వైసీపీ అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డి పై, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేసారు. తన పై ఉన్న కేసుల్లోని సాక్ష్యాలను జగన్ తారుమారు చేసే ప్రయత్నం చేస్తున్నారని, కేంద్రం, దర్యాప్తు సంస్థలు ఇవన్నీ గమించాలని చంద్రబాబు కోరారు. తన అవినీతిని వెలికితీసిన అధికారుల పై, తనకు అధికారం ఉందని, జగన్ మోహన్ రెడ్డి కక్ష తీర్చుకుంటున్నారని, చంద్రబాబు అన్నారు. ఈ కక్ష సాధింపులో భాగంగానే, ఈడీబీ మాజీ సీఈవో ఉన్న జాస్తి కృష్ణకిశోర్‌ను అర్ధాంతరంగా సస్పెండ్ చేసారని చంద్రబాబు అన్నారు. నిన్న అసెంబ్లీ అయిన తరువాత, మంగళగిరిలో ఉన్న తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో చంద్రబాబు మీడియాతో మాట్లాడతారు. గతంలో జగన్ కు చెందిన జగతి పబ్లికేషన్స్ కంపెనీలో జరిగిన స్కాంను, అప్పటి ఆదాయపు పన్ను అధికారుల బృందంలో ఒకరైన కృష్ణకిశోర్ బయట పెట్టారని, ఆ అక్కసుతోనే, ఇప్పుడు అధికారం ఉంది కదా అని, ఇష్టం వచ్చినట్టు కక్ష తీర్చుకుంటున్నారని చంద్రబాబు అన్నారు.
జగతి పబ్లికేషన్స్‌లో 10 రూపాయలు ఉన్న షేర్ ని, రూ.360 ప్రీమియం విలువతో అమ్మేశారని, ఇదంతా క్విడ్ ప్రోకోలో జరిగిన భాగంలో జరిగిందని, అప్పట్లో ఐటి డిపార్టుమెంటులో ఉన్న కృష్ణ కిషోర్ విచారణ చేసి, బయట పెట్టారని చంద్రబాబు అన్నారు. ఇదే విషయం తరువాత సిబిఐ, కోర్ట్ లు కూడా అంగీకరించాయని అన్నారు. అయినా ఈడీబీ సీఈవోగా, కృష్ణకిషోర్ కి, భూములిచ్చే అధికారం గానీ.. కంపెనీలకు రాయితీలిచ్చే అధికారం గానీ లేవని, కేవలం ప్రచారం చెయ్యటం, పరిశ్రమలతో సంప్రదింపులు వంటి కార్యక్రమాలే ఉంటాయని చంద్రబాబు అన్నారు. అసలు ఆయనకు అధికారాలే లేని చోట, అక్రమాలు జరిగాయాని నెపం నెట్టి, ఆయన్ను కావాలని కక్ష పూరితంగా సస్పెండ్ చేసారని అన్నారు.
తన అవినీతి వెలికితీసిన వారిని సస్పెండ్ చేస్తూ, తన అవినీతికి సహకరించిన సహా నిందితులకు, మంచి పోస్టింగులు, పదవులు ఇస్తున్నారని అన్నారు. మరో నిందితురాలైన శ్రీలక్ష్మిని ఢిల్లీలో ప్రతి చోట తిప్పుతున్నారని అన్నారు. ఎంపీగా ఉన్నప్పుడే సాక్ష్యాలను తారుమారు చేశారని, సీఎంగా ఉంటే ఆ అవకాసం ఇంకా ఎక్కువ అని సీబీఐ చెప్పిందని, జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే, జగన్ సాక్ష్యాలను ప్రభావితం చేస్తున్నారని తెలుస్తుందని చంద్రబాబు అన్నారు. జగన్ చేసే పనులు అన్నీ, బెయిల్ నిబంధనలకు వ్యతిరేకంగా జరుగుతున్నాయని, అన్నీ ఉల్లంఘిస్తున్నారని, కేంద్రం, సిబిఐ, ఈ పరిణామాలు అన్నీ గమనించాలని చంద్రబాబు అన్నారు. అధికారులను బెదిరించే ధోరణిలో ఈ చర్యలు ఉన్నాయని చంద్రబాబు అన్నారు. ఇవన్నీ మాట్లాడతాం అనే, అసెంబ్లీ జరగనివ్వకుండా చేస్తున్నారని చంద్రబాబు అన్నారు.