దేశంలో ఎక్కడా కూడా ప్రైవేట్‌ సంస్థ చేసిన మోసానికి.. ప్రభుత్వం పరిహారం చెల్లించిన దాఖలాలు లేవు.. సమస్య తీవ్రతను దృష్టిలో పెట్టుకుని, వారి కుటుంబాలకి ఆసరాగా ఉండటానికి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముందుకొచ్చింది... అగ్రిగోల్డ్ వల్ల మోసపోయి దిక్కుతోచని స్థితిలో ఆత్మహత్యలకు పాల్పడిన 130 మందికి రూ.5 లక్షల చెక్కులను సచివాలయంలో ముఖ్యమంత్రి నేడు పంపిణీ చేశారు... రాష్ట్రంలో మొత్తం 19 లక్షల అగ్రిగోల్డ్ బాధిత కుటుంబాలు ఉన్నాయని, వారందరికీ న్యాయం చేస్తామని స్పష్టం చేశారు.. ప్రైవేటు పెట్టుబడులు పెట్టి మోసపోవద్దని, ఎక్కువ వడ్డీలిస్తామని, రెండేళ్లల్లో రెట్టింపు చేస్తామనే ప్రచారాలకు మోసపోవద్దని, ప్రభుత్వ బ్యాంకులలో డిపాజిట్ చేసుకోండి అంటూ చంద్రబాబు పిలుపిచ్చారు..

agrigold 02032018 2

అగ్రిగోల్డ్‌ కేసు పురోగతిపై నిరంతరం సమీక్షిస్తున్నామని, ఐదు రాష్ట్రాల సమస్య.. కోర్టు పరిధిలో ఉందని, జీఎస్సెల్‌ గ్రూప్‌కు అన్నివిధాలుగా సహకరిస్తామన్నారు. 19 లక్షల కుటుంబాలకు న్యాయం చేస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. గత సంవత్సరం మార్చిలో జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో సీఎం చంద్రబాబు మాట్లాడుతూ ఆత్మహత్య చేసుకున్న అగ్రిగోల్డ్‌ బాధితులకు రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. కాంగ్రెస్‌ హయాంలో అవినీతిపరులు రెచ్చిపోయారని తీవ్రస్థాయిలో విమర్శించారు. ఏపీలో 19 లక్షల మంది అగ్రిగోల్డ్‌ బాధితులు ఉన్నారని అన్నారు.

agrigold 02032018 3

అయితే చంద్రబాబు తీసుకున్న నిర్ణయం పై, అగ్రిగోల్డ్ బాధితుల సంఘం స్పందించింది... ముఖ్యమంత్రి చంద్రబాబు 130 మంది అగ్రిగోల్డ్ బాధిత కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున పరిహారం చెల్లించడం చాలా సంతోషమని అగ్రిగోల్డ్ బాధితుల సంఘం నాయకుడు ముప్పాళ్ల నాగేశ్వరరావు హర్షం వ్యక్తం చేశారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ దేశంలో ఎక్కడా కూడా ప్రైవేట్‌ సంస్థ చేసిన మోసానికి.. ప్రభుత్వం పరిహారం చెల్లించిన దాఖలాలు లేవని అన్నారు. ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయం వల్ల 130 కుటుంబాలు నిలదొక్కుకున్నాయని ఆయన అన్నారు. తమ న్యాయమైన పోరాటాల కారణంగా సీఎం పరిహారం ఇచ్చారని, అలాగే బాధితులకు ప్రభుత్వం ఇచ్చిన అన్ని వాగ్దానాలు నెరవేర్చాలని ఆయన అన్నారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read