రాజధాని అభివృద్ధి పనులను శనివారం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పరిశీలించారు. నడి ఎండలోనూ ఆయన పర్యటన సాగింది. ముందుగా ఉండవల్లి రెస్ట్‌హౌస్‌ నుంచి ఉదయం 9.39 గంటలకు వెంకటపాలెం సెంట్రల్‌ నర్సరీని సీఎం సందర్శించారు. ఏడీసీ ఆధ్వర్యంలో రాజధాని రోడ్లకిరువైపులా నాటడానికి నర్సరీలో వివిధ రకాల మొక్కలను పెంచుతున్నట్లు ఏడీసీ సీఎండీ లక్ష్మీపార్థసారధి ముఖ్యమంత్రికి వివరించారు. అనంతరం సీడ్‌ యాక్సెస్‌ రోడ్డును, బ్రిడ్డిలను పరిశీలించారు. మందడం రెవెన్యూ నిర్మిస్తున్న పేదళ ఇళ్ల సముదాయాన్ని ముఖ్యమంత్రి పరిశీలించారు. రాజధానిలో 320 కి.మీ. పొడవైన 32 ప్రధాన రహదారులు, ఎల్‌పీఎస్‌ లేఅవుట్‌లలో 1250 కి.మీ. పొడవైన రహదారులు, బలహీనవర్గాల వారికి ఐదు వేల ఇళ్లు నిర్మిస్తున్నామని వివరించారు. సచివాలయం నిర్మాణానికి టెండర్లు పిలిచామని, శాసనసభ, హైకోర్టు భవనాలకు త్వరలోనే టెండర్లు పిలుస్తామని తెలిపారు. స్టార్టప్‌ ప్రాంతంలో జూన్‌ 7 నుంచి సింగపూర్‌ సంస్థల కన్సార్షియం పనులు ప్రారంభిస్తుందని చెప్పారు.

cbn amaravati 20052018 2

రాజధాని నిర్మాణానికి ఉదారంగా నిధులిచ్చేందుకు ముందుకు రావాలని కేంద్ర ప్రభుత్వాన్ని మరోసారి డిమాండ్‌ చేస్తున్నట్టు ముఖ్యమంత్రి తెలిపారు. ‘‘ఇక్కడ వచ్చే డబ్బులు వాళ్లకు కావాలి. రాజధానికి మాత్రం ఒక్క విగ్రహానికిచ్చినన్ని డబ్బులు కూడా ఇవ్వలేదు. ప్రస్తుతం రూ.24 వేల కోట్ల పనులు జరుగుతున్నాయి. వీటిపై సెంట్రల్‌ ఎక్సైజ్‌, సర్వీస్‌ ట్యాక్స్‌ వంటి రూపాల్లో కేంద్రానికే ఎక్కువ ఆదాయం వస్తుంది. మొత్తం డబ్బులు వాళ్లే తీసుకుంటూ నిధులివ్వకపోవడం దుర్మార్గం. ఇది ప్రజల కష్టార్జితం. రైతులు రూ.50 వేల కోట్ల భూమిని రైతులు ఉదారంగా ఇచ్చారు. ఇక్కడి నుంచి రూ.వందల, వేల కోట్ల ఆదాయం తీసుకుంటున్నప్పుడు కేంద్రానికి బాధ్యత లేదా?...’’ అని చంద్రబాబు నిలదీశారు.

cbn amaravati 20052018 3

రాజధాని నిర్మాణానికి అడ్డుపడాలని చూస్తున్నారని, కోర్టుల్లో కేసులు వేస్తున్నారని, లేనిపోని విమర్శలు చేస్తున్నారని పేర్కొన్నారు. ‘‘మీరు చేస్తున్న విమర్శల వల్ల కొందరు ఇక్కడ పెట్టుబడులు పెట్టాలా? వద్దా? అని ఆలోచిస్తున్నారు. మీరు రాజధానికి తీవ్ర నష్టం చేస్తున్నారు. మీకు చేతనైతే సహకరించండి... లేకపోతే ఊరుకోండి...’’ అని ఆయన వ్యాఖ్యానించారు. రాజధానికి అడ్డుపడేవారు చరిత్రహీనులుగా మిగిలిపోతారన్నారు. ఎటు చూసినా హరితవనాలు, పచ్చికబయళ్లు, జలాశయాలతో అమరావతిని అత్యంత అహ్లాదకరంగా తీర్చిదిద్దుతామని చెప్పారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read