రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో వ్యాధులు ప్రబలడం పై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఈ రోజు హైదరాబాద్ వెళ్ళే ముందు పర్యవేక్షించారు. అసెంబ్లీ సమావేశాల్లో బిజీగా ఉంటూనే అంటువ్యాధుల పై నిశితంగా దృష్టి సారించారు చంద్రబాబు. అంటువ్యాధులపై అధికారులతో టెలికాన్ఫరెన్స్‌లు, రియల్ టైమ్ గవర్నెన్స్ ద్వారా సమీక్షలు చేపట్టారు. టెలికాన్ఫరెన్స్‌ల ద్వారా అధికారులకు పలు మార్గదర్శకాలు చేసారు. ప్రజల్లో సంతృప్తి నిన్న ఎక్కువ ఉండి, ఈరోజు తగ్గడంపై’ ప్రశ్నల వర్షం కురిపించారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు నేరుగా ప్రజల నుంచే రోజువారీ ఫీడ్ బ్యాక్ తీసుకుంటున్నారు. 

cbn 0809201 2

అలాగే వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు, కలెక్టర్లకు ఎప్పటికప్పుడు దిశానిర్దేశం చేస్తున్నారు. వైద్య, పట్టణాభివృద్ధి, గ్రామీణాభివృద్ధిశాఖలు సమన్వయంగా పనిచేయాలని చంద్రబాబు ఆదేశించారు. అంటువ్యాధులు ప్రబలడం పై అధికారులతో సమీక్షలు చేపట్టిన చంద్రబాబు, డెంగీ, మలేరియా వ్యాధుల తీవ్రతపై నిశితంగా దృష్టి సారించాలని, తన కార్యాలయ సిబ్బందికే చెప్పారు. ఈ వారం రోజులు అత్యవసర పరిస్థితి, సీరియస్‌గా పనిచేయాలని, సోమవారానికల్లా మార్పు రాకపోతే స్పాట్‌లోనే సస్పెండ్ చేస్తానని అధికారులను సీఎం హెచ్చరించారు. అసమర్ధతను, నిర్లక్ష్యాన్ని సహించే ప్రసక్తేలేదని స్పష్టం చేశారు.

cbn 0809201 3

కిందిస్థాయి నుంచి పైస్థాయి వరకు పూర్తి బాధ్యతగా వ్యవహరించాలని ఆదేశించారు. ‘మనం ఉన్నది ప్రజల కోసమే, వారికి సేవలు అందించడం కోసమే’ అని అన్నారు. ఎమ్మెల్యేలు, ఎంపీలు క్షేత్రస్థాయిలో పర్యటించాలని తెలిపారు. వ్యాధిగ్రస్తులకు వైద్యసేవలు అందేలా శ్రద్ధ వహించాలని.. విశాఖలో 72వార్డులకు ఒక్కో సీనియర్ అధికారిని నియమించాలని అధికారులను చంద్రబాబు ఆదేశించారు. ప్రజారోగ్యానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని సియం చంద్రబాబు స్పష్టం చేశారు. నిర్లక్ష్యంగా వ్యవహరించే అధికారులు, సిబ్బందిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. వైద్యం, ఆరోగ్య రంగంపై ప్రత్యేక శ్రద్ధ చూపుతూ భారీగా నిధులు కేటాయిస్తున్నప్పటికీ వైద్యులు, నర్సులు ఇతర సిబ్బంది, మౌలిక సదుపాయాల కొరతతో ఆశించిన ఫలితాలు రాకపోతే సహించేది లేదని, అధికారులకి తేల్చి చెప్పారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read