో ఉండి రోడ్డుమీద ఈ తగాదాలు, గొడవలేంటి? నా చాకిరీ అంతా మీ చర్యలతో కొట్టుకుపోతోంది. నీ విషయంలో ఇప్పటికి రెండు మూడుసార్లు ఓపిక పట్టాను. అయినా మార్పు లేదు. ఇంకోసారి ఇలాంటి గొడవల్లో తలదూర్చితే ఎంత కఠిన నిర్ణయానికైనా వెనుకాడను. ఒక నియోజకవర్గం పోయునా ఫర్వాలేదు. పార్టీ ప్రతిష్ఠ నాకు ముఖ్యం అంటూ చింతమనేని పై ఫైర్ అయ్యారు... ఇక, ఆళ్లగడ్డ తగాదా, నెలకు ఒకసారి చంద్రబాబు ముందుకు వస్తుంది... నిన్న అటు సుబ్బారెడ్డిని, అఖిల ప్రియను పిలిపించారు.. ఎన్ని సార్లు మీకు రాజీ కుదర్చను, దేనికైనా ఒక హద్దు ఉంటుంది, ఇష్టం లేకపోతే వెళ్లిపోవచ్చు అంటూ ఖటువుగా హెచ్చరించారు..

సుబ్బారెడ్డిని ఉద్దేశిస్తూ, ఆళ్లగడ్డలో వేలు పెట్టవద్దు, మీకు ఎదో ఒక అవకాసం ఇస్తాను, పని చెయ్యండి అంటే, మీరు ఆగారు.. కానీ నీ తొందరపాటుతో పాడు చేసుకుంటున్నావు, మీ వల్ల పార్టీకి చెడ్డ పేరు.. వింటే బాగుపడతారు. లేకపోతే మీ కర్మ అంటూ వాయించారు... ఇక అఖిలప్రియ పై ఎప్పుడూ లేని విధంగా, ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలుస్తుంది. ‘మీ అమ్మకు, నాన్నకు రాని అవకాశం నీకు వచ్చింది. దానిని సద్వినియోగం చేసుకోవాలి. మీరు చిన్న పిల్లలు. రాజకీయంగా ఇంకా అనుభవం రాలేదు. సుబ్బారెడ్డికి, మీకు సమస్యలేవైనా ఉంటే ఎవరైనా మధ్యవర్తిని పెట్టి పరిష్కరించుకోండి. అంతేతప్ప పార్టీ వేదికగా వాటిపై పోరాటం చేయవద్దు’ అని ఆయన సూటిగా చెప్పేశారు. పశ్చిమగోదావరి జిల్లా చింతలపూడిలో, ఎమ్మెల్యే పీతల సుజాత, ఎంపీ మాగంటి బాబు చేస్తున్న రచ్చ పై కూడా, ఇద్దరినీ పిలిచి హెచ్చరించారు... మీరు మారకపోతే మిమ్మల్నే మార్చాల్సి వస్తుంది. నేను చెప్పింది నచ్చకపోతే బయటకు వెళ్లిపొండి. నాకేమీ అభ్యంతరం లేదు అని తెగేసి చెప్పారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read