ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి ప్రాంతలో పర్యటిస్తున్నారు. ముందుగా ఉండవల్లిలోని తన నివాసం నుంచి ప్రారంభం అయిన చంద్రబాబు, పక్కనే ఉన్న ప్రజా వేదిక వద్దలు వెళ్లి, అక్కడ ఇంకా ఉన్న శిధిలాలను పరిశీలించారు. తరువాత, ఆయన అక్కడ నుంచి నేతలు, కార్యకర్తలు, రాజధాని రైతులతో కలిసి, అమరావతి శంకుస్థాపన చేసిన, ఉద్దండరాయునిపాలెం వద్దకు చేరుకున్నారు. అక్కడ శంకుస్థాపన స్థలంలో, వివిధ గ్రామాల నుంచి తెచ్చిన మట్టి దగ్గర, అమరావతి మట్టికి చంద్రబాబు సాష్టాంగ నమస్కారం చేశారు. అయితే పర్యటన సందర్భంగా, ఒక ఇంటిలో నుంచి, మహిళలు పరిగెత్తుకుంటూ రావటం, వారి చేతిలో చంద్రబాబు ఫోటో ఉండటం చూసి, అందరూ ఆశ్చర్యపోయారు. వీరిని చూసిన వారు, ఈ రైతులు, సమయం కోసం, సహనం చూపుతున్నారు అంటే వీరికి కడుపులో ఎంత బాధ ఉందొ అర్ధమవుతుంది, అంటూ వ్యాఖ్యానించారు. చంద్రబాబు కూడా వారికి అభివాదం చేసారు.

cbn 2811219 2

చంద్రబాబు పర్యటనలో ఇదే హైలైట్ సీన్ గా ఉంది. సోషల్ మీడియాలో కూడా, దీనికి సంబంధించిన ఫోటోలు చెక్కర్లు కొడుతున్నాయి. అయితే మరో పక్క, చంద్రబాబు పర్యటనను అడ్డుకుంటూ, వైసీపీ సానుభూతిపరులు హడావిడి చేసారు. పర్యటన మొదట్లో, చంద్రబాబు బస్సు పై రాళ్ళు వెయ్యటంతో, చంద్రబాబు ప్రయాణిస్తున్న బస్సు అద్దం కూడా పగుళ్ళు వచ్చింది. అయినా అవేమీ లెక్క చెయ్యకుండా చంద్రబాబు ముందుకు వెళ్లారు. తరువాత పరిస్థితి సద్దుమణిగింది. చంద్రబాబు ఏ గ్రామానికి వెళ్ళినా, అక్కడ ప్రజలు, రోడ్డుకు ఇరు వైపులా నుంచుని స్వాగతం పలికారు. చంద్రబాబు ఇప్పటికే 70 శాతం పూర్తయిన, భవనాలను పరిశీలిస్తూ, పర్యటన కొనసాగిస్తున్నారు.

cbn 2811219 3

ఈ సందర్భంగా చంద్రబాబు మీడియాతో మాట్లాడుతూ రాజధాని అమరావతిని, కొంత మంది మంత్రులు, శ్మశానంతో పోల్చడం చాలా బాధేసిందన్నారు. జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం అమరావతిని నిర్లక్ష్యం చేస్తుందని, ఒక పద్దతి ప్రకారం చంపేస్తుందని అన్నారు. వీళ్ళు చేసే పని వల్ల, భావితరాల భవిష్యత్‌ను నాశనం చేస్తున్నారని విమర్శించారు. మన రాష్ట్రానికి ఒక రాజధాని వద్దా ? తెలంగాణా కు హైదరాబాద్ ఉన్నట్టు, కర్ణాటకకు బెంగుళూరు ఉన్నట్టు, తమిళనాడుకు చెన్నై ఉన్నట్టు, మనకు ఒక అమరావతి వద్దా, ఈ ప్రభుత్వం ఉద్దేశం ఏమిటి అంటూ ప్రశ్నించారు. వీరి చర్యతో, రాష్ట్రం నష్టపోతుందని, పెట్టుబడులు ఆగిపోతున్నాయని, ఆవేదన వ్యక్తం చేసారు. చంద్రబాబు పర్యటన ఇంకా కొనసాగుతూనే ఉంది.

Advertisements

Advertisements

Latest Articles

Most Read